• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి’

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మార్చి 26న అంకురార్పణ, మార్చి 27న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో శ్రీ వీ. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సదుపాయాలు, పార్కింగ్, రవాణా, తదితర ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని సూచించారు.

March 2, 2026 / 06:31 PM IST

సేవల్లో నాణ్యత పెంచండి: చంద్రబాబు

GNTR: రాష్ట్రంలోని అన్ని శాఖలు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సమర్థత పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్‌, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ 80 నుంచి 90 శాతం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 2, 2026 / 06:30 PM IST

సమస్యలను పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి

NLR: బుచ్చి పట్టణంలోని రేబాల కాలువ చెత్తాచెదారంతో నిండిపోయి దుర్గంధమైన వాసన వస్తుందని బీజేపీ నాయకులు నగర కమిషనర్ బాలకృష్ణకు తెలియజేశారు. పలు సమస్యలపై జిల్లా ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కాలువలో నీళ్లు ప్రవహించే విధంగా చెత్తను తొలగించాలన్నారు. మలిదేవి బ్రిడ్జి వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.

March 2, 2026 / 06:30 PM IST

‘మీకోసం’లో 122 అర్జీలు

కృష్ణా: ప్రజల నుంచి అందే ‘మీకోసం’ అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని JC ఎం. నవీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 122 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖలు సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

March 2, 2026 / 06:30 PM IST

పేలుడు ఘటన.. మరికొందరి పరిస్థితి విషమం

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే వారి ఆరోగ్యంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ స్పందించారు. చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరో వ్యక్తికి 75 శాతం కాలిన గాయాలయ్యాయని వివరించారు.

March 2, 2026 / 06:30 PM IST

‘పార్టీ నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే’

ప్రకాశం: దర్శి వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం వంటి అంశాల గురించి వారితో చర్చించారు. గ్రామస్థాయి నుండి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 06:30 PM IST

గ్రామ అధ్యక్షుడిని పరామర్శించిన.. కాంగ్రెస్ నేతలు

MHBD: బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దూదిమెట్ల మెహన్ మాతృమూర్తి దశదినకర్మ ఘనంగా నిర్వహించారు. ఈ దశదిన కర్మలో కాంగ్రెస్ మండల కంబాల ముసలయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాస్కర్ తదితరులు ఉన్నారు.

March 2, 2026 / 06:29 PM IST

ప్రజాశ్రేయస్సే శ్రీపాదరావు ధ్యేయం: కలెక్టర్

NRML: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీపాదరావు నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

March 2, 2026 / 06:29 PM IST

లాఠీచార్జ్ ఆరోపణలను ఖండించిన సీఐ

ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ వస్తున్న వార్తలను వన్ టౌన్ సీఐ కరుణాకర్ ఖండించారు. నిరుపేదలపై పోలీసులు దాడులు చేశారనేది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. మీడియా మిత్రులకు కూడా కనిపించని లాఠీచార్జ్ ఘటనను జరిగినట్లుగా ప్రచారం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

March 2, 2026 / 06:28 PM IST

బస్సు ఢీకొని వ్యక్తి మృతి

NDL: కొత్తపల్లి గ్రామ సమీపంలో నంద్యాల -ఆత్మకూరు రహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు పల్సర్ బైక్‌ను ఢీకొనడంతో విశ్వ నగర్‌కు చెందిన నాగరాజు(43) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మకూరు వైపు వేగంగా వెళ్తున్న బస్సు బైక్ను ఢీకొట్టిందని తాలూకా పోలీసులు తెలిపారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 2, 2026 / 06:28 PM IST

జిల్లా వ్యాప్తంగా ’30 పోలీస్ యాక్ట్’ అమలు: ఎస్పీ

WNP: జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజల సాధారణ జీవనాన్ని నిరంతరాయంగా కొనసాగించడం, అనవసర గుమికూడింపులు నివారించడం లక్ష్యంగా మార్చి 31 వరకు 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉంటుందని ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు భారీ స్థాయి సమావేశాలు నిర్వహించరాదన్నారు.

March 2, 2026 / 06:28 PM IST

రోజూ ఎన్ని నిమిషాలు నడవాలి

వారానికి 120 నిమిషాలు వాకింగ్ చేస్తే మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 75 నిమిషాల పాటు నడిస్తే రెండేళ్లు యంగ్‌గా కనిపిస్తారు. రోజుకి 60 నిమిషాల పాటు నడిస్తే ఒబెసిటీ ప్రమాదం సగానికి పైగా తగ్గుతుంది. రోజుకి 40 నిమిషాల నడకతో గుండె సంబంధిత జబ్బులకు స్వస్తి పలకొచ్చు.అదే 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఒత్తిడి, ఆందోళన అదుపులోకి వస్తాయి.

March 2, 2026 / 06:28 PM IST

జూద స్థావరంపై పోలీసులు దాడి

CTR: గుడిపాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ప్రసాద్ సిబ్బందితో కలిసి జూదంపై దాడి నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, మరో ముగ్గురు పరారైనట్లు తెలిపారు. ఘటనాస్థలంలో రూ. 4,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. అందరూ రామాపురం గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

March 2, 2026 / 06:25 PM IST

ఘనంగా శ్రీపాదరావు జయంతి

KNR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభమాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలోఅధికారికంగా ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ బస్టాండ్ చౌరస్తాలో గల శ్రీపాదరావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్,మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.

March 2, 2026 / 06:25 PM IST

‘రబీ సీజన్‌కు జిల్లాలో యూరియా కొరత లేదు’

VZM: రబీ సీజన్ 2025-26కు జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు అవసరమైన యూరియాలో ఎక్కువ భాగం సరఫరా కాగా, 5,398 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. రబీ సీజన్‌లో ఎటువంటి కొరత ఉండదని స్పష్టం చేశారు. రైతులు మట్టిపరీక్ష ఆధారంగా సమతుల ఎరువులు వినియోగించాలని సూచించారు.

March 2, 2026 / 06:25 PM IST