SRCL: వేములవాడ మున్సిపాలిటీలో నూతనంగా విలీనమైన శాత్రాజుపల్లి గ్రామం 2వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డికి గౌడ సంఘం, రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు శాలువాతో సత్కరించి, పూలమాలలతో అభినందించారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తెలిపారు.
ప్రకాశం: పొదిలిలోని పలు ప్రాంతాల్లో SI రాజేశ్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ముఖ్య డ్రైవ్ చేపట్టి వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్ వినియోగంపై ఆరా తీశారు. ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.
CTR: వి.కోట మండల కేంద్రంలో ఆదివారం తేనెటీగల దాడిలో 20 మంది గాయపడ్డారు. వి.కోటకు చెందిన వెంకటరమణ కుటుంబ సభ్యులు స్థానిక మునీశ్వరస్వామి ఆలయం వద్ద మునిదేవర కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు అగరబత్తుల పొగకు ఒక్కసారిగా రెచ్చిపోయి అక్కడున్న వారిపై దాడి చేశాయి. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
MNCL: పంట పొలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని తాండూర్ మండల విద్యుత్ AE జాన్ ప్రకటనలో సూచించారు. ఇటీవల ట్రాన్స్ ఫార్మర్లోని విలువైన రాగి తీగ, అల్యుమినియం దొంగలించే ముఠాలు ఎక్కువయ్యాయన్నారు. పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాయన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద గస్తీ కాయడం, CC కెమెరాల ఏర్పాట్లు లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
AP: నెల్లూరు GGH పిల్లల వార్డులో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఆసుపత్రిలో రోగులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఆసుపత్రిలోని మెటర్నిటీ, పిల్లల వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందన్నారు. రోగులు, సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు చెప్పారు.
W.G: తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, జూనియర్ ఇంటర్, ఐఐటీ-నీట్ తర్ఫీదు ఇచ్చే కళాశాలలో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఐదవ తరగతికి 66మందికి గాను 49 మంది, జూనియర్ ఇంటర్ లో 95 మందికి గాను 89, ఐఐటీ-నీట్ 81మందికి గాను 76మంది మొత్తం 214మంది హాజరైనట్టు ప్రిన్సిపల్ ఎం. దుర్గారావు వివరించారు.
MHBD: హోలీ పండుగ వేళ జిల్లాలో బాటసారులు, వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ఈనెల 3న హోలీ నేపథ్యంలో మహిళలు, చిన్నపిల్లలు ప్రధాన రహదారులు, గ్రామాల్లోని రోడ్లపై ముళ్లచెట్లు, బండరాళ్లను రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై ముళ్ళ చెట్లు, బండరాళ్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కోనసీమ: జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా మామిడికుదురు మొగలికుదురుకు చెందిన అబ్దుల్ మున్నీర్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అమలాపురంలోని పెన్షనర్స్ భవనంలో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో తనను జాయింట్ సెక్రటరీగా ఎన్నుకొన్నట్లు ఆయన తెలిపారు. సంఘం అభివృద్ధికి పెన్షనర్స్ సంక్షేమం కొరకు తన వంతు కృషి చేస్తానని మున్నీర్ పేర్కొన్నారు.
SKLM: నియోజకవర్గ కేంద్రం పాతపట్నం ప్రధాన రహదారి పక్కన కొలువైయున్న శ్రీ పాతపట్నం నీలమణి అమ్మవారు చతుర్దశి సోమవారం ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు వందలాదిమంది భక్తులు తెల్లవారుజామున దర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. దేవదాయ శాఖ పరిశీలనలో కార్యక్రమాలు జరిగాయి.
PDPL: గోదావరిఖని సింగరేణి స్టేడియం సమీపంలో సంస్థ ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ నిర్వహణ సరిగా లేకపోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఈ పంపు ఎప్పుడు వస్తుందో తెలియదు. క్యాన్లు, బిందెలు పట్టుకొని రావడం, తిరిగి వెళ్లడం జరుగుతుంది. బాగు చేయాలని కోరుతున్నారు.
SRD: పటాన్ చెరులో భర్త భార్య, కొడుకుపై కత్తితో దాడి చేశాడు. మామిడిపల్లికి చెందిన ఆనందరావు ముత్తంగి శ్రీనివాసరెడ్డి కాలనీలో నివసిస్తున్నాడు. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడేవాడు. ఫిబ్రవరి 24న మద్యం మత్తులో వచ్చి భార్య కవిత, అడ్డుకున్న కుమారుడు ధీరజ్‌పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD శివారు నారపల్లిలో CPRI ప్రాంతీయ కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కేంద్రం ద్వారా విద్యుత్ పరికరాల పరీక్షలు, క్వాలిటీ సర్టిఫికేషన్, షార్ట్ సర్క్యూట్ పరీక్షలు, మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ వంటి సామగ్రి నాణ్యత నిర్ధారణ జరుగుతాయి. విద్యుత్ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసే ముందు CPRI టెస్ట్ చేస్తుంది.
TPT: తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు అర్జీలు స్వీకరించి, ప్రజల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన అంతర్జాతీయ చిత్రం ‘ది బ్లఫ్’పై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాను చూసిన ఆయన, SM వేదికగా తన రివ్యూను పంచుకున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక నటన అద్భుతంగా ఉందని, పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిందని మహేశ్ కొనియాడాడు. గ్లోబల్ స్టార్ స్థాయికి తగ్గట్లుగా ప్రియాంక సత్తా చాటిందని పేర్కొన్నాడు.
MDCL: రోడ్డు పై వాహనదారుల డ్రైవింగ్, ట్రాఫిక్ నియమ నిబంధనలపై తేడా వచ్చిందా..? వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కూకట్ పల్లి, KPHB, బాలానగర్ ప్రాంతాల్లో నెంబర్ ప్లేట్ కనిపించకుండా డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం లాంటి వారిపై చర్యలు తీసుకుంటూ హెచ్చరించారు. ఎవరైనా హెల్మెట్ ధరించకపోయినా 9490617346 వాట్సప్ చేయండి.