AP: పరామర్శల పేరుతో జగన్ బలప్రదర్శన చేస్తున్నారని, అంబులెన్సులకూ దారి ఇవ్వట్లేదని CM చంద్రబాబు విమర్శించారు. తమ టైర్ల కింద మనుషుల్ని తొక్కించేసి.. ప్రభుత్వంపై నెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు తెలిసింది విధ్వంసమేనని దుయ్యబట్టారు. రప్పా రప్పా అంటూ కటౌట్లకు రక్తాభిషేకం చేయించడం ద్వారా హింసను ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
VKB: దోమ మండల పరిధిలోని మోత్కూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం స్టేజ్ నిర్మించాలని కోరుతూ సర్పంచ్ ఆనంద్‌కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండు నిన్న వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ప్రతిభను చాటేందుకు పాఠశాల ఆవరణలో వేదిక అవసరమని ఈ సందర్భంగా వివరించారు.
HYD: సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి ఎంపికైన మొత్తం 20 మందిలో 8 మంది మన జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం. లక్ష్మీ రచన 178వ ర్యాంక్, మెరుగు కౌశిక్ 399, ప్రీతీ రాపర్తి 468, విక్రమ్ సింహా రెడ్డి 682, విజయ్ సింహా రెడ్డి 682, శ్రీరామ్ హర్ష 823, ప్రత్యూష 908, దీపక్ శర్మ 951 ఉత్తమ ర్యాంకులు సాధించారు.
కడప: ఉక్కాయపల్లెలోని ఎకో పార్క్ అభివృద్ధి కోసం మార్చి 8న ఉదయం 6 గంటలకు ‘క్లీన్ కడప-బయో డైవర్సిటీ’ పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం మేయర్ సురేష్ కుమార్, కమిషనర్ రాకేష్ చంద్ర ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు.
NRPT: మరికల్ రైతు వేదికలో SMAM పథకం కింద మంజూరైన పవర్ స్ప్రేయర్లు, కల్టివేటర్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మరికల్ మండలానికి 5, ధన్వాడకు 10 స్ప్రేయర్లు అందజేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ సదాశివరెడ్డి రైతులకు అవసరమైన యంత్రాలను సబ్సిడీతో అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రహమాన్ ఖాన్, నాయకులు పాల్గొన్నారు.
MBNR: జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఇప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ముడా నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను హైమాస్ట్ విద్యుత్ దీపాలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
SRCL: వేములవాడలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో భక్తజన సంద్రమైంది. ప్రతి ఆలయంలో శివరాత్రి రోజున శివ కళ్యాణాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో కామ దహనం అనంతరం పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇసుక చల్లితే రాలనంత జనంతో కిటకిటలాడుతుంది.
NRML: జిల్లాలో SSC పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో భోజన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్న పరీక్షలకు జిల్లాలో 9750 మంది విద్యార్థులు హాజరవుతున్నారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
NIPERలో 2 అసిస్టెంట్ ప్రొఫెసర్, 1 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. PhD, MBBS, M.Pharm, BTech, MTechలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల 40 ఏళ్ల లోపువారు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.1000. SC/ST/PwBDలకు ఫీజుల లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.78,000.. ఆఫీసర్‌కు రూ.56,100 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం సైట్: www.niper.gov.in
SRD: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మిషన్ శక్తి’ పథకం మహిళా సాధికారతకు ఎంతో దోహదపడుతుందని సంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో నిర్వహించిన సర్పంచుల శిక్షణా శిబిరంలో ఆమె మాట్లాడారు. ‘బేఠీ బచావో-బేఠీ పడావో’ ద్వారా బాలికల విద్య, రక్షణ, లింగ నిర్ధారణ పరీక్షల నివారణే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు.
NLG: పేకాట స్థావరంపై దాడిచేసిన పోలీసులు ఐదుగురు జూదరులను అరెస్టు చేశారు. వన్ టౌన్ సీఐ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడం పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం రాత్రి కొందరు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచరం మేరకు తనిఖీలు చేయగా.. ఇస్మాయిల్, శ్రీధర్, నాగేందర్, నాగేందర్, అంజయ్యను పట్టుకున్నట్లు తెలిపారు.
PDPL: పర్యావరణ పరిరక్షణకు అందరం కలిసి కృషి చేద్దామని రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కాన్ సింగ్ పిలుపునిచ్చారు. పొల్యూషన్‌ను నివారించి పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రామగుండం సింగరేణి ప్రాంతం బొగ్గు గనులు NTPCకు భారతదేశంలోనే ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందన్నారు.
BHNG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రెండో రోజు శుక్రవారం మహిళా క్రీడా పోటీలు కొనసాగినట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె ధనంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా టీజేఏసీ అధ్వర్యంలో స్పీడ్ వాక్, టెన్నికాయిట్ సింగిల్, క్యారమ్స్, స్పీడ్ వాక్ నిర్వహించినట్లు తెలిపారు.
E.G: జిల్లాలోని గ్రామాల్లో ఇంటి పన్నులు, ఇతర పన్నులు సకాలంలో చెల్లించి గ్రామ పంచాయితీలకు సహకరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయితీలలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు, ఇతర పన్నులు, గత సంవత్సరాల బకాయిలతో కలిపి మొత్తం రూ.126.71 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు.
JGL: వెల్గటూర్ మండలం జగదేవపేట శివారులో గంజాయి పట్టుబడింది. ఎస్సై పి.ఉదయ్ కుమార్ పోలీస్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొండాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్, కళ్యాణ్ నిషేధిత గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.