• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి’

JGL: వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు, కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. ఉచిత శిక్షణలను వినియోగించుకొని యువత ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని సూచించారు.సేవా భారతి ఎన్నో ఏళ్లుగా నిరుపేదలకు విద్య,ఉపాధి శిక్షణ అందించడం అభినందనీయమన్నారు.

March 3, 2026 / 08:25 AM IST

గత నెలలో AMCల ఆదాయం ఏంటంటే..!

కడప జిల్లాలో 11 వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)లు ఉన్నాయి.వీటిద్వారా గత నెలలో మార్కెట్ సెస్ రూపంలో రూ.1.55 కోట్లు ఆదాయం లభించింది. AMCల వారీగా ఆదాయం రూ.లక్షల్లో ఇలా ఉంది. కడప-18.95, ప్రొద్దుటూరు-20.35, బద్వేల్-29.77, జమ్మలమడుగు-16.64, పులివెందుల-15.48, రాజంపేట-2.80, మైదుకూరు-17.59, కమలాపురం-17.15, సిద్ధవటం-0.47, ఎర్రగుంట్ల-11.49, సింహాద్రిపురం-5.14 లక్షలుగా ఉన్నాయి.

March 3, 2026 / 08:25 AM IST

విద్యార్థిపై దాడి.. ఆరోపణలేనన్న ప్రిన్సిపల్

నిర్మల్‌: విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం నిర్మల్‌లోని చాణక్య స్కూల్ 9వ తరగతి విద్యార్థిని ప్రిన్సిపల్ హరీష్ బూటుకాళ్లతో కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్సకు రూ. 2 లక్షలు ఖర్చయ్యాయని అతడి తండ్రి తెలిపారు. అట్రాసిటీ కేసు నమోదు చేయాలని LHPS నేతలతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

March 3, 2026 / 08:24 AM IST

రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు

KNR: గంగాధర మండల కేంద్రంలో వరి పంట పొలాలను సోమవారం మండల వ్యవసాయ అధికారి ఆర్.శ్రీనివాస్ పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి పంటకు అగ్గి తెగులు సోకే అవకాశం ఉంటుందన్నారు. రైతులందరూ ముందు జాగ్రత్తగా ఐసొప్రోత్రయోలిన్ 1.5ml /లీటర్ నీటికి లేదా కాసుగా మైసిన్ 2ml/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

March 3, 2026 / 08:23 AM IST

‘వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి’

HNK: వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పైప్‌లైన్ల లీకేజీలను తక్షణమే అరికట్టాలని, రిజర్వాయర్లలో నీటి స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

March 3, 2026 / 08:21 AM IST

నగరంలో ట్రాఫిక్ కష్టాలు.. ఎవరి లోపం ఎంత..?

నెల్లూరు నగరంలో అస్తవ్యస్త పార్కింగ్, నిబంధనల ఉల్లంఘనతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ఆర్టీసీ బస్టాండ్, మినీ బైపాస్ ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులు, ఆటోల వల్ల రోడ్లు ఇరుకవుతున్నాయి. గతేడాది 3,230 ఓవర్ స్పీడ్, 1,893 రాంగ్ పార్కింగ్ కేసులు నమోదయ్యాయి. అధికారులు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు క్రమశిక్షణ పాటించాలని పోలీసులు కోరుతున్నారు.

March 3, 2026 / 08:19 AM IST

ఇంగ్లిష్ ఒలంపియాడ్‌లో సఫియా టాప్

NDL: నేషనల్ ఇంగ్లిష్ ఒలంపియాడ్ 2025-26 పరీక్షల్లో ఆళ్లగడ్డ (M) కోట కందుకూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని సఫియా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సర్టిఫికెట్, మొమెంటోతో పాటు లెనోవో ట్యాబ్ అందుకున్నట్లు ప్రిన్సిపల్ రాజు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా సఫియాను ఉపాధ్యాయలు ప్రత్యేకంగా అభినందించారు.

March 3, 2026 / 08:19 AM IST

వికారాబాద్‌లో మహిళా దారుణ హత్య

VKB: నవాబ్‌పేట మండలం ఎల్లకొండ సమీపంలో మహిళా దారుణ హత్యకు గురైంది. ఎత్తిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బాలమణిని(45) గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి అత్యంత క్రూరంగా హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

March 3, 2026 / 08:18 AM IST

యాదగిరిగుట్ట ఆలయం మూసివేత

TG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం దృష్ట్యా ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రేపు ఉదయం 3 గంటల వరకు ఆలయాన్ని అర్చకులు బంద్ చేయనున్నారు. సంప్రోక్షణ, ఆలయ శుద్ధి అనంతరం నిత్యా పూజలు చేసి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.

March 3, 2026 / 08:18 AM IST

ఈ నెల 17 వరకు ఆన్‌లైన్లో ఈఏపీసెట్ దరఖాస్తులు

KKD: జేఎన్టీయూ నిర్వహించే ఏపీ ఈఏపీసెట్(AP-EAPSET)-2026 పరీక్షల దరఖాస్తు గడువు వివరాలను కన్వీనర్ డాక్టర్ ఎన్.మోహనరావు విడుదల చేశారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం వివిధ స్థాయిల్లో ఆలస్య రుసుములతో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 4 నుంచి 6 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు సమయం ఉంటుందన్నారు.

March 3, 2026 / 08:18 AM IST

చంద్రగ్రహణం ఎఫేక్ట్.. భీమేశ్వర ఆలయం మూసివేత

SRCL: చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మూసి వేశారు. ఆలయ అర్చకులు వేకువ జామున ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం 6.15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. గ్రహణం ముగిసి న అనంతరం సాయంత్రం 7.15 గంటలకు పుణ్యాహవచనం నిర్వహిం చి, ఆలయం అంతట సంప్రోక్షణ చేపట్టి, తెరుస్తామన్నారు.

March 3, 2026 / 08:17 AM IST

‘అవరాపన్ 2’.. మలేసియాలో ముగింపు సన్నివేశాలు

హీరోయిన్ దిశా పటానీ ప్రస్తుతం ‘అవరాపన్ 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మలేసియాలో చివరి షెడ్యూల్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకుందట. దిశ, ఇమ్రాన్‌ల ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.

March 3, 2026 / 08:16 AM IST

‘రైతులకు ఫార్వర్డ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి’

పెద్దపల్లి: మండలంలోని అందుగులపల్లి గ్రామ రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఉపసర్పంచ్ స్వప్న అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.

March 3, 2026 / 08:16 AM IST

హోలీ శుభాకాంక్షలు తెలిపిన.. మంత్రి

MLG: హోలీ పండుగ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలకు, అధికారులకు రాష్ట్ర మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. రసాయనిక రంగులు వాడకుండా సహజ సిద్ధమైన రంగులనే ఉపయోగించాలని, ఇతరుల ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ వేడుకలు నిర్వహించాలని కోరారు.

March 3, 2026 / 08:15 AM IST

ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్ల పరిస్థితి దారుణం!

సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకుల పరిస్థితి దారుణంగా ఉంది. న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తామని పెద్దలు చెబుతున్నా, వాస్తవం మాత్రం భిన్నంగా ఉందని యువ దర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్‌లలో స్టోరీ లిజనర్స్ కొత్త వారిని కలవడానికి ఇష్టపడరని, అపాయింట్‌మెంట్ ఇచ్చి కూడా గంటల తరబడి వెయిట్ చేయించి ఆఖరి నిమిషంలో అబద్ధాలు చెబుతారని వాపోతున్నారు.

March 3, 2026 / 08:14 AM IST