• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పంపు హౌస్ వద్ద పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

JGL: మల్యాల మండలం రాంపూర్ పంప్ హౌస్ వద్ద వరద కాలువలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు పూర్తి నిరాధారమన్నారు. వేసవి కరువులో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

March 2, 2026 / 10:38 AM IST

రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి

AP: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను 2 నెలల్లో అందుబాటులోకి తేవాలని ఆదేశించినట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. అంచనాలు తయారు చేసి, మంజూరుకు సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్న రైతులకు ఊరట లభించనుందని చెప్పారు. 46,113 మంది రైతులు కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు.

March 2, 2026 / 10:37 AM IST

రాజీమార్గమే రాజమార్గం: ఎస్సై

KNR: పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించనున్న లోక్ అదాలత్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి, సామరస్య వాతావరణంలో కేసులు పరిష్కరించుకోవడానికి ఇది చక్కని వేదికని తెలిపారు. సత్వర న్యాయం పొందాలనుకునే కక్షీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 2, 2026 / 10:36 AM IST

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: TPCC చీఫ్

HNK: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. 10 రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డికి వారు సర్టిఫికెట్లను అందజేశారు.

March 2, 2026 / 10:35 AM IST

వరంగల్ మహానగరంలో వాటర్ ట్యాంకర్ల అక్రమ దందా

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో వాటర్ ట్యాంకర్ల అక్రమ వాడకం బాగా పెరిగింది. ప్రభుత్వం పేదలకు, సామాన్యులకు సరఫరా చేయాల్సిన తాగునీటిని కొందరు ట్యాంకర్ డ్రైవర్లు ప్రైవేటు ఇంటి నిర్మాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఒక ట్యాంకర్‌కు రూ.800 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

March 2, 2026 / 10:35 AM IST

‘నీటి కోసం పోరాడకుంటే భవిష్యత్ తరాలకు నష్టం’

ATP: నీటి హక్కుల కోసం పోరాడకుంటే భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతుందని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. గ్రేటర్ రాయలసీమ వాసులుగా ఏకమై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రజలంతా ఉద్యమించాలని కోరారు. రాయలసీమ ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు.

March 2, 2026 / 10:34 AM IST

రైతులకు పీఎసీఎస్ సీఈవో సూచన

MNCL: జన్నారం మండలంలోని చింతగూడా, పోన్కల్ పీఎసీఎస్‌ల ద్వారా రైతులకు యూరియా బస్తాలను అందజేస్తున్నామని చింతగూడ పీఏసీఎస్ సీఈవో కావేటి రాజయ్య తెలిపారు. చింతగూడ, పోన్కల్ పిఎసిఎస్ లకు 266 చొప్పున యూరియా బస్తాలు వచ్చాయన్నారు. యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు బస్తాలను అందజేస్తున్నామని తెలిపారు. మంగళ, బుధవారాలలో యూరియా బస్తాలు రానున్నాయని తెలిపారు.

March 2, 2026 / 10:33 AM IST

నేడు పిఠాపురంలో అర్జీలు స్వీకరణ

KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరుకుతుందని, మళ్లీ ఇవ్వనవసరం లేదన్నారు. డివిజినల్, నియోజకవర్గస్థాయి అధికారులు హాజరుకావాలన్నారు.

March 2, 2026 / 10:33 AM IST

చలో హైదరాబాద్కు తరలిన విద్యుత్ కార్మికులు

NRPT: విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుండుమల్ మండలానికి చెందిన విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు చలో హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హతను బట్టి సబ్‌స్టేషన్‌లలో ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయాలని, మీటర్ రీడింగ్ తర్వాత 30 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 11 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు.

March 2, 2026 / 10:33 AM IST

జిల్లాలో బాణసంచా కేంద్రాల్లో పోలీసుల తనిఖీలు

కోనసీమ: వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో అటువంటి ఘటనలు జరగకూడదని ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు.

March 2, 2026 / 10:33 AM IST

‘నిరుపేద రోగులకు వీల్‌చైర్లు అందించండి’

VZM: ఎవరి వద్దనైనా వీల్ చైర్లు నిరుపయోగంగా ఉంటే నిరుపేదలైన రోగులకు అందజేయాలని ఆల్ ఇండియా బాడీ ఆర్గాన్స్ డొనేషన్స్ అసోసియేషన్ ఏపీ జనరల్ సెక్రెటరీ షిణగం శివాజీ సోమవారం కోరారు. విజయనగరానికి చెందిన సైలాడ శ్రీదేవి తన తండ్రి మృతి చెందడంతో ఇంటిలో వృధాగా ఉన్న బాత్రూం స్టాండ్ కలిగి ఉన్న వీల్ చైర్‌ను గరివిడి కొండ శంభాం చెందిన నిరుపేద రోగి రామారావుకు అందజేశారు.

March 2, 2026 / 10:32 AM IST

చతుర్దశి ప్రత్యేక పూజలు అందుకున్న నీలకంటేశ్వర స్వామి

SKLM: పాతపట్నం మహేంద్ర తనయ నది ఒడ్డున చరిత్ర కలిగిన శ్రీ నీలకంటేశ్వర స్వామి పాల్గొనమాసం చతుర్దశి సోమవారం ప్రత్యేక అలంకరణతో పూజలు అందుకున్నారు. పాతపట్నం పరిసర ప్రాంతాలతో పాటు ఒడిస్సా రాష్ట్రం గజపతి ప్రాంతాల నుండి భక్తులు పాల్గొని స్వామిని దర్శించారు. భక్తులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు.

March 2, 2026 / 10:32 AM IST

కీసర కనుచూపుమెరలో పచ్చని పైరు గాలి.. పంట పొలాలు..!

HYDలో ఉరుకుల పరుగుల జీవితంలో కాస్త విశ్రాంతి, ప్రశాంతత కోసం కీసర ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పట్టణ యువత జాలిగా గడిపిస్తుంటారు. కీసర కనుచూపు మెరలో పచ్చని పంట పొలాలు, ప్రస్తుతం అందరికీ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అక్కడికి వెళ్లిన యూత్, రైతులతో మాట్లాడుతూ.. పచ్చని పైరుగాలని ఆస్వాదిస్తూ మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నట్టు తెలిపారు.

March 2, 2026 / 10:32 AM IST

సూర్య కొత్త సినిమా టైటిల్ ఇదే

తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న కొత్త సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే పేరును ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జులైలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సూర్య మార్క్ నటన, వెంకీ స్టైల్ మేకింగ్‌పై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.

March 2, 2026 / 10:32 AM IST

చింతకుంట తండాలో బీఆర్ఎస్‌లో చేరికలు

MBNR: బాలానగర్ మండలం చింతకుంట తండాలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కార్యకర్తలు స్వచ్ఛందంగా చేరుతున్నారని తెలిపారు.

March 2, 2026 / 10:31 AM IST