• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అల్లు అర్జున్ లైనప్‌లో క్రేజీ సినిమాలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆయన లైనప్‌లో ఉన్నాయి. దర్శకుడు సుకుమార్‌తో ‘పుష్ప 3’, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ‘AA23’ మూవీలు చేయనున్నాడు. అలాగే మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌తో ‘AA24’ మూవీ చేయనున...

March 3, 2026 / 09:26 AM IST

పెట్రోల్ బంకు మూత.. వాహనదారుల అవస్థలు

NLR: ఉదయగిరి, వరికుంటపాడు మండలాల సరిహద్దులోని గండిపాళెం గ్రామంలోని పెట్రోలు బంకు నెల రోజులుగా పనిచేయడం లేదు. దీంతో స్థానిక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం కోసం ఉదయగిరి, వరికుంటపాడు, పామూరు పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బంకు నిరంతరాయంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

March 3, 2026 / 09:25 AM IST

చందుర్తిలో ఘనంగా కామ దహనం

SRCL: చందుర్తి మండల కేంద్రంలో సోమవారం రాత్రి కామ దహనం ప్రజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగకు ఒక రోజు ముందు రాత్రి కాముని దహనం చేయడం ఆనవాయితీగా వస్తుంది పిడకలతో కట్టెలను పేర్చి కామ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాముని చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేసి శాస్త్రవేత్తంగా కామదాహనం నిర్వహించారు.

March 3, 2026 / 09:25 AM IST

టీడీపీ కార్యాలయంలో ఉత్సాహంగా హోళీ సంబరాలు

PPM: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం స్దానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో హోలీ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రంగులు జల్లుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అందరూ ఐక్యత, స్నేహ భావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

March 3, 2026 / 09:25 AM IST

విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి: MLA

MLG: ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షల సన్నాహాల పై MLG జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాల రవాణా పోలీసు భద్రతలోనే జరగాలని సూచించారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు.

March 3, 2026 / 09:24 AM IST

జిల్లాలో కూరగాయల ధరల వివరాలు

విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు మంగళవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ. 18, టమాటా రూ. 10, బంగాళాదుంప రూ. 13, వంకాయ రూ. 20, క్యారెట్ రూ. 24, మిర్చి రూ. 50, దొండ రూ. 28, బీట్రూట్ రూ. 18, బెండకాయలు రూ. 26, బీరకాయ రూ. 26, గోరుచిక్కుడు రూ. 28, చిలకడదుంప రూ. 30, పెన్సిల్ బీన్స్ రూ. 36, క్యాబేజీ రూ. 10, క్యాప్సికం రూ. 44గా […]

March 3, 2026 / 09:19 AM IST

బాధితుడికి అఖిల భారత యాదవ సంఘం నాయకుల పరామర్శ

MBNR: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన మహబూబ్ నగర్ వాస్తవ్యుడు నరసింహులు యాదవ్ కుటుంబాన్ని అఖిలభారత యాదవ మహాసభ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. యాదవులు పోరాట పట్టిమగలవారన్నారు.

March 3, 2026 / 09:18 AM IST

గ్రహణం సందర్భంగా రామయ్య ఆలయం మూసివేత

BDK: చంద్ర గ్రహణం సందర్భంగా నేడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రామాలయ మూసివేస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా పసుపు కొట్టి రామయ్యని పెళ్ళికొడుకుని చేసి తలంబ్రాలు కలపడం ఆనవాయితీ. నేడు గ్రహణం కారణంగా ఈ క్రతువును బుధవారం నిర్వహించే విధంగా వైదిక సిబ్బంది నిర్ణయించారు. బుధవారం దేవస్థానం రామయ్య పెళ్లి పనులు ప్రారంభం.

March 3, 2026 / 09:18 AM IST

కేశినేని చిన్ని, కొలికపూడి మధ్య మరో వివాదం

AP: గంపలగూడెం నెమలి బ్రహ్మోత్సవాల్లో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ చిన్నికి అర్చకులు పట్టువస్త్రాలు, కొలికపూడికి ముత్యాల తలంబ్రాలు అందజేశారు. దీంతో ఎంపీ చేతిలో పట్టువస్త్రాలను కొలికపూడి లాక్కున్నారు. ఆయన చేతిలో పట్టువస్త్రాలను లాక్కొనేందుకు ఎంపీ వర్గీయులు యత్నించారు. దీంతో బ్రహ్మోత్సవాల్లో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

March 3, 2026 / 09:18 AM IST

చంద్ర గ్రహణం.. బాసర ఆలయం మూసివేత

NRML: కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం మూసివేశారు. ఉదయం 7 గంటలకు అమ్మవార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన, ఉప ఆలయాలను అర్చకులు ద్వారబంధనం చేశారు. సాయంత్రం 7 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ, మహాహారతి నిర్వహిస్తామని ఏఈఓ తెలిపారు.

March 3, 2026 / 09:17 AM IST

రోడ్డుపై నీరు.. వెళ్లేదేలా?

ADB: గాదిగూడ మండలంలోని లోకారి గ్రామానికి వెళ్లే రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తోంది. గ్రామ సమీపంలో చిన్న వంకలు ఉండడంతో బ్రిడ్జి లేక నీరు రోడ్డుపైకి వస్తుంది. ఆ రహదారి మీదుగా రోజు పదుల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండగా వారికి ఆటంకం కలిగిస్తుంది. అధికారులు స్పందించి నూతన బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

March 3, 2026 / 09:17 AM IST

కామ దాహం చేసిన ఎలిగండ్ల యువకులు

NRPT: మరికల్ మండలంలోని ఎలిగేండ్ల గ్రామంలో సోమవారం రాత్రి కామ దహనాన్ని వైభవంగా నిర్వహించారు. మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా సోమవారం రోజు కామ దహనాలు నిర్వహించిన అనంతరం బుధవారం సహజసిద్ధమైన రంగులతో హోలీ నిర్వహించుకోవాలని గ్రామ సర్పంచ్ అశ్విని నరేష్ గౌడ్ గ్రామంలో చాటింపు వేశారు. యువత పెద్ద ఎత్తున కామదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 3, 2026 / 09:16 AM IST

ఈనెల 5న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్

SKLM: జిల్లాలో ఈ నెల 5న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో అంబేద్కర్ విశ్వవిద్యాలయం NSS యూనిట్, మేరా యువ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నిన్న జిల్లా జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులు ఆవిష్కరించారు.

March 3, 2026 / 09:16 AM IST

ప్రతిభకు వేదిక ‘సంసద్ ఖేల్ మహోత్సవం’

KNR: క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ‘సంసద్ ఖేల్ మహోత్సవం’ అద్భుత వేదికని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో 200 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

March 3, 2026 / 09:14 AM IST

బైక్ ఓనర్లకు GOOD NEWS

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాత BS3, BS4 మోడళ్ల కోసం ‘E20 రెట్రోఫిట్ కిట్’ను విడుదల చేసింది.  20% ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల పాత బైక్‌ల రబ్బర్, మెటల్ భాగాలు దెబ్బతినకుండా ఈ కిట్ కాపాడుతుంది. BS3, BS4 మోడళ్లకు ఇది సరిపోతుంది. కేవలం రూ.1,700 ధరతో లభించే ఈ కిట్‌లో ఓ-రింగ్స్, ట్యూబ్స్, సీల్స్ ఉంటాయి. ఈ కిట్‌తో ఇథనాల్ వల్ల కలిగే తుప్పు సమస్యను అరికట్టవచ్చు.

March 3, 2026 / 09:14 AM IST