RR: AOC కారిడార్ రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా ఆర్కేపురం ఆర్ఓబి నుంచి ఎల్బీనగర్ జోన్ TKR కమాండ్ వరకు, అక్కడి నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు చేపట్టనున్న నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.
VKB: జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు మొత్తం 272 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. మొత్తం విద్యార్థులు 8,672 మందిలో 8,400 మంది హాజరయ్యారు. ఈరోజు పరీక్ష ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు.
CTR: వెదురుకుప్పం సచివాలయ పరిధిలో జరుగుతున్న ఏకీకృత సర్వేని ఎంపీడీవో పురుషోత్తం బుధవారం తనిఖీ చేశారు. పకడ్బందీగా వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. రిజిస్టర్లు, ఫుడ్ స్టాక్ వివరాలను ఆరా తీశారు. సకాలంలో పౌష్టికాహారం పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సిబ్బంది రిషి, జయసుధ, నీరజ పాల్గొన్నారు.
మెదక్ జిల్లాకు ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని కేటాయిస్తూ రాష్ట్ర పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ ఏ.విజయ తెలిపారు. జిల్లాలోనే కేంద్రం ఏర్పాటు కావడం వల్ల స్థానిక ఉపాధ్యాయులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌కు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
MLG: HYDలో జరిగిన 4వ తెలంగాణ పోలీస్ క్రీడల్లో ములుగు జిల్లా పోలీసులు సత్తా చాటారు. రెజ్లింగ్ 63 కేజీల విభాగంలో అమిత్ కుమార్ సింగ్ సిల్వర్ పతకం సాధించగా, జూడోలో 81 కేజీలు, 82 కేజీల విభాగాల్లో మేకల నాగరాజు రెండు సిల్వర్ పతకాలు గెలిచారు. ఈ విజయాలతో ములుగు జిల్లా పోలీసులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. MLG SP కార్యాలయంలో SP విజేతలను అభినందించారు.
SKLM: జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని జనసేన నాయకులు డా.దానేటి శ్రీధర్ అన్నారు. బుధవారం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఈనెల 26 నుండి ప్రారంభంకానున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకమని అన్నారు.
AP: శ్రీకాకుళం నగరంలోని అతిసారం ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా మృతుడు సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రితోపాటు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు.
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని వ్యవసాయ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల ఓరియంటేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముందుగా దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక పాలకవర్గం సమర్థవంతమైన పాలన అందించాలన్నారు.
TPT: కల్తీ ఆహారంపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఎంపీ గురుమూర్తి ఆదేశించారు. అంగన్‌వాడీలు, డెయిరీలు,హోటళ్లు, స్వీట్లు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించాలని, కల్తీ నిర్ధారణైతే చర్యలు తీసుకోవాలని, పునరావృతమైతే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు. ప్రజలు అనుమానాస్పద ఉత్పత్తులపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
NZB: టీయు పరిధిలో (MA/MSW/MCom/MSc/MBA/MCA), ఇంటిగ్రేటేడ్ పీజీ (APE/PCH/IMBA) మొదటి, IMBA 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి మార్చి 11 వరకు మధ్యాహ్నం 2 గం.ల నుంచి 5గం.ల వరకు జరగనున్నాయన్నారు. ఫిబ్రవరి 26, 28, మార్చి 2, 4, 6, 9, 11 తేదీల్లో నిర్వహించనున్నారు.
SRCL: వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న బ్లూ కోట్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన ఘటనలో పవన్ కళ్యాణ్, రాహుల్, సుమన్ అనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు VMD పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ప్రజలు రాత్రి వేళల్లో అనవసరంగా గుమిగూడినా, అవసరం లేకున్నా బైక్ పై తిరిగినా చట్టప్రకారం చర్య తీసుకుంటామన్నారు.
ELR: ముదినేపల్లి(మం) గురజలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న చెరువులో పడి నితీశ్(2) మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు తమిళనాడులో ఉండగా, ఇక్కడ అమ్మమ్మ వీరమ్మ వద్ద పెరుగుతున్నాడు. చిన్నారిని గమనించి స్థానికులు వెంటనే గుడివాడ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
NDL: ఆత్మకూరుకు చెందిన అబ్దుల్ రషీద్ Border Security Force (బీఎస్ఎఫ్)లో ఉద్యోగం సాధించిన సందర్భంగా బుధవారం డీఎస్పీ రామాంజి నాయక్, అర్బన్ సీఐ మహేశ్వర రెడ్డి అభినందించారు. ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఛైర్మన్ పస్పిల్ మున్నా మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. దేశానికి సేవ చేసే ఉద్యోగం పొందడం గర్వకారణమని పేర్కొన్నారు.
హుజూర్‌నగర్ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. మురుగు నీటి పూడికతీత, వీధి దీపాల మరమ్మతులు, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల మెరుగుకు నిధులు కేటాయించడంపై ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. లేఅవుట్ స్థలాల పరిరక్షణతో పాటు ఎన్ఎస్పీ సమీపంలో వరద కాలువ నిర్మించాలని సమావేశంలో చర్చించారు.
W.G: జిల్లాలో ఎంపిక చేసిన 30 రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీలపై కలెక్టర్ నాగరాణి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆమె మాట్లాడారు. సీఎంఆర్ బియ్యం సరఫరాలో జాప్యం, వ్యత్యాసాలను సహించేది లేదన్నారు. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లైస్ విభాగాలకు నిర్దేశిత గడువులోగా బియ్యం అందించాలన్నారు.