‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం. నన్ను నమ్మి బాధ్యత ఇచ్చిన సంస్థకు మంచి అవుట్‌పుట్ ఇవ్వాలని టీచర్‌లా కష్టపడి పనిచేశాను. పెట్టిన ఖర్చంతా స్క్రీన్‌పై కనిపిస్తుంది. మాట ఇచ్చినట్లుగానే మంచి చిత్రాన్ని తీశాను’ అని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని సూర్య ఫైర్ వర్క్స్‌లో పేలుడుపై విచారణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మున్సిపల్ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ అధిపతి రవికృష్ణ నేతృత్వంలో కమిటీని నియమించారు. వేట్లపాలెం పేలుడుకు కారణాలేంటి?.. బాధ్యులెవరు అనే అంశాలు తేల్చాలని తెలిపింది. నెల రోజుల్లోగా నివేదిక అందజేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
SKLM: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రెండు మాసాలు ముందుగానే ప్రారంభించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. మే నెల నుంచి ఖరీఫ్ మొదలయ్యే దిశగా ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించి నీటి విడుదలకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.
సైబర్ నేరగాళ్లు కాల్ ఫార్వర్డింగ్ ట్రిక్ ఉపయోగించి వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి కాల్స్ ఫార్వార్డ్ చేస్తే, మీ వాట్సాప్ వారి చేతుల్లోకి వెళ్తుంది. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా మీ వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలియని నంబర్ల నుండి వచ్చే సూచనలపై పట్టించుకోకండి.
VSP: రుషికొండ ఐటీ పార్క్ హిల్-3లో TCS తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసి 50-100 మంది ఉద్యోగులతో పని మొదలుపెట్టింది. హిల్-2లో కాగ్నిజెంట్ ఫిబ్రవరి 16న 150 మంది సిబ్బందితో కార్యకలాపాలు ప్రారంభించింది. శాశ్వత క్యాంపస్‌ల కోసం TCSకు 21 ఎకరాలు, కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించింది.
MLG: ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామపంచాయతీ పరిధిలోని (పప్కాపూర్) కొమరం బీమ్ నగర్ ప్రాథమిక పాఠశాలను సర్పంచ్ పోరిక సరిత బుధవారం సందర్శించారు. పాఠశాల పనులు నిలిచిపోయిన విషయాన్ని జిల్లా కలెక్టర్, డీఎఫ్ఓ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానన్నారు.
PLD: మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాచర్లకు చెందిన డాక్టర్ సాంబేలు శాంతి బాయికి శ్రీ శక్తి విశిష్ట సేవా పురస్కారాన్ని అందజేశారు. విశ్వ కళావేదిక ఆధ్వర్యంలో 32 శాఖల నుంచి విశిష్ఠ సేవలు అందించిన మహిళలను ఎంపిక చేసి వారికి గజల్ శ్రీనివాస్, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు.
MDK: భావి భారత పౌరులైన విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి పిలుపునిచ్చారు. బుధవారం అక్కన్నపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
VZM: బకాయిలు ఉన్న ఇంటి, నీటి పన్నుల వసూళ్లలో భాగంగా బుధవారం రాజాం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు స్దానిక బుచ్చెంపేట సచివాలయ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.4 కోట్ల డిమాండ్‌కు గానూ ఇప్పటివరకు రూ.2.54 కోట్ల వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. మిగిలిన రూ.1.46 కోట్లు వసూలు చేయటానికి పురపాలక సంఘ ఉద్యోగులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.
BDK: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బుధవారం అత్యంత వైభవంగా 25 కలశాలతో అభిషేకాలను నిర్వహించారు. పవిత్రమైన గోదావరి నది నుంచి జలాలను తీసుకుని మేళ తాళాలతో అభిషేకం చేశారు. ఆలయ ఈవో దామోదర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
WGL: దుగ్గొండి (M) కేంద్రంలోని గిర్నిబావిలో బుధవారం శ్రీ కొమ్మల లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండ్లను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొమ్మల జాతర ఈ ప్రాంత ప్రజల్లో ఆధ్యాత్మిక విశ్వాసాలకు పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
అమ్మాయిలతో పాటు 9-26 ఏళ్ల అబ్బాయిలు కూడా తప్పనిసరిగా HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది పురుషుల్లో వచ్చే గొంతు, నాలుక, జననేంద్రియ క్యాన్సర్లను సమర్థవంతంగా అడ్డుకుంటుందని చెబుతున్నారు. పురుషులకు ఈ క్యాన్సర్లను గుర్తించే స్క్రీనింగ్ పరీక్షలు లేనందున ముందస్తు జాగ్రత్తలే ఉత్తమ మార్గం. కొత్త నియమాల ప్రకారం అబ్బాయిలకు ఒకే ఒక్క డోస్ టీకా సరిపోతుంది.
MNCL: చెన్నూర్ మున్సిపాలిటీలోని 9వ వార్డులో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో బుధవారం సోలార్ హైమస్ లైట్లను ఏర్పాటు చేశారు. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సునీత సుశీల్ ప్రారంభించారు. 9వ వార్డులో స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మంత్రి చొరవ చూపారని కౌన్సిలర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి వార్డ్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
VZM: అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం అయ్యన్నపేట మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ప్లాంట్ వద్ద నీటి సంరక్షణపై ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమం జరిపారు. క్లబ్ అధ్యక్షులు సిహెచ్ రమణ మాట్లాడుతూ.. నీటి వనరులను పొదుపుగా ఉపయోగించాలని, వృథాను అరికట్టి భవిష్యత్ తరాల కోసం నీటిని నిల్వ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
SRCL: రుద్రంగి మండల కేంద్రంలో కొలువైన శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి, ముంజ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకల్లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.