KDP: 40 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ శివానందపురం కాలనీ మెయిన్ రోడ్డును టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి నాయకత్వంలో సుమారు రూ. 30 లక్షలతో నిర్మించిన ఈ రహదారి స్థానికులకు ఎంతో ఉపశమనం కలిగించింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోడ్డు పూర్తి కావడంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
KMR: గాంధారీ మండలంలోని సిహెచ్సిలో గరివినీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధారి పరిసర ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకు ‘అమ్మఒడి’ కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం గర్భిణీలకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.
KMR: బిక్కనూరులోని ప్రసిద్ధ సిద్ధరామేశ్వర ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా రేపు మూసివేస్తున్నట్లు EO శ్రీధర్ తెలిపారు. ఉ.8 గంటల నుంచి బుధవారం ఉ.6 గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆలయ శుద్ధి అనంతరం పూజలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ఈమార్పును గమనించి సహకరించాలన్నారు.
కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు విశ్వయోగి విశ్వంజీ ఆశీస్సులు అందుకున్నారు. సోమవారం గుంటూరు జిల్లా చినకొండ్రుపాడులో విశ్వనగర్లోని విశ్వగురు పీఠంలో ఆయనను మండలి బుద్ధప్రసాద్-విజయలక్ష్మి దంపతులు దర్శించుకున్నారు. ఈ నెల 4-5 తేదీల్లో విశ్వంజీ పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సత్యసాయి: ఓబులదేవరచెరువులో పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేస్తూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ప్రకాశం: మార్కాపురం కూరగాయల మార్కెట్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించాలని వ్యాపారస్తులు సోమవారం ఆందోళన చేశారు. 30 అడుగుల దూరంలో రామాలయం, బాయ్స్ హై స్కూల్, కూరగాయల మార్కెట్, మున్సిపల్ కార్యాలయాలు ఉండడం విశేషం. బార్ షాపులో తొలగించి తమకు న్యాయం చేయాలని మహిళ వ్యాపారస్తులు డిమాండ్ చేశారు.
ATP: శింగనమల మండలం సి.బండమీదపల్లి గ్రామంలో నివాసముంటున్న కుంచపు అరుణ కుమార్తె శ్రీదివ్య వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాల శుభకార్యాలకు అండగా నిలవడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
KMR: బిచ్కుందలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 97.91% విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ జరిగిన మ్యాథ్స్, బోటనీ తదితర పరీక్షలకు సంబంధించి సెట్-బీ పరీక్ష పత్రాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 383 మంది విద్యార్థులకు గాను 375 మంది విద్యార్థులు హాజరు కాగా, 8 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
ASF: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు మాజీ స్పీకర్, స్వర్గీయ నేత దుద్దిళ్ల శ్రీపాదరావు వన్నె తెచ్చారని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం ఆయన జయంతి సందర్భంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీపాదరావు న్యాయవాదిగా ప్రజలకు మంచి సేవలు అందించారని పేర్కొన్నారు.
W.G: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మంగళవారం ఏర్పడుతుందని జనవిజ్ఞాన వేదిక జిల్లా సభ్యుడు డాక్టర్ గాదిరాజు రంగరాజు తెలిపారు. ఈ అరుదైన గ్రహణం మధ్యాహ్నం 3.21 గంటలకు గ్రహణం ప్రారంభం అవుతుందని అన్నారు. వందేళ్ల తర్వాత హోలీ పండుగ రోజు ఇలా ఏర్పడటం దీని ప్రత్యేకత. గ్రహణం మొత్తం వ్యవధి 3: 27 నిముషాలు పడుతుంది.
AP: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హింసాత్మక చర్యలు మానుకోవాలని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్ట్ దేశమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఎదురుతిరిగితే ట్రంప్ మనపై యుద్ధానికి దిగుతారని అన్నారు. మోదీ కూడా ట్రంప్‌కు బానిసగా మారారని నారాయణ విమర్శించారు.
యమహా ఇండియా XSR155 మోడల్‌లో కొత్త ‘మెటాలిక్ బ్లాక్’ బైక్‌ను రూ.1,58,990(ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. గోల్డెన్ USD ఫోర్క్స్, రెట్రో స్టైలింగ్‌తో వచ్చిన ఈ వేరియంట్ మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. అయితే, లాంచ్ అయిన 3 నెలల్లోనే కంపెనీ ధరలను పెంచింది. ప్రస్తుతం ఈ బైక్ ధరలు రంగును బట్టి రూ.1.50-1.59L మధ్య ఉన్నాయి. రెడ్ కలర్ ధర రూ.1.53 లక్షలకు చేరింది.
SRPT: మోతె మండల కేంద్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి వార్ల కల్యాణ మహోత్సవం ఇవాళ భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.
హైదరాబాద్‌లో ఇరాన్ నాయకుడి మరణానికి నిరసనగా ర్యాలీలు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు. అసదుద్దీన్ ఓవైసీకి అంత అభిమానం ఉంటే ఇరాన్ వెళ్లి యుద్ధం చేయాలని, కావాలంటే తానే ఫ్లైట్ టికెట్లు కొనిస్తానని ఎద్దేవా చేశారు. ఇరాన్‌కు అనుకూలంగా ర్యాలీలు చేస్తున్నవారిని వెంటనే రాష్ట్రం నుంచి అక్కడికి పంపించేయాలని ఆయన డిమాండ్ చేశారు.
NLG: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన టీసీసీ (TCC) డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ ఫలితాల్లో నల్గొండలోని జేఆర్ డ్రాయింగ్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. శాంభవి, శ్రీవల్లి, ప్రవస్థి, మేఘన, చందన సహా పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు అకాడమీ డైరెక్టర్ జానయ్య గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించారు.