ప్రకాశం: గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో మనం దెబ్బతిన్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మార్కాపురంలో ఇవాళ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దర్శి, ఎర్రగొండపాలెంలో ఓడిపోయామని, వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీదే అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పాను, చేసి చూపించానని చెప్పుకొచ్చారు.
JGL: రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ధర్మకర్తలు చెన్నమనేని విష్ణువర్ధన్, వంశీవర్ధన్ ఆధ్వర్యంలో ఉత్సవాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు రామకృష్ణాచార్యులు తెలిపారు. ఈనెల 26- మార్చి 5వ తేదీ వరకు ఈ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
NDL: బనగానపల్లె(మం) గులాంనబిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. బైకులో అతివేగంగా వెళుతూ.. ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో బైకులో ప్రయాణిస్తున్న యువకుడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
CTR: మార్చి 2న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని AP అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపునిచ్చారు. బుధవారం పుంగునూరులో ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగి రావాలని విజ్ఞప్తి చేశారు.
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి(మం) అప్పకొండయ్య గారిపల్లిలో ఉపాధి హామీ పనులు, దీన్నేపాడు గ్రామంలోని కోమటివాని వంక వాటర్‌షెడ్, రామరాజు వంక వాటర్‌షెడ్, కోనంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, మామిడి తోట, దొర్రి చెరువు, లక్కిరెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ హాస్టల్, సీసీ రోడ్ల పనులు, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
NRPT: యువజన సర్వీసులు, క్రీడల శాఖలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులతో మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష నిర్వహించారు. తెలంగాణను క్రీడారంగాన్ని అగ్రగామి నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
KDP: ఏసీబీ అధికారుల దాడులలో పట్టుబడిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణపై మరో కేసు నమోదైంది. ఏసీబీ సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి రూరల్ సీఐ ఇంటిలో సోదాలు నిర్వహించి 59 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బాటిళ్లను పులివెందుల ఎక్సైజ్ కార్యాలయానికి అప్పగించగా, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ చెన్నారెడ్డి బుధవారం తెలిపారు.
రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. 284/2 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన J&K.. ఆట ముగిసే సమయానికి 527/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. శుభమ్ (121) సెంచరీ చేయగా.. హసన్ (88), డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య (70), సాహిల్ (57*) అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టాడు.
SRD: పటాన్చెరు మండలం బీరంగూడ డివిజన్ పటేల్ గూడ పరిధిలోని తీగలనాగరం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం చెరువు పరిధిలో కోటి 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫెన్సింగ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు.
గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చునేవారు ప్రతి గంటకోసారి చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. మెడను నెమ్మదిగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దిశల్లో తిప్పడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. భుజాలను గుండ్రంగా తిప్పడం వల్ల మెడ కండరాలపై భారం తగ్గుతుంది. అలాగే భుజాలను పైకి, కిందకి కదల్చాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.
NTR: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. బుధవారం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందన్నారు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఫామ్‌పై ప్రస్తుత కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘బట్లర్ ఇంగ్లండ్ క్రికెట్‌కు ఎంతో కాలంగా సేవలు అందిస్తున్నాడు. కెప్టెన్‌గా T20 WCను కూడా అందించాడు. అతడి బ్యాటింగ్ సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు. అతడో పవర్ హౌస్. నాకౌట్ దశలో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ చూస్తారు’ అంటూ బ్రూక్ ధీమా వ్యక్తం చేశాడు.
NZB: ఏడాదికి పైగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న NZB ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌కు చెందిన ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను విధుల నుంచి తొలగిస్తూ వైద్య విద్య సంచాలకుడు(DME)నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డా.అయేషా ఫరీన్, డా.G.స్రవంతి, డా.P.నిశిత, డా.నీలకంఠం సతీష్ రాజు, డా.R.లక్ష్మణ్, డా.M.అపూర్వ, Dr.P.లీలావతిలను తొలగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
AP: 1996 మార్చి 5న మార్కాపురానికి వచ్చానని.. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ నీళ్లు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘మాకు శ్రీశైలం నీళ్లు కావాలని ఆనాడు అడిగారు. కృష్ణా జలాలు తీసుకొస్తానని ఆరోజు మాట ఇచ్చాను. వెలిగొండకు ఫౌండేషన్ నేనే చేశా.. పూర్తి చేసే అవకాశం నాకే వచ్చింది. దీంతో 4 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వస్తాయి. పనులు పూర్తికాక ముందే జగన్ రిబ్బన్ కటింగ్ చేశారు’ అని ఆరోపించారు.
NGKL: అచ్చంపేట మండలంలో కొలువుదీరిన ఉమామహేశ్వర క్షేత్రం 1800 ఏళ్ల సుదీర్ఘ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. క్రీ.శ. 2వ శతాబ్దంలో మౌర్య చంద్రగుప్తుని కాలంలోనే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. 13వ శతాబ్దంలో కాకతీయ సామంతుల కాలంలో ఈ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందింది. శ్రీశైల మల్లికార్జున స్వామికి ‘ఉత్తర ద్వారం’గా పేరుగాంచింది.