TPT: సత్యవేడు నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల భవనాలు శిధిలావస్థలో ఉన్నాయని, కొత్త భవనాలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట భవనాల నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
TPT: మార్కెట్‌లో 80% పైగా కల్తీ పన్నీర్ విక్రయిస్తున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి జంతువులు తినడానికి కూడా సురక్షితం కాదట. మైదా హీరో రూట్ పౌడర్, కల్తీ పాలు, పామ్ ఆయిల్ నిల్వలతో వీటిని తయారు చేస్తున్నారట. తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తికి నిత్యం వేల మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడి హోటళ్లలో అన్ బ్రాండెడ్ పనీర్ వినియోగిస్తున్నట్లు సమాచారం.
E.G: నిడదవోలు RTC డిపో వద్ద పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ.. నిడదవోలు RTC డిపోలో నాణ్యమైన బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. అలాగే విజయవాడ నుంచి ఇచ్ఛాపురం వరకు సర్వీసులు నడపాలని, విద్యుత్ బస్సుల పేరుతో డిపోల మూసివేతను వ్యతిరేకించారు.
WGL: గీసుకొండ మండలం కొమ్మలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకుడు కాళీప్రసాద్ రావు పరిశీలించారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 9 వరకు జరిగే ఉత్సవాలనేపథ్యంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి. మాట్లాడుతూ.. మంత్రి కొండ సురేఖ, స్థానిక ఎమ్మెల్యే రేవూరి మధ్య వర్గ పోరు కారణంగా ఆలయఅభివృద్ధి నిలిచిపోయిందన్నారు.
MDK: కొల్చారం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా హాళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరు, పరీక్షల నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే ప్రశ్నాపత్రాలను తెరిచారా లేదా అన్నది తెలుసుకున్నారు.
HNK: కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంను డిసబుల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. పార్ట్ టైమ్ అధ్యాపకుల నియామకాలలో దివ్యాంగుల రోస్టర్ పాయింట్ల ఇంటర్ చేంజ్ విధానం అమలు చేయాలని వీసీని వారు కోరారు. జాతీయ అధ్యక్షుడు మహమ్మద్ యాకుబ్ పాషా, రాంబాబు, శ్రీశైలం, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
GDWL: రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా గద్వాల కలెక్టరేట్ ముందు ఎర్రవల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రత్యేక హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ద్విచక్ర వాహనదారులకు స్వయంగా హెల్మెట్లు ధరింపజేశారు. రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
KDP: పోరుమామిళ్లలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న శ్రీ భాగ్యలక్ష్మి పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్ చేశారు. చదువు పేరుతో తల్లిదండ్రుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలను సీజ్ చేయాలని ఆయన కోరారు. గుర్తింపు విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
GNTR: చేబ్రోలు మండలం గుండవరం గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ శంకుస్థాపన మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొని, ఆలయ జీర్ణోద్ధారణ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
BPT: చీరాల బీచ్‌లో అక్షయ రిసార్ట్స్ సంస్థ ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. ఎమ్మెల్యే కొండయ్య ప్రత్యేక కృషితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని ఆయన కార్యాలయం బుధవారం తెలిపింది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి పెరగడంతో పాటు చీరాల పర్యాటక రంగానికి కొత్త గుర్తింపు రానుంది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
NRPT: జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేటలోని ఎస్‌ఆర్ ఫంక్షన్ హాలులో జీఐ గుర్తింపుపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు సీఈవో తేజస్ తెలిపారు. నారాయణపేట చీరలకు భౌగోళిక సూచిక సర్టిఫికెట్ లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని చెప్పారు. జీఐ సాధనకు సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు యజమానులు పాల్గొన్నారు.
శివాజీ హీరోగా నటించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శివాజీ మాట్లాడుతూ.. ఈ సినిమాను థియేటర్‌లో చూస్తే వచ్చే మాజానే వేరని తెలిపాడు. ఇప్పటికే సినిమా చూసిన వాళ్లంతా ఫుల్‌గా నవ్వుకున్నట్లు పేర్కొన్నాడు. అందరికి నచ్చే సినిమా తీశాం, ఈ మూవీ కచ్చితంగా విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
JGL: కోరుట్లలో ప్రతిపాదించిన జవహర్ నవోదయ విద్యాలయ కోసం గుర్తించిన స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత బుధవారం పరిశీలించారు. భూమి విస్తీర్ణం, సరిహద్దులు, రహదారి, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల సమన్వయంతో నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపాలని ఆదేశించారు.
ప్రకాశం: 2019-24లో సీఎంగా ఉండుంటే 2021లోనే నీళ్ళు ఇచ్చేవాడినని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి అలాగే ఉదయగిరి, బద్వేల్‌కు 4 లక్షల 35 వేల ఎకరాల సాగుకు నీళ్లు వచ్చుండేవి. ఆనాటి ముఖ్యమంత్రి దొంగ నాటకాలు ఆడి 2019-24 మధ్య కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని విమర్శించారు.
అన్నమయ్య: పాల డైరీ యాజమాన్యం డైరీ కేంద్రాల వద్ద తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని బుధవారం అన్నమయ్య జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వంగవల రంగారెడ్డి సూచించారు. బుధవారం లక్కిరెడ్డిపల్లి ప్రాంతంలోని పాల డైరీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. డైరీలో భద్రతా ప్రమాణాలు నిర్లక్ష్యం చేస్తే రాజమండ్రిలో జరిగినట్లుగా సంఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.