• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు మిట్టమానుపల్లె కొండ సింగరాయ స్వామి ఉత్సవం

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని మిట్టమానుపల్లెలో లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా, స్థానికంగా ఉన్న శ్రీ కొండా సింగరాయ స్వామి ఉత్సవము మంగళవారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా పంచామృత అభిషేకం అష్టోత్తరం ప్రత్యేక పూజలు, భజనలు, అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. భక్తులు తరలివచ్చి పాల్గొనాలన్నారు.

March 2, 2026 / 08:08 AM IST

అనుమతులకు విరుద్ధంగా అంతస్తుల నిర్మాణం..!

HYD: బంజారాహిల్స్ పరిధి సాగర్ సొసైటీ ఏరియాల్లో అనుమతులకు మించిన అంతస్తుల నిర్మాణం జరుగుతుందని అక్కడ ప్రజలు ఆరోపిస్తూ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని, నిర్మాణాలపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు.

March 2, 2026 / 08:08 AM IST

అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళి..!

JGL: SC వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బుగ్గారం మండల కేంద్రంలో MRPS, MSP ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ SC వర్గీకరణను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో MRPS ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షుడు చిర్ర లక్ష్మణ్ మాదిగ, మండల అధ్యక్షుడు పాల్గొన్నారు.

March 2, 2026 / 08:07 AM IST

నా పనితోనే సమాధానం చెప్తా: తాప్సీ

హీరోయిన్ తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్నిసార్లు తనతో కలిసి పనిచేయడం కొంచెం కష్టమనే మాట వింటుంటానని తెలిపింది. ‘బహుశా నాతో పనిచేయని వ్యక్తులు ఇలా ప్రచారం చేసి ఉండొచ్చు. నేనేంటో అందరికీ నిరూపించుకోవాలని అనుకోను. అలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా పనితోనే సమాధానం చెప్తా’ అని చెప్పుకొచ్చింది.

March 2, 2026 / 08:07 AM IST

T20 WC: భారత్ సరికొత్త రికార్డ్

విండీస్ నిర్దేశించిన 196 రన్స్ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. T20 WC లక్ష్య ఛేదనల్లో టీమిండియాకు ఇదే(199/5) అత్యధిక విజయవంతమైన లక్ష్యఛేదన కాగా గతంలో ఈ రికార్డ్ 176/4(2014లో vs SA)గా ఉండేది. ఒవరాల్‌గా టోర్నీలో చరిత్రలో 230(2016లో ENG vs SA), 206(2007లో SA vs WI) తర్వాత ఇది మూడో హయ్యెస్ట్  సక్సెస్‌ఫుల్ ఛేజ్.

March 2, 2026 / 08:07 AM IST

“వెంటనే విద్యుత్ లైట్లు మరమ్మత్తులు చేపట్టాలి”

MLG: యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప ఆలయం తూర్పు ముఖ ద్వారం రోడ్డులో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ రాత్రి వేళల్లో పనిచేయకపోవడంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు వెచ్చించి అలంకారప్రాయంగా ఏర్పాటు చేసిన దీపాలు చీకటిలో మాత్రమే కనిపిస్తున్నాయి. వెంటనే మరమ్మతులు చేపట్టాలని పర్యాటకులు అధికారులను కోరారు.

March 2, 2026 / 08:06 AM IST

రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా సురేష్ ఎన్నిక

WNP: వరంగల్లో జరిగిన తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) 4వ రాష్ట్ర మహాసభలో పీ.సురేష్ రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే యూసుఫ్, ప్రధాన కార్యదర్శి నరసింహ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. యూనియన్ బలోపేతానికి సురేష్ కృషి చేస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

March 2, 2026 / 08:05 AM IST

పేదలకు ఈ నెల 15లోగా నివాస స్థలం: మంత్రి

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములలో ఇళ్లు కోల్పోయిన పేదలకు ఈ నెల 15లోగా నివాస స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం స్పష్టం చేశారు. అంతేకాకుండా పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన దళారుల నుంచి ఆ సొమ్ము రికవరీ చేసి బాధితులకు అప్పజెప్పే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.

March 2, 2026 / 08:05 AM IST

కెమికల్స్ వాసన భరించలేకపోతున్నాం..!

MDCL: బాచుపల్లి ఏరియాల్లో రాత్రికి రాత్రి వివిధ కంపెనీలు గాలిలోకి విషపూరిత వ్యర్ధాలు విడుదల చేస్తున్నాయని, కెమికల్ వ్యర్ధాల వాసన భరించలేకపోతున్నట్లు అక్కడ ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు పొల్యూషన్ కంట్రోల్ బుడ్డ అధికారులకు కాల్ చేసి ట్రై చేశామని, అయినప్పటికీ స్పందన లేదన్నారు. ప్రభుత్వం కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలన్నారు.

March 2, 2026 / 08:04 AM IST

‘రైతు సంక్షేమమే మా లక్ష్యం’

అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి రైతు సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఆమెకు వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారి అభివృద్ధికి పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డులో రైతులకు సౌకర్యాలు కల్పించి, గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

March 2, 2026 / 08:04 AM IST

విద్యార్థిని చదువుకు MLA భరోసా

E.G: గోపాలపురం మండలం గోపవరం గ్రామానికి చెందిన సత్య సాయి అనే విద్యార్థిని చదువుకు MLA మద్దిపాటి వెంకటరాజు భరోసా ఇచ్చారు. తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె కాలేజీ ఫీజు కోసం దాతలు అందించిన రూ. 50 వేలను ఆదివారం అందజేశారు. సహాయం చేసిన హుకుంపేట హోతా రాజా, వేము వెంకట సుభాషిణిలను ఎమ్మెల్యే అభినందించారు.

March 2, 2026 / 08:04 AM IST

కలెక్టరేట్లో నేడు PGRS కార్యక్రమం

విజయనగరం జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు.

March 2, 2026 / 08:03 AM IST

టీడీపీ కార్యకర్తకు అండగా ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర మండలం ఛత్రం గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్త విజయకుమార్ పక్షవాతంతో మంచాన పడటంపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి భార్య సమస్యను వివరించగానే స్పందించిన ఎమ్మెల్యే, ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ రూ. 1 లక్ష నగదు చెక్కును తక్షణ ఆర్థిక సాయంగా అందజేశారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

March 2, 2026 / 08:02 AM IST

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం: MLA

JN: జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 320F, 7వ రీజియన్ చంద్రగిరి సేవా సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వర్ధన్నపేట MLA KR నాగరాజు హాజరై, పద్మశ్రీ గడ్డం సమ్మయ్యను, లయన్స్ సభ్యులను సత్కరించారు. కరోనా సమయంలో లయన్స్ చేసిన సేవలు అనేక ప్రాణాలను కాపాడాయని MLA నాగరాజు కొనియాడారు.

March 2, 2026 / 08:02 AM IST

చంద్రగ్రహణం.. ఆలయం మూసివేత

WGL: చంద్రగ్రహణం సందర్భంగా 3వ తేదీన నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం మూసివేస్తున్నట్లు ఆలయ గౌరవ అధ్యక్షుడు గందె శ్రీనివాస్ గుప్తా తెలిపారు. గ్రహణ సమయం ముగిసిన అనంతరం ఆలయాన్ని శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి తిరిగి దర్శనార్థం తెరవనున్నట్లు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

March 2, 2026 / 08:02 AM IST