• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్’

MHBD: ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దవంగర SI చిలువేరు ప్రమోద్ తెలిపారు. తొర్రూరు మండలంలోని బొంతుపల్లి తండాకు చెందిన గుగులోతు సురేష్ నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలోని ఆకేరు వాగు నుంచి పెద్దవంగర మండలానికి ఇసుక తరలిస్తున్న క్రమంలో సీజ్ చేసి,అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 08:47 PM IST

గురుకుల సంఘటనపై విచారణ చేపట్టిన డిప్యూటీ సెక్రటరీ

JN: పాలకుర్తి (M) కేంద్రంలోని గూడూరు గిరిజన బాలికల గురుకుల పాఠశాల & కళాశాలలో నిన్న జరిగిన సంఘటనపై గురుకులాల సెక్రటరీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ గురుకులాన్ని సందర్శించి విచారణ చేపట్టినట్లు DY సెక్రటరీ D.S వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో భోజనం ఆలస్యం కావడం వలన విద్యార్థుల ధర్నా చేసినట్లు విచారణ తేలిందని తెలిపారు.

February 24, 2026 / 08:46 PM IST

బాధితుడికి ఆర్థిక సహాయం

MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలగౌడ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు బాల గౌడ్ ఇంటికి వెళ్లి తక్షణ సహాయంగా రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. బాలా గౌడ్ ఆరోగ్యం బాగుపడేందుకు మెరుగైన చికిత్స కోసం తోడ్పాటు అందిస్తామని కుటుంబానికి హామీ ఇచ్చారు.

February 24, 2026 / 08:45 PM IST

జీఎస్టీ వసూళ్లపై కలెక్టర్ ఆదేశాలు

కృష్ణా: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు–సేవల పన్నుల వసూళ్లు సజావుగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

February 24, 2026 / 08:45 PM IST

బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రికి ఆహ్వానం

WGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రి కొండా సురేఖకు అధికారులు, అర్చకులు ఆహ్వానం అందజేశారు. భక్తులకు సౌకర్యాల కల్పన, భద్రతా ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, దేవస్థానం అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

February 24, 2026 / 08:44 PM IST

టీమిండియాలో ఆ ప్లేయర్లపై వేటు..?

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్ స్థానంలో శాంసన్, వాషింగ్టన్ స్థానంలో అక్షర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, వన్ డౌన్‌లో సూర్య, ఆ తర్వాత స్థానంలో తిలక్ బ్యాటింగ్‌కు రావొచ్చు.

February 24, 2026 / 08:44 PM IST

పథకాల అమలులో అధికారులదే కీలక పాత్ర: కలెక్టర్

NGKL: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ అధికారులదే కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన 2026 డైరీని అదనపు కలెక్టర్లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:43 PM IST

‘తప్పని సరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి’

JN: జిల్లాలోని రైతులు ఈ నెల 28వ తేదీలోపు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ పథకాలు పొందేందుకు ఈ నమోదు అవసరమని స్పష్టం చేశారు. ఇంకా నమోదు చేసుకుని రైతులు ఏఈవోల వద్ద లేదా మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.

February 24, 2026 / 08:43 PM IST

పెద్ద శేషు వాహనంపై ఊరేగిన వేంకన్న

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ కోనేటి వద్ద వెలిసిన శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి పెద్ద శేషు వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరించారు. స్వామి వారి ముందు ప్రత్యేకంగా కోలాటాలు, చెక్క భజనలు, కీర్తనలు గోవింద నామాలతో వాయిద్యాలతో భక్తులకు కనువిందు చేశారు.

February 24, 2026 / 08:42 PM IST

పేకాట స్థావరంపై దాడి.. పలువురు అరెస్ట్

ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరా నగర్‌లో పేకాట స్తావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో గోలి వెంకటేష్, గడ్డం లక్ష్మణ్, గుర్లే రవీందర్ పట్టుబడగా మరో ఆరుగురు పరారయినట్లు తెలిపారు. సంఘటన స్థలంలో రూ. 12,040 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు SI వెంకట కృష్ణ పేర్కొన్నారు.

February 24, 2026 / 08:41 PM IST

విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

HNK: హన్మకొండలోని వాగ్డేవి కళాశాల విధ్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ “అరైవ్ అలైవ్” ఏర్పాటు చేశారు. CP సన్ ప్రీత్ సింగ్ హాజరై మాట్లాడుతూ.. వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలను తీసుకుంటూ వాహనం నడపాలని అన్నారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ విద్యార్థుల చేత ట్రాఫిక్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు.

February 24, 2026 / 08:41 PM IST

అనుమతులకు మించిన నిర్మాణాలు.. చర్యలేవి..?

MDCL: కూకట్‌పల్లి పరిధి గోపాల్ నగర్ ఏరియాల్లో అనుమతులకు మించిన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడికి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా జోనల్ కమిషనర్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదన్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఎందుకు, నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

February 24, 2026 / 08:40 PM IST

కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

HNK: కలెక్టర్ కార్యాలయం ఎదుట డెస్క్ జర్నలిస్టులు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధు మాట్లాడుతూ.. గతంలో విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేశారో అదేవిధంగా కార్డులు మంజూరు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.

February 24, 2026 / 08:40 PM IST

25న నెల్లూరుకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాక

NLR: ఈనెల 25న నెల్లూరుకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ రానున్నట్లు జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉ.10.30 గంటలకు నెల్లూరులోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం ఉ.11.00 గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో పోష్ యాక్టు -2013 పై జరిగే వర్క్ షాపులో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

February 24, 2026 / 08:40 PM IST

చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. పాక్ స్కోర్ ఎంతంటే?

పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించారు. దీంతో పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్(3), ఓవర్టన్(2), ఆర్చర్(2) పాక్ పతనాన్ని శాసించారు. పాక్ బ్యాటర్లలో ఫర్హాన్(63) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. బాబర్(25), ఫఖర్(25) పర్వాలేదనిపించగా, మిగితా బ్యాటర్లంతా ఘెరంగా విఫలమయ్యారు. టార్గెట్: 165

February 24, 2026 / 08:39 PM IST