సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పరిరక్షణలో, పరీక్షల నిర్వహణ జరుగుతుందని, పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 163 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఐటీసీ మెమెంటోస్ హోటల్‌లో ఇవాళ సంగీత్, మెహందీ, రేపు హల్దీ జరగనున్నాయి. ఫిబ్రవరి 26న కేవలం 100 మంది అతిథుల మధ్య వీరి పెళ్లి జరగనుంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ‘విరోష్’ గ్రీన్ థీమ్ మెనూ, విజయ్ స్విమ్మింగ్ పూల్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
BHNG: రాజాపేట మండలం బేగంపేటకి చెందిన శతాధిక వృద్ధురాలు ఫ్రీడమ్ ఫైటర్ వలిమెల లక్ష్మి (106) సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆమె భర్త హన్మంత్ స్వాతంత్ర సమర యోధుడు. జైలు జీవితం కూడా గడిపారు. 106 సంవత్సరాలకు పైగా జీవించిన లక్ష్మి రజాకార్లతో పోరాటం, బాధలు, బాధ్యతలు, మనుమరాండ్లతో సుఖదుఃఖాలు, మనుమలు, పరిపూర్ణ జీవనం గడిపారని గ్రామస్తులు సంతాపం తెలిపారు.
వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్, రేవల్లి సొసైటీల్లో యూరియా పంపిణీ కోసం స్లాట్ బుకింగ్ ఓపెన్ అయిందని అధికారులు తెలిపారు. నాగపూర్ సొసైటీలో 300 బస్తాలు, రేవల్లి సొసైటీలో 300 బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదికారులు సూచించారు.
BDK: బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు ఎస్సైలు, వారి తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. అధిక లాభాల పేరుతో బూర్గంపహాడ్ మండలం, సారపాకకు చెందిన మహిళ నుంచి రూ.1.82 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
NZB: రుద్రూర్‌లో న్యాయవాది కళ్యాణి నివాసానికి బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మంగళవారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కళ్యాణికి ధైర్యం చెప్పి, పూర్తి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా దినేశ్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నిర్వహించిన బాలాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్రలో ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి ప్రదర్శనలు భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేశాయి.
HNK: హసన్ పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో మంగళవారం బాల్నే మొగిలి సొంత మరదల చేత దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొగిలిని గొడ్డలితో, కత్తులతో అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
TG: ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును ఉద్దేశించి గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజలను వారి నివాసాల నుంచి వెళ్లగొట్టొద్దని తెలిపారు. బాపు బతికి ఉంటే ‘నా పేరు మీద ఇలాంటివి చేయొద్దు, వెంటనే ఆపండి’ అని చెప్పేవారని పేర్కొన్నారు. విగ్రహాల కంటే ప్రజల కనీస అవసరాలే ముఖ్యమన్నారు.
AP: రాబోయే రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌ను విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడవచ్చని టీడీపీ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తన మనస్తత్వంతో ప్రజల్లో జగన్ విశ్వాసం కోల్పోయారన్నారు. అహంకార ధోరణి వల్ల అధికారం కష్టమనే భావన.. వైసీపీ నాయకుల్లో పెరుగుతుందన్నారు. 60 రోజుల అసెంబ్లీ గైర్హాజరుతో అర్హత కోల్పోయే భయం వైసీపీ ఎమ్మెల్సీల్లో ఉందని పేర్కొన్నారు.
PLD: పెదకూరపాడులోని లింగంగుంట్ల గ్రామంలో మంగళవారం ఉదయం పోలిసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు పాల్గొని గ్రామంలో క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 22 వాహనాలను గుర్తించారు. కొడవళ్ళు గుడ్డలు మారణా యుద్ధాలను కొన్నిటిని గుర్తించారు. సీఐ సురేష్, శ్రీనివాసరావు, ఎస్సై గిరిబాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
RR: రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు టీసీజీఎస్-1694 ‘విశిష్ట’ వేరైటీ వేరుశనగ పై ఫీల్డ్ డే నిర్వహించారు. పూత దశలో తగిన నీరు, జిప్సం, జింక్ వినియోగంతో దిగుబడి పెరుగుతుందని డా. సంతోష్ కుమార్ సూచించారు. పంట విస్తీర్ణం, నాటే దూరం, సమతుల ఎరువుల వినియోగం, కలుపు నియంత్రణ, యాంత్రీకరణపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.
NLG- తమ సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో, నేడు ఆర్టీసీ కార్మికులు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా కార్మిక జేఏసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
WGL: ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారం (మార్చి 4), సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం (మార్చి 5) నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాల వారీగా WGL-12,166, HNK-38,600, JN-8,605, MHBD-8,287, BHPL-3,778, MLG-3,841 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు.
KDP: పొద్దుటూరు రామేశ్వరంలోని ముక్తిరామలింగే శ్వరస్వామి ఆలయంలో సోమవారం ఆలయ ఈవో శ్రీధర్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. డిసెంబరు 29 నుంచి ఫిబ్రవరి 23 వరకు 55 రోజులకు భక్తులు స్వామివారికి రూ.80,035 కానుకల రూపంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ ఇన్‌స్పెక్టర్ కిరణకుమార్ రెడ్డి, పాలకమండలి సభ్యుడు, ఆర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.