GDWL: తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్ గా గద్వాల కు చెందిన జి.రాజు ఎంపికైనట్లు కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డీకే స్నిగ్ధా రెడ్డి తెలిపారు. గుజరాత్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే జాతీయస్థాయి సీనియర్ కబడ్డీ టోర్నీలో తెలంగాణ జట్టుకు సారథ్యం వహించనున్నారు. ఉమ్మడి జిల్లా నేతలు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పీడీలు హర్షం వ్యక్తం చేశారు.
SRD: ముత్తంగి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. కాంప్లెక్స్ హెచ్‌ఎం శారద మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా బోధన నాణ్యత పెరుగుతుందని తెలిపారు. ఉత్తమ బోధన పద్ధతులతో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచవచ్చన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి చేయాలని ఆమె సూచించారు.
NRML: నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈరోజు దిలావర్పూర్ మండలంలోని కాలువ, సిర్గాపూర్ గ్రామాల్లో చేపట్టాల్సిన శంకుస్థాపన కార్యక్రమాలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయని నీటిపారుదల శాఖ ఏఈ సొన్ కాంబ్లే గంగాధర్ ఓ ప్రకటనలో తెలిపారు, ప్రజా ప్రతినిధులు, అధికారులుఈ మార్పును గమనించాలని వారి కోరారు.
కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం తొగరపాయ వంతెన వద్ద సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న అయినవిల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో కొలపర్తి అచ్యుత లోకేశ్వరరావు, పి.శ్రీనివాసరావులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 3వ విడతలో భాగంగా సోమవారం 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ సోమవారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.761 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు రైతులను కోరారు.
KRNL: పెద్దకడబూరు LLC కాలువ పరిధి సళ్లమ్మ వంక సమీపంలో నీరు కలుషితమవుతోంది. కాలువలో ప్రవహిస్తున్న నీటిలో గుర్రపుడెక్కలు, చనిపోయిన జంతువుల కళేబరాలు పేరుకుపోయి తేలుతూ దుర్గంధం వెదజల్లుతోంది. పరిసర ప్రాంతమంతా అసహ్యకరమైన వాసనతో నిండిపోతోంది. చుట్టూ ప్రక్కల పొలాల కూలీలకు ఈ నీటినే ఉపయోగిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే పరిశుభ్రత పనులు చేపట్టాలన్నారు.
జట్టు కూర్పు కోసమే ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బదులు వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవాల్సి వచ్చిందని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ తెలిపాడు. అయితే వాషింగ్టన్ సుందర్.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 11 రన్స్ నిరాశపరిచాడు. కాగా మొత్తంగా సౌతాఫ్రికా 76 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన విషయం తెలిసిందే.
PPM: కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. హిందూ విశ్వాసాలు, సంప్రదాయాలను వైసీపీ నేతలు గౌరవించలేదని ఆరోపించారు. శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలతో చెప్పులు వేసుకుని నినాదాలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.
ATP: శింగనమల నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు కట్టుదిట్టమైన నిఘా మధ్య జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు తావులేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. నార్పలలోని పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు, విద్యార్థులు పరీక్షలు రాస్తున్న విధానాన్ని ఎస్సై సాగర్ పర్యవేక్షించారు.
JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారి పల్లకి సేవ కన్నులపండువగా సాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను రకరకాల పూలతో అలంకరించిన పల్లకిలో ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
SRPT: జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం గ్రామ మొదటి వార్డులో కోతుల సమస్య నివారణకై ఆ వార్డు సభ్యురాలు చెరుకు స్వరూప భర్త చెరుకు సైదులు ఇవ్వాళ చింపాంజీ వేషధారణలో వీధులలో తిరుగుతూ కోతులను తరిమివేశారు. వార్డులో కోతుల సమస్య నివారణ కోసం చింపాంజీ దుస్తులను తెచ్చి వేసుకొని తిరుగుతున్నట్లు తెలిపారు.
AKP: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రత ఏర్పాట్లును పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. మాస్ కాపీయింగ్ జరక్కుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసామన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత పేపర్లను భద్రంగా స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుస్తామన్నారు.
SRCL: సమస్యల పరిష్కారం కోరుతూ ‘చలో హైదరాబాద్’ కమిషనరేట్ ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను సోమవారం తంగళ్లపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్‌కు తరలించినా తమ పోరాటం ఆగదని ఆశా కార్యకర్తలు నినదించారు.
CTR: పుంగనూరులో ప్రజలు ఆరాధించే శ్రీ విరుపాక్షి మారెమ్మకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు ఫల పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు, వెండి ఆభరణాలతో అలంకరించారు. భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు.
అన్నమయ్య: రాయచోటిలో శ్రీవీరభద్ర స్వామివారి పార్వేట ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. గతేడాది నిర్వహించిన ఉత్సవ సందర్భంలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈసారి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల అశ్వవాహనంపై వేటకు వెళ్లే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముస్లిం, మైనారిటీలు స్వామివారి ఊరేగింపునకు ఆహ్వానం పలికి తాగునీరు అందజేశారు.