• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

NGKL: తెల్కపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో ఇవాళ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం పేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 03:26 PM IST

భాషా పండిట్లకు అప్ గ్రేడ్ ఉత్తర్వులు ఇవ్వాలి

పార్వతీపురం ఐటీడీఏలో భాషా పండిట్లకు అప్ గ్రేడ్ ఉత్తర్వులు ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భాషా పండిట్లకు పాఠశాల సహాయకులుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కానీ పార్వతీపురం ఐటీడీఏలో ప్రక్రియ ముందుకు సాగడం లేదని అన్నారు.

February 20, 2026 / 03:26 PM IST

ఎన్టీఆర్, నీల్ మూవీకి టైటిల్ ఖరారు!

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో మూవీ టైటిల్‌పై ఉత్కంఠ నెలకొంది. మొదట ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే పేరు పెట్టినట్లు వార్తలు వినిపించగా.. తాజాగా ‘బ్రూస్లీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట. అయితే, గతంలో రామ్ చరణ్ ‘బ్రూస్లీ’ మూవీ ఆశించిన విజయం సాధించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ, పాన్ ఇండియా స్థాయిలో ఈ పేరు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్...

February 20, 2026 / 03:26 PM IST

తప్పనిసరిగా ఏఐ వాడాల్సిందే: యాక్సెంచర్

AIతో కంపెనీల్లో పని సంస్కృతి మారుతోంది. తాజాగా యాక్సెంచర్‌ కూడా తమ సీనియర్ ఉద్యోగులు ఏఐ టూల్స్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సూచించింది. వాటి వినియోగం ఆధారంగానే లీడర్‌షిప్ రోల్స్‌ అందుకుంటారని, లేకపోతే ప్రమోషన్లు ఉండవని సంకేతాలు ఇచ్చింది. కాగా, ఇటీవల యాక్సెంచర్ 11వేల మందికి లేఆఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

February 20, 2026 / 03:25 PM IST

వ్యాపారి ఇంట్లో సీక్రెట్‌ వాల్‌.. వెనుక రూ.కోట్ల బంగారం

రాజస్థాన్‌లో ఓ వ్యాపారి ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ రహస్య గోడను గుర్తించిన అధికారులు.. గోడను బద్దలు కొట్టారు. అక్కడ రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ను గుర్తించారు. రూ.100 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణల్లో భాగంగా అధికారులు ఈ సోదాలు చేపట్టారు.

February 20, 2026 / 03:25 PM IST

T20 WC: ఆసీస్‌కు పసికూన సవాల్

T20 WCలో ఈరోజు ఆస్ట్రేలియాతో ఒమన్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఒత్తిడిలో ఉందని, ఆ జట్టును ఓడించడానికి తమకు ఇదే మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. పసికూన ఒమన్, ఆస్ట్రేలియాను ఓడిస్తామనడం.. ఆ జట్టుకు సవాల్ విసిరినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

February 20, 2026 / 03:23 PM IST

పది పరీక్షలు సజావుగా నిర్వహించాలి: డీఈవో

SRD: జిల్లాలో మార్చి 14 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాలలో విద్యుత్, తాగు నీరు, ఫర్నిచర్ తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

February 20, 2026 / 03:22 PM IST

బీసీ వెల్ఫేర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

BPT: నిజాంపట్నం బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ (MPC, BiPC, CEC) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయన్ని ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ సీట్లను కూడా భర్తీ చేసున్నామని వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 03:22 PM IST

అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆందోళన

నంద్యాల జిల్లా డోన్ పట్టనంలో డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం సీపీఐ నాయకులు సామాజిక న్యాయం కోసం ఆందోళన నిర్వహించారు. కార్పొరేట్ సంపదను పునర్పంపిణీ చేయాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ లింగ వివక్షను నివారించాలని, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సమానంగా కల్పించాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 03:20 PM IST

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

చిత్తూరు నగరపరిధిలోని పలు వార్డుల్లో రూ. 49.35 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ప్రారంభించారు. మిట్టూరులో సిమెంటు రోడ్లు, కాలువలు, పంట్రాంపల్లిలో నూతన బోరు, మోటారును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, స్థానిక టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 03:18 PM IST

మోదీ ఆకాంక్షను దేశం సాధిస్తుంది: చంద్రబాబు

AP: దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని మోదీ పని చేస్తున్నారని CM చంద్రబాబు తెలిపారు. మోదీ ఆకాంక్షను దేశం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. AI అద్భుతాలను సాధిస్తుందని విశ్వాసం ఉందన్నారు. పౌరలందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ AI వినియోగానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా AP దృష్టి సారిస్తోందన్నారు.

February 20, 2026 / 03:18 PM IST

ప్రాథమిక పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం

SDPT: బెజ్జంకి ప్రాథమిక పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు సాధారణ వైద్య పరీక్షలు చేయగా, ఉపాధ్యాయులకు ఈసీజీ, బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. కొండ్ల విద్యాప్రకాశ్ కుటుంబం విద్యార్థులకు బహుమతులు ఇచ్చింది. మండల విద్యాధికారి మహతి లక్ష్మి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 03:17 PM IST

ఆయిల్ పామ్ లాభదాయకమైన పంట: తుమ్మల

TG: రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, అధిక ఆదాయాన్ని ఇస్తూ లాభసాటిగా ఉండే ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పాల్వంచలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సబ్సిడీలు, సాంకేతిక సహకారం అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.

February 20, 2026 / 03:16 PM IST

విక్రమ్ ‘మహాన్‌’కు సీక్వెల్ ప్లాన్!

తమిళ హీరో విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ కలిసి నటించిన మూవీ ‘మహాన్’. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా OTTలో రిలీజై మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌పై దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ.. ఈ సీక్వెల్ కోసం తన దగ్గర ఐడియా ఉందన్నాడు. కానీ స్క్రిప్ట్ ఇంకా ప్రారంభ దశలో ఉందని, 2027-28 నాటికి ఇది విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు.

February 20, 2026 / 03:16 PM IST

యువత కోసం ‘హరీష్ అన్న’ ఉద్యోగ యాప్ లాంచ్

SDPT: సిద్దిపేట యువత కోసం ఎమ్మెల్యే హరీశ్ రావు సొంత ఖర్చుతో ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్’ను ప్రారంభించారు. ఇందులో 57 రకాల పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్ క్లాసులు, 400 నమూనా ప్రశ్నాపత్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ యాప్ పోటీ పరీక్షార్థులకు, ఉద్యోగార్థులకు ఉపయోగపడుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు.

February 20, 2026 / 03:15 PM IST