TG: రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, అధిక ఆదాయాన్ని ఇస్తూ లాభసాటిగా ఉండే ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పాల్వంచలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సబ్సిడీలు, సాంకేతిక సహకారం అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.