• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపటి నుంచి ప్రజావాణి

MDK: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసిన ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయంలో యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్ డేస్ ద్వారా మాత్రమే ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించిన జరుగుతుందన్నారు. మార్చి 02 నుంచి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి జరుగుతుందని వెల్లడించారు.

February 22, 2026 / 06:13 PM IST

ఘనంగా శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి

SDPT: శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా అక్కన్నపేట మండలంలోని చాపగాని తండాలో గిరిజన అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూక్య వీరన్న నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రిపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీఠాధిపతి మహారాజ్ తో కలిసి వీరన్న నాయక్ విచ్చేసి భోగ్ బండార్ నిర్వహించారు.

February 22, 2026 / 06:12 PM IST

సంగారెడ్డిలో BJP నాయకుల నిరసన

SRD: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడికి నిరసనగా సంగారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం సరికాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:12 PM IST

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి పట్టణం జూపల్లి రామచంద్రారావు కంటి, గుండె సంబంధించిన ఆసుపత్రిని ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి ప్రారంభించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని యాజమాన్యానికి ఎమ్మెల్యే సూచించారు. వారితోపాటు మున్సిపల్ వైస్ ఛైర్మన్ సుమలత, కౌన్సిలర్ రాంబాబు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నారావు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:11 PM IST

రుషికొండ బీచ్‌లో మెగా క్లీనింగ్‌

విశాఖలోని రుషికొండ బీచ్ వద్ద ఆదివారం మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్లూఫ్లాగ్, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ స్వచ్ఛత కార్యక్రమంలో సుమారు 400 మంది భాగస్వామ్యమై బీచ్ పరిసరాల్లో ఉన్న వ్యర్థాలను తొలగించారు.

February 22, 2026 / 06:11 PM IST

‘పెండింగ్ కేసులు పరిష్కరించాలి’

ASR: అరకులోయ పోలీస్ స్టేషన్‌ను ఆదివారం పాడేరు డీఎస్పీ అభిషేక్ సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఈ మేరకు పెండింగ్ కేసులను పూర్తి చేయాలని డీఎస్పీ ఆదేశించారు. గంజాయి సాగు, రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టాలని, రహదారి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ ఎల్ హిమగిరి, ఎస్సై జీ గోపాలరావులను ఆదేశించారు. వాహన తనిఖీలు పటిష్టంగా చేపట్టాలని అన్నారు.

February 22, 2026 / 06:10 PM IST

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

అనంతపురం జిల్లాలో రేపటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణ నాయక్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. సందేహాల నివృత్తి కోసం 08554 277626 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 06:10 PM IST

గ్రామీణ డాక్ సేవక్‌లు అద్భుతాలు చేస్తారు: సీఎం

AP: ఏ పని కావాలన్నా వాట్సాప్ గవర్నన్స్ ద్వారా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పార్సిల్ పంపిణీలో గ్రామీణ డాక్ సేవక్‌లను వినియోగించుకుంటామని పేర్కొన్నారు. సరైన దారి చూపిస్తే గ్రామీణ డాక్ సేవక్‌లు అద్భుతాలు చేస్తారని కొనియాడారు. కేంద్రం, రాష్ట్రం చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

February 22, 2026 / 06:10 PM IST

వేదనారాయణ స్వామి సేవలో ఎమ్మెల్యే

TPT: నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన మహా కుంభాభిషేక వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు కుంభాభిషేక మంత్రజలంతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

February 22, 2026 / 06:09 PM IST

ఏపీకి నీళ్లు.. స్పందించిన రేవంత్

TG: గతంలో KCR, హరీష్ రావు తప్పులు చేశారని ప్రజలు గ్రహించే.. తీర్పు ఇచ్చారని CM రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు వాళ్లేం చేశారో.. ఈ ప్రభుత్వం ఏం చేసిందో సభలో చర్చిద్దామన్నారు. పదేళ్ల అనుభవంతో వాళ్లు సూచనలు చేస్తే.. స్వీకరిస్తామని చెప్పారు. నీటి జలాలు AP తరలించుకుపోతోందనే ప్రచారం అవాస్తవమన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దాం.. ప్రజలు నీళ్ల విషయంలో కాదన్నారు.

February 22, 2026 / 06:08 PM IST

అంగన్వాడీల సమస్యలపై రిలే నిరాహార దీక్షలు

KRNL: అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ఈనెల 23-27 వరకు రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి రవిచంద్ర ఇవాళ తెలిపారు. వేతనాల పెంపు,మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం,పని భారం తగ్గించడం,అదనపు యాపుల తొలగింపు,లేబర్ కోడ్ల రద్దు వంటి డిమాండ్లపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించి న్యాయం చేయాలిన్నారు.

February 22, 2026 / 06:08 PM IST

కాంగ్రెస్ దాడులపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

NRPT: కోస్గి 5వ వార్డులో కాంగ్రెస్ నాయకుడి దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. అధికార మదంతో కాంగ్రెస్ దాడులకు దిగుతోందని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, బాధితులకు పూర్తి భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

February 22, 2026 / 06:07 PM IST

మేడ్చల్ రోడ్ సేఫ్టీ క్యాంప్

మేడ్చల్ జిల్లా చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ ప్రమాదాల నివారణకు SHO సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, స్థానికులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల సమయం, కారణాలు, నివారణ చర్యలపై వారు చర్చించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

February 22, 2026 / 06:07 PM IST

పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా ముక్కెర శ్రీనివాస్ ఎన్నిక

NRML: పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ముక్కెర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కడెం మండలం కొండుకూర్‌లో ఏర్పాటు చేసిన జిల్లా పెరిక కుల సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకంతో పెరిక సంఘం జిల్లా అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

February 22, 2026 / 06:06 PM IST

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ADB: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బోరజ్ మండలం మండగడలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శాంతన్ రావు తెలిపారు. ఆదివారం గ్రామంలోని పాఠశాలలో శ్రీకృష్ణ, శ్రీ గణేష్ ఆస్పత్రుల సహకారంతో జరిగిన ఈ శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారన్నారు.

February 22, 2026 / 06:06 PM IST