• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..!

NLG: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని గుర్తు తెలియని వ్యక్తి సుమారు 8 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా.. పట్టణంలోని కబరాస్తాన వద్ద పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

February 25, 2026 / 06:49 AM IST

జనగణన – 2027 శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన జేసీ

సత్యసాయి: బీడుపల్లిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో జనగణన – 2027పై మూడు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఈ శిబిరాన్ని ప్రారంభించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు జరిగే ఈ శిక్షణలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

February 25, 2026 / 06:48 AM IST

నేడు ” విక్షిత్ భారత్ యూత్ పార్లమెంట్” పోటీలు

MBNR: భారత ప్రభుత్వం యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ (మై భారత్), పీయూ సంయుక్తంగా “విక్షిత్ భారత్ యూత్ పార్లమెంట్” పోటీలు బుధవారం పీయూలోని లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు యువజన అధికారి కోట నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా వీసీ జీఎన్.శ్రీనివాస్ హాజరవుతున్నారని, అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు.

February 25, 2026 / 06:46 AM IST

‘బొగ్గు నాణ్యతపై అవగాహన కలిగి ఉండాలి’

MNCL: సింగరేణిలో పనిచేస్తున్న అధికారులతో పాటు ప్రతి ఉద్యోగికి బొగ్గు నాణ్యతపై అవగాహన కలిగి ఉండాలని డైరెక్టర్(ప్రాజెక్ట్ ప్లానింగ్) వెంకటేశ్వరరావు సూచించారు. మందమర్రి ఏరియా ఇల్లందు క్లబ్‌లో బొగ్గు నాణ్యత వినియోగదారుల అవసరాల దృష్ట్యా సింగరేణి ఎదుర్కొంటున్న సమస్యల అంశంపై డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

February 25, 2026 / 06:46 AM IST

ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం

VSP: పరవాడలో పైడిమాంబ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి పరవాడ బీసీ కాలనీకి చెందిన పైలా రాధాకృష్ణ దంపతులు రూ.1,00116 విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం చెక్కును గ్రామ సర్పంచ్ ఎస్. అప్పలనాయుడు, పైల శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ  కార్యక్రమంలో మాజీ సర్పంచులు పి. అప్పారావు, చుక్క రాము నాయుడు పాల్గొన్నారు.

February 25, 2026 / 06:45 AM IST

వెబ్ సైట్ సరే.. ZC అధికారుల కాంటాక్ట్ ఎక్కడ..?

MDCL: నూతనంగా మల్కాజ్‌గిరి కార్పొరేషన్ ఏర్పాటు అనంతరం వెబ్ సైట్ అందుబాటులోకి తెచ్చారు. కానీ.. జోనల్ కమిషనర్ అధికారుల పేర్లు తప్ప, వారి కాంట్రాక్టు వివరాలు, ఈమెయిల్ అడ్రస్ లాంటివి పొందుపరచలేదు. దీంతో కిందిస్థాయి అధికారులు సమస్యలను పరిష్కరించకుంటే, జోనల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే కాంటాక్ట్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని పలువురు డిమాండ్ చేశారు.

February 25, 2026 / 06:44 AM IST

గోదావరి నీటి విడుదల..!

SRPT: యాసంగి సీజన్ కుగాను జిల్లాకు వారబందీ విధానంలో ఇస్తున్న గోదావరి నీటిని మంగళవారం సాయంత్రం పెంచారు. నీటిని 1,613 క్యూసెక్కుల నుంచి 1,750 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. చివరి భూములకు నీళ్లు చేరేందుకు ఈసారి అవకాశం ఉన్న మేర ఎక్కువ నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 06:44 AM IST

ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక

TG: ఇంటర్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ముందుగా ప్రశాంతంగా ఉండాలి. హాల్ టికెట్, పెన్నులు సిద్ధం చేసుకుని 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి, తెలిసిన సమాధానాలను ముందుగా రాయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన పాయింట్లను అండర్ లైన్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు తప్పకుండా రాయండి. ALL THE BEST.

February 25, 2026 / 06:42 AM IST

లక్ష్మీనారసింహుడికి విశేష పూజలు

SRPT: మట్టపల్లి క్షేత్రంలో మంగళవారం సాయంత్రం అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ, హోమశాలలో నిత్యాగ్నిహోత్రి, మూలవిరాటు పంచామృతాభిషేకం, జరిపించారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవసం వాదం చేపట్టారు.

February 25, 2026 / 06:41 AM IST

‘స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా పనిచేయాలి’

AKP: స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ లో స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికకు సంబంధించి విజన్ యాక్షన్ ప్లాన్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా పీ-4 విధానం అమలు జరుగుతుందన్నారు. అభివృద్ధి దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజలను అన్ని విధాల అభివృద్ధిలో తీసుకురావాలన్నారు.

February 25, 2026 / 06:39 AM IST

మతిస్థిమితం కోల్పోయి బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

KMM: మానసిక స్థితి సరిగా లేక బావిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. SI హరిత తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు కప్పలబంధం రోడ్డులో నివాసం ఉంటున్న వేనేపల్లి సత్యనారాయణ (47) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే బావిలోకి దూకి ప్రాణాలు విడిచాడు.

February 25, 2026 / 06:39 AM IST

నాగర్ కర్నూల్ ఘటనకు ఖండిస్తూ.. కొవ్వొత్తుల ర్యాలీ

NZB:  ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన అమానుష ఘటనలో రెండు నెలల పసికందు మరణించిన ఘటనను ఖండిస్తూ.. తెలంగాణ యూనివర్సిటీ అంబేద్కర్ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీలో ర్యాలీ చేపట్టి పసికందు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఏఐ రాజ్యమేలుతున్న ఈ కాలంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు.

February 25, 2026 / 06:38 AM IST

‘ఇంటర్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి’

PDPL: ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించాలని తెలిపారు. తాగునీరు, విద్యుత్, రవాణా సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ శ్రీ హర్ష, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

February 25, 2026 / 06:38 AM IST

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: మంత్రి

WNP: అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ఉదయం వేళల్లో గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వనపర్తిలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు చేరువగా ఉండి సేవలు అందించాలని పేర్కొన్నారు.

February 25, 2026 / 06:37 AM IST

హైదరాబాద్ స్టార్టప్ సరికొత్త రికార్డు

TG: HYDకు చెందిన స్టార్టప్ సంస్థ జెనిత్ అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ తన తొలి డ్రోన్ ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ డ్రోన్ పనితీరు, సామర్థ్యాన్ని నిర్ధారించేలా నిర్వహించిన ఫ్లైట్ టెస్ట్ సక్సెస్ కావడంతో కంపెనీ మరో కీలక మైలురాయిని అధిగమించింది. భవిష్యత్తులో నిఘా, రవాణా, వ్యవసాయ రంగాలలో ఈ డ్రోన్ సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు.

February 25, 2026 / 06:37 AM IST