W.G: భీమవరం శ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ‘బ్యాండ్ మేళం’ చిత్ర హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు చేసి, వేద ఆశీర్వచనాలు అందజేశారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా భీమవరం వచ్చినట్లు రోషన్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
NRPT: మక్తల్ మున్సిపాలిటీ 8వ వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో సుమారు రూ.2.50 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పనులు జరుగుతుండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ADB: పీఆర్టీయూ తెలంగాణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి ఆదిలాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం నిరంతరం ఉద్యమిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోలేదని, వేతనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని ఆయన పేర్కొన్నారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వేసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి సోమవారం నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం ఉదయాన్నే స్వామి మూల విరాట్‌కు పురోహితుడు రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నైవేద్యాలు అందించారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ADB: ఉట్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పంచాయతీలోని పలు వార్డుల్లో ఉదయం నుంచే కార్మికులు చెత్తను తొలగించారు. కాగా పారిశుద్ధ్య పనులను సర్పంచ్ అనిత శ్రీనివాస్ పరిశీలించి కార్మికులకు పలు సూచనలు చేశారు. అలాగే ప్రజలు రోడ్లపై, నాలాల్లో చెత్తను వేయకుండా సూచించిన స్థలాల్లోనే వేయాలన్నారు.
E.G: వేసవిలో కరెంటు సమస్యలు తలెత్తకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఏపీ డీసీఎల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్యలు రాకుండా చూడాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.
TPT: దేశంలో మొదటిసారిగా శివాలయంగా గుర్తింపు పొందిన ఏర్పేడు మండలంలోని గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయంలో ఏప్రిల్ 18 నుంచి 23 వరకు మహా కుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకు ముందుగా ఈనెల 8వ తేదీ నుంచి బాలాలయం ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
VZM: చీపురుపల్లి రైల్వే స్టేషన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడుకి నియోజకవర్గ మాజీ టీడీపీ ఇంఛార్జ్ త్రిమూర్తులు రాజు, మాననీయత సంస్థ అధ్యక్షులు గోవిందరాజులు కోరారు. ముఖ్యంగా ముంబై వెళ్లందుకు రైలు సౌకర్యం లేదని, హైదరాబాదుకు మరిన్ని రైళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. కోణార్క్, ఫలక్ నామా రైలును చీపురుపల్లి స్టేషన్లో నిలపాలన్నారు.
అనకాపల్లి జిల్లాలో 8 బాణసంచా కేంద్రాలు ఎన్ఓసీలు లేకుండా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా పోలీస్, ఫైర్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు బాణసంచా తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. అధికారికంగా 11 బాణసంచా కేంద్రాలు ఉండగా నిబంధనలు పాటించని ఎనిమిది కేంద్రాలకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీలు జారీ చేయలేదు.
దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇవాళ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పడింది. దీంతో ఉదయం భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1100 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ 300 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 24 పైసలు తగ్గి రూ.91.32గా ఉంది.
ELR: ఉంగుటూరు మండలంలో వేరు వేరు చోట్ల పేకాట స్థావరాలపై దాడి చేశామని చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ శనివారం రాత్రి తెలిపారు. కాగుపాడు లో 8 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద రూ. 20,600లు నగదు, నాలుగు మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్న మన్నారు . నాచుగుంటలో నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకుని, రూ. 3100 నగదు, ఆరు మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
PPM: కొమరాడ మండలం దలాయిపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సోమవారం సంచరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లోకి ప్రవేశించి వరి, అరటి, మొక్కజొన్న తదితర పంటలను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను గ్రామాలకు దూరంగా తరలించాలని కోరుతున్నారు.
KMM: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ ఖమ్మం పర్యటనలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. రాజ్యాంగ పదవిలో ఉన్న తాను పర్యటనలో భాగంగా ఖమ్మం వస్తే తనను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ రిసీవ్ చేసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని ఆయన ఓ ప్రకటనలో మీడియాకు తెలియజేశారు.
NLG: ఆమనగల్లు గ్రామంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర ఆనాటి సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుందని డీఎస్పీ రాజశేఖరరాజు అన్నారు. ఆదివారం ఆయన జాతరను, క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలందరూ కులమతాలకు అతీతంగా జాతరను జరుపుకోవాలని కోరారు.