BDK: భద్రాద్రి జిల్లా ప్రజలకు ఎస్పీ రోహిత్ రాజ్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ.. సహజ సిద్ధమైన రంగులతో ప్రశాంత వాతావరణంలో హోలీ సంబరాలు నిర్వహించుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ATP: గుత్తి మండల పరిధిలోని జిల్లా సరిహద్దు వద్ద గల జొన్నగిరి గ్రామంలో సోమవారం శ్రీనివాసులు అనే రైతు పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యుల గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
KNR: SU పరిధిలోని బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. అపరాధ రుసుం లేకుండా మార్చి 13 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో మార్చి 18 వరకు ఫీజు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడాలని లేదా సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలని ఆయన సూచించారు.
MNCL: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సోమవారం తెలంగాణ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కళాకారులకు నిధులు కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 9న హెటిరో డ్రగ్స్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్ సంస్థల ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య పి.ప్రసన్నశ్రీ తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చదివిన 18-25 ఏళ్ల పురుష అభ్యర్థులు వీటికి అర్హులన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
TG: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. రాష్టంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయంలో స్వామివారికి భక్తులు అభిషేకపూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి కల్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు, పెద్దపల్లకి సేవలు, ఆకులపూజలుచేసి భక్తిప్రపత్తిని చాటుకుంటున్నారు.
NLR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కార్పొరేషన్లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం నిర్వహించారు. విభాగాల వారీగా టిడ్కో హౌసింగ్ 14, టౌన్ ప్లానింగ్ 08, రెవెన్యూ 05, ఇంజనీరింగ్ 04, హెచ్ సెక్షన్ 01, పెన్షన్ 01, ఆప్కాస్ 01, జీఎస్ డబ్ల్యూఎస్ 01, మొత్తం 43 వినతులను కమిషనర్ స్వీకరించారు. అందరికీ న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
NGKL: సహజ రంగులతో హోలీ పండుగను పర్యావరణానికి అనుకూలంగా జరుపుకోవాలని DMHO రవి కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. జిల్లా ప్రభుత్వ సైన్స్ డిగ్రీ & పీజీ కళాశాలలో నిర్వహించిన ఈకో-ఫ్రెండ్లీ హోలీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రసాయన రంగులు చర్మం, కళ్లకు, శ్వాసకోశానికి హానికరమని,సీసం వంటి లోహాలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని హెచ్చరించారు.
AP: ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై చెలరేగిన వివాదంలో పీఎస్ కమిటీ రెండోసారి సమావేశం అయింది. పీఎస్ కమిటీ ముందు లెఫ్ట్ వింగ్ SFI, AISF, PDSU విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు. క్యాంపస్‌లో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరగడానికి వీల్లేదని లెఫ్ట్ వింగ్ చేసిన డిమాండ్‌కు పీఎస్ కమిటీ అంగీకరించినట్లు విద్యార్థి సంఘాలు తెలిపాయి.
KDP: హోలీ పండుగ సెలవు దినం రేపే అని జిల్లా విద్యాశాఖ అధికారి సంషుద్దీన్ స్పష్టం చేశారు. అకడమిక్ క్యాలెండర్లో తెలిపినట్లుగా హోలీ పండుగ సెలవు దినం నాలుగో తేదీ కాదని మార్చి మూడున నిర్ణయించామన్నారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు గమనించాలని ఆయన కోరారు.
KMR: పిట్లం మండలం హస్నాపూర్లో విషాదం నెలకొంది. గ్రామలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. హస్నాపూర్ గ్రామానికి చెందిన పోతూ రాజు సత్యం (41) సోమవారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. మృతుడు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
GDWL: అలంపూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయమని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. అయిజ మండలం యాపదిన్నెకు చెందిన రంగారెడ్డికి వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి LOCని ఆయన సోమవారం అందజేశారు. ప్రజల సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
TPT: తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరవపల్లె వీధిలో టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి కె.లక్ష్మమ్మ(67)ను నగల కోసం హత్య చేశారు. గొంతు నులిమి దిండుతో ఊపిరాడకుండా చేసి సుమారు 100 గ్రాముల బంగారం దోచుకెళ్లినట్లు సమాచారం. ఘటన స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
BDK: వేములపల్లి రవిశంకర్ గొప్ప వ్యక్తి అని MLA కూనంనేని అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో కొత్తగూడెం పట్టణంలో సోమవారం వేములపల్లి రవిశంకర్ దిశాదిన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు హాజరై రవిశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
SDPT: కోహెడ మండలంలోని తీగలకుంటపల్లి గ్రామ బీరప్ప దేవాలయం వద్ద బోర్ మోటార్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధుల ద్వారా రూ.2 లక్షల వ్యయంతో బోర్ తవ్వించారు. సర్పంచ్ మ్యాకల స్వర్ణలత సురేందర్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పనులు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.