KKD: పిఠాపురం పాదగయ క్షేత్రం గ్రహణం రోజున కూడా తెరిచే ఉంటుంది. రేపు మంగళవారం చంద్రగ్రహణం మధ్యాహ్నం గం. 3.20 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంది. అయినా సరే పాదగయ క్షేత్రం తెరిచే ఉండి కుక్కుటేశ్వర స్వామికి పూజలు యధాతధంగా చేస్తారు. భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఆలయం మండపం వద్ద గ్రహణ సమయంలో బ్రాహ్మణులు జపాలు చేస్తారు.
SDPT: భూంపల్లి-అక్బర్పేట్ మండలం ఖాజీపూర్‌లో శ్రీ మల్లన్న కళ్యాణ మహోత్సవం జరిగింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ నిర్వాహకులను అభినందించి, గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
TG: ఇరాన్ దాడులపై 6 గల్ఫ్ దేశాలు సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఇరాన్ దాడులు తక్షణమే ఆపాలని హెచ్చరించాయి. దాడులు ఆపకపోతే తమను తాము రక్షించుకునేందుకు ప్రతిదాడులు తీవ్రంగా చేయాల్సి వస్తుందని తెలిపాయి. ఇరాన్ దాడుల వల్ల ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పు ఉందని పేర్కొన్నాయి.. ఈ మేరకు ఖతార్, సౌదీ, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ ప్రకటన చేశాయి.
SRCL: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో గతంలో కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన అనుమల మహేందర్ కుటుంబానికి సెస్ వైస్ ఛైర్మన్ దేవరకొండ తిరుపతి రూ.5 లక్షల ఎక్స్రేషియా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఏఈ, గ్రామ సర్పంచ్ కమ్మరి స్వప్న నాగరాజు పాల్గొన్నారు.
KNR: బేటీ బచావో.. బేటి పడావో పథకంలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాల పోస్టర్లను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, PCPNDT Act, చైల్డ్ హెల్ప్ లైన్ పోస్టర్లను ఆవిష్కరించారు.
KDP: అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం సీఎం చంద్రబాబు ఇంటి వద్ద హోలీ జరుపుకుంటామని హెచ్చరించారు. తమ డిమాండ్లు అంగీకరిస్తే చంద్రబాబుతో కలిసి సంతోషంగా హోలీ జరుపుకుంటామని, లేదంటే నిరసన తెలుపుతూ హోలీ జరుపుకుంటామని తెలిపారు. ఈ మేరకు అంగన్‌వాడీల నుంచి ఈ హెచ్చరిక వెలువడింది.
NZB: ఎడపల్లి మండలం అంబం(వై)కి చెందిన డప్పు మహేష్ (40) చెరువులో పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన మహేశ్ తిరిగి రాకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. కాళ్లకు చేపల వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి మరణించినట్లు పోలీసులు గుర్తించారు.
కోనసీమ: దాక్షారామంలోని నిరుపేద పురోహితుడు కావుటూరి సీతారాంకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. సీతారాం గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయన ఆర్థిక, జీవన స్థితిగతులను తెలుసుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ జీవనం కోసం ప్రతినెల రూ. 10 వేలు సహాయం చేస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం డీస్పీ నాగరాజు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించి, వారితో మాట్లాడి వారి ఫిర్యాదు గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు. చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు.
KRNL: ఆలూరులో బెల్లీ గుండు ఆంజనేయస్వామి గుడి సమీపంలో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా సోమవారం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు,జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ పాల్గొన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
GDWL: పట్టణంలోని లైబ్రరీలో మౌలిక వసతులు కల్పించాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ప్రధానంగా టాయిలెట్లు లేక మహిళా పాఠకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కోరారు.
PLD: ముప్పాళ్ల మండలం బొల్లవరం మరియు సత్తెనపల్లి రూరల్ మండలం కంటెపూడి గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఆరాచక, రాక్షస పాలన సాగిందన్నారు.
కృష్ణా: గన్నవరం బాణా సంచా గోదామును రెవెన్యూ సిబ్బందితో కలిసి ఎస్సై ప్రశాంతి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదాలు నివారించేందుకు ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యాలపై షాపు యజమానులకు సూచనలు అందించారు. భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
SKLM: ఉపాధి హామీ కూలీల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ‘వికసిత భారత్ – జీ రామ్ జీ’ లక్ష్యాలను ప్రతి గడపకూ చేర వేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉన్నారు. స్థానిక జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో డ్వామా పీడీ బి.లవరాజుతో కలిసి ఈ పథకానికి సంబంధించిన నూతన అవగాహన గోడ పత్రికను ఆవిష్కరించారు.
NGKL: లింగాల మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామం కాలనీలో రూ.5 లక్షల సీసీ రోడ్డు పనులు సోమవారం ప్రారంభించారు. నిధులు కేటాయించినందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అచ్యుత రెడ్డి, మాజీ సర్పంచ్ రవిశంకర్, నాయకులు జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.