• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘రేషన్ డీలర్లు సరైన తూకముతో పంపిణీ చేయాలి’

ATP: జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం సాయంత్రం సివిల్ సప్లయిస్ అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో వీ.సీ. ద్వారా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. లబ్ధిదారులకు రేషన్ డీలర్లు అందుబాటులో ఉండి సరైన తూకముతో పంపిణీ చేయాలని ఆదేశించారు.

March 3, 2026 / 04:55 AM IST

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణంపై జీవో‌పై హర్షం

E.G: ఇంద్రధనస్సు పథకంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వం జీవో 21 జారీ చేయడం పట్ల బిక్కవోలు బీజేపీ నాయకుడు చేవ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి రామకృష్ణారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

March 3, 2026 / 04:19 AM IST

హైకోర్టు తీర్పును అమలు చేయాలి: కోతి మాధవి

HYD: తెలంగాణ ఉద్య మకారులకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ కోతి మాధవి అన్నారు. తెలంగాణ ఉద్య మకారుల జేఏసీ రాష్ట్రకమిటీ సమావేశం కొత్తపేటలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఇంతకుముందు ఉన్న రాష్ట్ర కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు.

March 3, 2026 / 04:19 AM IST

మార్చి 03: చరిత్రలో ఈరోజు

1839: టాటా గ్రూపు వ్యవస్థాపకులు జమ్‌షెట్జీ టాటా జననం1847: అలెగ్జాండర్ గ్రహంబెల్ జననం1938: తెలుగు హాస్య నటి గిరిజ జననం1967: గాయకుడు శంకర్ మహదేవన్ జననం1967: నక్సల్బరీ ఉద్యమం ప్రారంభం2002: తొలి దళిత లోక్‌సభ స్పీకర్ బాలయోగి మరణం* ప్రపంచ వినికిడి దినోత్సవం* ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

March 3, 2026 / 01:10 AM IST

కేరళ సీఎంకు మంత్రి పొంగులేటి కౌంటర్

TG: కాంగ్రెస్ సర్కారుపై కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన విమర్శలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. SM వేదికగా విజయన్‌కు కౌంటర్ ట్వీట్ పెట్టారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందిస్తూ, ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం కేరళ కాంగ్రెస్‌ను లాగడం సరికాదన్నారు.

March 3, 2026 / 12:55 AM IST

మార్చి 03: మంగళవారం పంచాంగం

➠ తిథి: పౌర్ణమి సా.4:53 వరకు తదుపరి పాడ్యమి ➠ నక్షత్రం: మఖ ఉ.7:31 వరకు, తదుపరి పుబ్బ ➠ శుభ సమయాలు: ఉ.8:15-8:37, ఉ.9:26-11:11, మ.12:09-మ.1:08, మ.3:05-3:32, సా.5:10-6.00 వరకు ➠ రాహుకాలం: మ.3-4:30 వరకు ➠ యమగండం: ఉ.9-10:30 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.8:38-9:25, రా.10:55-11:44 వరకు ➠ వర్జ్యం: మ.3:33-సా.5:09 ➠ అమృత ఘడియలు: ఉ.6:43 వరకు తిరిగి అర్ధరాత్రి రా.1:11 నుంచి 2.48 వరకు

March 3, 2026 / 12:30 AM IST

బీవై నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో కామదహనం

సిరిసిల్ల జిల్లా 33వ వార్డులోని బీవై నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో కామదహనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి 33వ వార్డు కౌన్సిలర్ కొండ నరేష్ హాజరై మాట్లాడారు. ప్రజలందరూ నిండు పున్నమిలా సుఖసంతోషాలతో ఉండాలని, ఆత్మీయతలను పంచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గాజుల శ్రీనివాస్, సిరిమల్లె సత్యం, ఆడెపు శ్రీనివాస్, సాప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 11:02 PM IST

టీటీడీ ఛైర్మన్ వీడియో వైరల్.. కేసు నమోదు

TG: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వైరల్ వీడియోపై హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఇందులేఖ ఫిర్యాదు చేశారు. తన ఫొటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని, విదేశాల నుంచి పోస్టు చేసినట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో పోలీసులు BNS 319, 335, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే, ఐటీ చట్టం 66C, 66D, 67 కింద కేసు పెట్టినట్లు సమాచారం.

March 2, 2026 / 11:00 PM IST

అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టడం లేదా?

కొందరికి అర్ధరాత్రి 12 గంటలైనా నిద్ర పట్టదు. కానీ అంతసేపు నిద్రపోకుండా ఉండడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 5 గంటలు ఫోన్ చూసేవారిలోనే ఈ సమస్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు. రాత్రి తక్కువగా తినాలి. నిద్రకు 2 గంటల ముందే భోజనం తీసుకోవాలి. గది ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉంచుకోవాలి. మ్యూజిక్ వినడం, బుక్స్ చదవాలి. నిద్రకు గంట ముందే ఫోన్‌ను దూరంగా పెట్టాలి.

March 2, 2026 / 10:30 PM IST

మొలకెత్తిన గింజలు తింటున్నారా?

TG: మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు నిండి ఉంటాయి. వీటిని రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. గుండె సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నరాల వ్యవస్థ బలోపేతం అవుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

March 2, 2026 / 10:27 PM IST

సంజూ శాంసన్ ఒక మ్యాచ్ విన్నర్: గంగూలీ

టీమిండియా బ్యాటర్ సంజు శాంసన్‌పై సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. శాంసన్ ఒక అద్భుతమైన ఆటగాడని ఆయన ప్రశంసించాడు. వైట్ బాల్ క్రికెట్‌లో భారత్ తరపున సంజూ నిలకడగా అవకాశాలు పొందాలని అభిప్రాయపడ్డాడు. అతడు ఒకసారి క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థి జట్టుకు భారీ నష్టం చేకూర్చగలడని తెలిపాడు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటం అతనిలోని గొప్ప లక్షణమని కొనియాడాడు.

March 2, 2026 / 10:18 PM IST

రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

AP: కర్ణాటక హసన్‌ జిల్లా సిద్ధాపురం పరిధిలోని హరత్నాహల్లిలో పాత కోళ్లఫారాల షెడ్లపై దాడులు నిర్వహించి రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ సుబ్బరాయుడు తెలిపారు. 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అలాగే, 8 టన్నుల బరువున్న 195 దుంగలు స్వాధీనం చేసుకుని, 3 వాహనాలను సీజ్‌ చేసినట్లు చెప్పారు.

March 2, 2026 / 10:12 PM IST

హెల్త్ యూనిట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రూ.50 లక్షలతో నిర్మించనున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవన నిర్మాణానికి మండల పెద్దలు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము సోమవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

March 2, 2026 / 10:00 PM IST

ఆకివీడు హైస్కూల్‌ను సందర్శించిన హేమ జైశ్వాల్

W.G: ఆకివీడు PLS హైస్కూల్లో ఎంఈవోలు, హెడ్మాస్టర్లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పీఎం శ్రీ సెంట్రల్ నోడల్ ఆఫీసర్ హేమ జైశ్వాల్ సోమవారం హాజరయ్యారు. అదనపు బోధన వనరులు ఉపయోగించుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. ఆమె పీఎంశ్రీ నిధులతో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లను పరిశీలించారు. కలెక్టర్ CH.నాగరాణి మాట్లాడుతూ.. పీఎంశ్రీ జాతీయ స్థాయిలో విద్యా నాణ్యతను మెరుగుపర్చేది అన్నారు.

March 2, 2026 / 10:00 PM IST

శ్రీమఠంలో రేపు పూజలు బంద్

AP: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో రేపు జరగాల్సిన పలు సేవా కార్యక్రమాలు, పూజలను నిలిపివేస్తున్నట్లు మఠం అధికారులు ప్రకటించారు. చంద్రగ్రహణం సంభవించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. గ్రహణం కారణంగా మఠంలో నిర్వహించే నిత్య అభిషేకాలు, నిత్య అన్నదానం, పరిమళ ప్రసాదం ఇతర అన్ని రకాల సేవా కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయన్నారు.

March 2, 2026 / 09:56 PM IST