• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఒత్తిడి లేని జీవితం.. మీ చేతుల్లోనే!

ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలు అలవరుచుకోవడం, అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మనశ్శాంతి అనేది కేవలం మెదడుకే కాదు, శరీరంలోని ప్రతి కణానికి శక్తినిస్తుంది.

March 2, 2026 / 09:49 PM IST

MPPS పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు

VKB: హుస్సేన్‌పూర్ MPPS పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో GHM నరసింహులు, క్రాంతి కుమార్, ఇతర ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ​పిల్లల ప్రతిభను చూసి అతిథులు వారిని ఎంతో అభినందించారు.

March 2, 2026 / 09:48 PM IST

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రతిమ సింగ్★ పైర్ణమి సందర్భం ఏడుపాయలలో ఘనంగా దుర్గమ్మ పల్లకి సేవ★ ఇవాళ జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షకు 95.55 శాతం విద్యార్థులు హాజరు★  రేగోడ్ మండలంలో హీటర్ పేలి ఇల్లు దగ్ధం

March 2, 2026 / 09:44 PM IST

స్నానం ఇలా చేస్తున్నారా?

స్నానం చేసేటప్పుడు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముందుగా తలపై నీరు పోసుకోవడం ప్రమాదకరమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. తలపై నీరు పోయగానే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారి, రక్త ప్రసరణ తలవైపు పెరిగి ఆర్టరీలు పగిలే ప్రమాదం ఉంది. తద్వారా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.

March 2, 2026 / 09:44 PM IST

రేపు చంద్రబాబుతో పవన్ భేటీ

AP: రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కల్తీ పాలు, అతిసారం, వేట్లపాలెం పేలుడు, టీటీడీ ఛైర్మన్ వివాదం ఇలా వరుస ఘటనల నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. టీటీడీ లడ్డు అంశం, వన్‌మెన్ కమిటీ, కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.

March 2, 2026 / 09:42 PM IST

భారత్‌-కెనడా మధ్య యురేనియం డీల్‌

భారత్-కెనడా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం మీద ఇరుదేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై  చర్చలు జరిపేందుకు అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

March 2, 2026 / 09:39 PM IST

గల్ఫ్ బాధితులకు తక్షణ సాయం అందేలా చూడండి: CM

AP: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లోని రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని, ఇందుకోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అక్కడ చిక్కుకుపోయిన వారిని సంప్రదించి, తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

March 2, 2026 / 09:38 PM IST

‘నాటుసార కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి చర్యలు’

KRNL: నాటుసారా విక్రయించే కుటుంబాల జీవనోపాధికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా నాటుసార కుటుంబాల పునరావాస వ్యూహం, కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావళి అల్ఫోన్స్, ఎక్సైజ్ ఈఎస్ రవికుమార్ పాల్గొన్నారు.

March 2, 2026 / 09:36 PM IST

పాలకొల్లులో బాణసంచా కేంద్రాల్లో తనిఖీలు

W.G: వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీపేలుడు దుర్ఘటన నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలతో పాలకొల్లులోని బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో సీఐ రజనికుమార్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. తయారీ, విక్రయ కేంద్రాలు ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ నిబంధనలు పాటిస్తున్నాయా, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

March 2, 2026 / 09:33 PM IST

సునీల్‌ నాయక్‌ విచారణకు హాజరుకావాలి: హైకోర్టు

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గతంలో కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణకు హాజరుకావాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 5 నుంచి 9 వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసులో సునీల్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

March 2, 2026 / 09:32 PM IST

వైసీపీని వీడి టీడీపీలో చేరికలు

ప్రకాశం: రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామంలో సోమవారం 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ అభివృద్ధికి కార్యకర్తలందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

March 2, 2026 / 09:30 PM IST

సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్‌లు: తుమ్మల

TG: రైతుల కోరిక మేరకు ఆధునిక సాంకేతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ డ్రోన్‌లు సబ్సిడీపై అందజేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో యాంత్రికరణను వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సబ్ ​మిషన్​ అగ్రికల్చర్​ మెకనైజేషన్ పథకం కింద పలు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

March 2, 2026 / 09:29 PM IST

తిరుమలలో ఏకసభ్య కమిషన్ పర్యటన

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు తిరుమల చేరుకుంది. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నెయ్యి కల్తీ ఘటనలో లోపాలపై విచారణ చేయనుంది. మొత్తం 45 రోజుల్లోపు విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

March 2, 2026 / 09:27 PM IST

ఆరోగ్యకరమైన నిద్ర కోసం..!

శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి రాత్రి పూట 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గడం, చిరాకు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండటం వల్ల మంచి నిద్ర పడుతుంది. దీనితో పాటు, పడుకునే ముందు కాఫీ, టీ వంటి కెఫీన్ పానీయాలకు దూరంగా ఉండటం వల్ల మెదడు త్వరగా విశ్రాంతి పొంది గాఢ నిద్ర పడుతుంది.

March 2, 2026 / 09:27 PM IST

యుద్ధం.. పెరిగిన ఇంధన ధరలు

పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ఖతార్ ఉత్పత్తి నిలిపివేత, ఇరాన్ దాడుల ప్రభావంతో యూరప్‌లో గ్యాస్ ధరలు 50 శాతం పెరిగాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా ఆగిపోవడంతో LNG సరఫరా దెబ్బతిని, ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు, తయారీ రంగంపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోంది.

March 2, 2026 / 09:20 PM IST