TG: అనంతగిరి హిల్స్‌లో నిర్వహించిన DCC అధ్యక్షుల శిక్షణ ముగింపు సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తొలుత CM రేవంత్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశం కోసమైనా ప్రధాని కావాల్సిందేనని, తాను CMగా అడగడం లేదని, ఓ కాంగ్రెస్ కార్యకర్తగా కోరుకుంటున్నానని అన్నారు.
NLG: హోళీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ వేడుక సమాజంలో సోదరభావం, ఐక్యతను పెంపొందించాలని కోరారు. పర్యావరణానికి హాని కలిగించని ప్రకృతి సిద్ధమైన రంగులతో సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.
NZB: హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలు పోలీసు నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై లేదా వాహనాలపై బలవంతంగా రంగులు, నీటిని చల్లడం నిషేధమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీస్ చట్టం సెక్షన్-76 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
కోనసీమ: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజోలు సీఐ నరేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం రాజోలులో ఆయన తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి నుంచి జరిమానాలు వసూలు చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం చట్ట విరుద్ధం అని, దీనిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సీఐ అన్నారు.
WGL: నర్సంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఆకర్షితులై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో ఈ రోజు కుమ్మరి సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నర్సంపేట అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.
NRML: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో యువ నాయకుడు యాసీన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు BRS పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం త్యాగం, నియమం, దానం, దైవ భక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ADB: కష్టపడిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బజార్హత్నూర్ మండలంలోని దేగామ గ్రామంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ బండారి అనుషను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ మేరకు గజేందర్ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
T20 ప్రపంచకప్‌లో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య హెడ్-టు-హెడ్ రికార్డు భారత్‌కు స్వల్పంగా అనుకూలంగా ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు T20 WCలో మొత్తం 5 సార్లు తలపడగా.. భారత్ 3 సార్లు, ఇంగ్లండ్ 2 సార్లు విజయం సాధించాయి. వాంఖడే స్టేడియంలో ఈ జట్లు టీ20ల్లో రెండుసార్లు తలపడగా, చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి.
BDK: కొత్తగూడెం పట్టణంలో నూతన బురఖా అండ్ ఫాన్సీ స్టోర్ను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సాబీర్ పాషా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్తగూడెంలో మొట్ట మొదటి సారిగ బురఖా హౌస్ స్థాపించి బాంబే నుంచి దిగుమతి చేసి హోల్ సేల్ ధరలకే కొత్తగూడెం ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చిన అబ్దుల్ రషీద్‌ను అభినందించారు.
VZM: జిల్లాలోని పలు బాణాసంచా తయారీ కేంద్రాలపై జిల్లా యంత్రాంగం ఉమ్మడి తనిఖీలు నిర్వహించింది. బాడంగి, గుర్ల, చీపురుపల్లిలో ఈ తనిఖీలు జరిగాయి. జిల్లా ఫైర్ ఆఫీసర్, ఎక్స్‌ప్లోజివ్ కంట్రోలర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.
ELR: రైలు పట్టాలు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. హనుమాన్ నగర్ వంతెన వద్ద పట్టాలు దాటుతున్న కుప్పాల లీలా కుమార్ (45)ను రైలు ఢీకొంది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. రైల్వే ఎస్సై దానం ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
NRPT: ఊట్కూర్ మండల మొగ్ధంపూర్ గ్రామంలోని శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన 14వ దినోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, అలంకరణ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మహాప్రసాదం పంపిణీ చేయగా.. గ్రామ పెద్దలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
NRPT: కృష్ణ మండలంలోని హిందూపూర్ నుంచి మాగనూర్ మండల కేంద్రానికి వెళ్లే రహదారి ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో దెబ్బతింది. కల్వర్టు శిథిలం కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం రాకపోవడంతో ఇప్పటికైనా వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
MDK: ఏడుపాయలలో పౌర్ణమిని పురస్కరించుకొని నేడు రాత్రి వన దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి ప్రారంభమైన పల్లకిసేవ శివాలయం మీదుగా కొనసాగి రాజగోపురం గుండా ఆలయం వరకు చేరుకుంది.