• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రకృతికి ప్రాణం.. వన్యప్రాణుల రక్షణే మన లక్ష్యం

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నేడు. ప్రకృతి సమతుల్యతలో మూగజీవాల పాత్ర వెలకట్టలేనిది. అడవుల నరికివేత, వేట వల్ల అనేక జాతులు అంతరించిపోతున్నాయి. మన మనుగడ వన్యప్రాణుల రక్షణపైనే ఆధారపడి ఉంది. భూమిపై ఉన్న ప్రతి జీవిని గౌరవిద్దాం, అడవులను కాపాడుకుందాం. భావి తరాలకు పచ్చని ప్రకృతిని అందిద్దామని ఈరోజు ప్రతిజ్ఞ చేద్దాం. వన్యప్రాణుల రక్షణ మనందరి బాధ్యత.

March 3, 2026 / 10:44 AM IST

కలెక్టర్లతో సీఎస్ కాన్ఫరెన్స్

TG: రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణరావు కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జనగణనపై చర్చించారు. మధ్యాహ్నం సెషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్నారు.

March 3, 2026 / 10:39 AM IST

ఈ లింక్‌లతో జాగ్రత్త

TG: హోలీ పండుగను ఆసరాగా చేసుకని సైబర్ నేరగాళ్లు మోసలకు పాల్పడుతున్నారు. రంగులు, గిఫ్ట్ వోచర్లు, హోలీ ఈవెంట్ పాస్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ వాట్సాప్, SMS, సోషల్ మీడియా ద్వారా నకిలీ లింకులను పంపిస్తున్నారు. అయితే ఈ లింకులపై క్లిక్ చేస్తే స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అవ్వడమే కాకుండా, బ్యాంక్ ఖాతాలోని సొమ్ము క్షణాల్లో మాయమయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.

March 3, 2026 / 10:38 AM IST

కుక్కల దాడిలో గొర్రెలు మృతి

SKLM: బూర్జ (M) కొరగాం గ్రామంలో కుక్కల దాడిలో పి. వెంకటరమణకు చెందిన 12 గొర్రెలు మంగళవారం మృతి చెందాయి. గుంపుగా వచ్చిన కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయని తెలిపారు. అధికారులు స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

March 3, 2026 / 10:38 AM IST

‘రైతు భరోసా వెంటనే ఇవ్వాలి’

KMM: యాసింగి పంటల సాగుకు ప్ర‌భుత్వం వెంట‌నే రైతు భరోసా అందివ్వాల‌ని సీపీఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. మంగళవారం రైతు సంఘం, సీపీఐ(యం) ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో నిరసన చేపట్టారు. యాసింగి సమయం అయిపోతున్నా ఇప్ప‌టివ‌ర‌కు ఇంకా రైతు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు.

March 3, 2026 / 10:38 AM IST

తన పొలానికి వెళ్లాలంటే కెనాల్ దాటాల్సిందే..!

MHBD: తొర్రూరు మండలం ఖానాపురం గ్రామానికి చెందిన దాసరి వెంకట్ రెడ్డి సాగు భూమి ఎస్సారెస్పీ డీబీఎం -57 కెనాల్ పక్కనే ఉంది. సాధారణంగా కెనాల్‌కు ఇరువైపులా రాకపోకలకు దారి ఉండాలి. కానీ ప్రస్తుతం ఒకవైపు మాత్రమే ఉంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. తన పొలానికి వెళ్లాలంటే కెనాల్ కాలువ దూకాల్సి వస్తుందన్నారు.

March 3, 2026 / 10:38 AM IST

దారుణం.. భార్య, అత్తను కత్తితో నరికి చంపిన వ్యక్తి

AP: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీతానగరం మండలంలోని బొబ్బిల్లంకలో ఓ వ్యక్తి తన భర్య, అత్తను కత్తితో నరికి చంపాడు. సీతారామరాజు, లత దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లత తన తల్లి లక్ష్మి ఇంట్లో ఉంటోంది. అత్తగారింటికి వెళ్లిన సీతారామరాజు.. లత, లక్ష్మిలను కిరాతకంగా నరికి చంపాడు. భార్యపై అనుమానమే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు.

March 3, 2026 / 10:37 AM IST

ఫిర్యాదులు వెల్లువెత్తినా స్పందన శూన్యం

VZM: గంట్యాడ మండలం బోనంగి శివారులో నెలకొన్న అపరిశుభ్రత పరిస్థితి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని గ్రామస్థులు మండిపడుతున్నారు. చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తున్నా ఎలాంటి చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

March 3, 2026 / 10:37 AM IST

ఘనంగా హోలీ పండుగ వేడుకలు

SDPT: కోహెడ మండలంలోని పలు గ్రామాలలో హోలీ పండుగ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. గ్రామాలన్నీ రంగుల హరివిల్లుగా మారగా, చిన్నారులు, యువకులు, పెద్దలు కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. స్నేహితుల ఇళ్లకు వెళ్లి రంగులు చల్లుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రామాల్లో పండుగ సందడి, హర్షోత్సాహాలు వెల్లివిరిశాయి.

March 3, 2026 / 10:37 AM IST

గ్రహణం వేళ మూతపడిన త్రికోటేశ్వర స్వామి ఆలయం

PLD: చంద్రగ్రహణం కారణంగా పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గ్రహణ ప్రభావంతో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు భక్తులకు దర్శనం ఉండదని అర్చకులు తెలిపారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయ శుద్ధి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

March 3, 2026 / 10:36 AM IST

తాండూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు

VKB: తాండూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరు మార్కెట్ కమిటి ఛైర్మన్‌గా ఉన్న సాయిపూర్ బాల్ రెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలును మార్కెట్ కమిటి ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

March 3, 2026 / 10:35 AM IST

‘గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి’

MDK: చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి పేర్కొన్నారు. గ్రామంలో మంగళవారం మురుగు కాలువలలో పేరుకుపోయిన మురుగును తొలగించారు. ప్రజలు ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు గ్రామ పరిశుభ్రతకు సహకరించాలని సహకరించాలని కోరారు.

March 3, 2026 / 10:34 AM IST

బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

విశాఖలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు జగదాంబ సమీప నివాసి ఎం. శ్రీధర్ (36)గా గుర్తించారు. ఆయన కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి బీచ్‌లో రాళ్ల మధ్య మృతదేహం కనిపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 3, 2026 / 10:32 AM IST

కామదహనం మంటల్లో పడి ఓ వ్యక్తికి గాయాలు..!

MNCL: తాండూరు మండలం కిష్టంపేటలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి కామదహనం చేస్తుండగా ఉరడి మల్లేశ్ ప్రమాదవశాత్తు మంటల్లో పడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. బెల్లంపల్లి 108 సిబ్బంది నరేశ్, సంపత్ ఘటనా స్థలికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 3, 2026 / 10:31 AM IST

సల్పంగా పెరిగిన పత్తి ధర..!

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్కెట్‌కు మొత్తం 40 వాహనాల్లో 296 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి రాగా, గరిష్ఠంగా రూ.7,600 ధర పలికింది. మార్కెట్లో కార్యకలాపాలను మార్కెట్ ఛైర్‌పర్సన్ స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు. తాజాగా పత్తి ధర రూ.50 పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 10:31 AM IST