HYD: బోడుప్పల్ చెంగిచెర్ల పరిధిలోని చిన్న క్రాంతి కాలనీలో హోలీ పండుగ వేడుకలు కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. కాలనీ వాసులు, చిన్నారులు,పెద్దలు అందరూ కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, కేరింతల మధ్య ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్నారు. కాలనీ గౌరవ అధ్యక్షుడు, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు అందరూ వేడుకల్లో పాల్గొన్నారు.
AP: సోషల్ మీడియా క్రియేటర్ల కష్టాన్ని దోచుకుంటున్న సంస్థలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ప్రకటనల ఆదాయంలో 55 శాతం క్రియేటర్లకు ఇస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్ వంటి సంస్థలు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఎత్తిచూపారు. మనదేశ క్రియేటర్లకు న్యాయమైన వాటా దక్కాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు.
KMR: డోంగ్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో హోలీ పర్వదినాన్ని మంగళవారం ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. మండల కేంద్రంలో యువత, మహిళలు సాంప్రదాయ రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కాగా, కొన్ని గ్రామాలలో చంద్రగ్రహణం సందర్భంగా హోలీ పండుగను బుధవారం జరుపుకోనున్నారు.
NLG: దేవరకొండ ఉప్పవాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తికేయన్ మృతి చెందాడు. స్నేహితులతో కలిసి హోలీ ఆడేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొన్నారు. అతని తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చనిపోయాడు. మరో విద్యార్థి శ్రీనివాసచారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
TPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల కోసం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. మార్చి 4న క్విజ్ పోటీలు, మార్చి 5న సంగీత పోటీలు నిర్వహించనున్నారు. డిప్యూటీ ఈవో ఆనందరాజు పర్యవేక్షిస్తున్నారు.
NDL: బేతంచెర్ల మండలంలో ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సామాజిక తనిఖీలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయని ఎంపీడీవో ఫజుల్ రహిమాన్ తెలిపారు. 2024-25 సంవత్సరానికి ప్రతి గ్రామానికి ప్రత్యేక బృందాలు వెళ్లి పనులు, కూలీల హాజరు, చెల్లించిన వేతనాలు, లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తాయని చెప్పారు. పారదర్శకతే లక్ష్యమని పేర్కొన్నారు.
JGL: కథలాపూర్ మండలంలోని అంబరిపేట గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు భూమిపూజ చేశారు. ఈ భవనం కోసం ప్రభుత్వం రూ.12 లక్షలు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిర్మాణ పనులను నాణ్యతతో, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టరుకు సూచించారు. ఏ ఈ .జగదీశ్వర్, సర్పంచ్ వేముల లక్ష్మి, ఉప సర్పంచ్ సత్యం పాల్గొన్నారు.
MDK: మనోహరాబాద్ మండలం కూచారం పరిధిలోని రైలు పట్టాల వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కూచారం 241 రైల్వే గేట్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్న ఈ వ్యక్తి చేతిపై ‘సాయి’, ‘అమ్మ’ అని పచ్చబొట్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన నేపథ్యంలో జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ, వంద పడకల హాస్పిటల్ను, నూతనంగా నిర్మించిన మార్చురీ బిల్డింగును మాజీ మంత్రి సీ. లక్ష్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఈ ఘటనకు అధికారులు బాధ్యత వహించాలన్నారు.
SRCL: వేములవాడ సబ్ డివిజన్ డీఎస్పీగా నియమకమైన శ్రీనివాసులు మంగళవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల హైదరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి, వేములవాడ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బదిలీపై వచ్చారు. మంగళవారం బాధ్యతల స్వీకరించిన అనంతరం శ్రీనివాసులు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ను కలిశారు.
KDP: బద్వేల్(మం) లక్ష్మిపాలెంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మిపాలెం మాడవీధుల్లో స్వామివారికి ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
NZB: ధర్పల్లి మండలంలో ఉగాది, రంజాన్ పండుగలను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై సామా శ్రీనివాస్ మంగళవారం సూచించారు. పండుగలు మత సామరస్యాన్ని చాటేలా ఉండాలని, ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా గడపాలని కోరారు. జిల్లా సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
NTR: ప్రతి విద్యార్థి పరీక్షలలో ప్రశ్నాపత్రాన్ని 15 నిమిషాలు క్షుణ్ణంగా చదివి సమాధానాలు రాస్తే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుందని ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధి రాం ప్రదీప్ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మునుకుళ్ళలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కొన్నిసార్లు నెగెటివ్ ఆలోచనలు మనల్ని తీవ్రంగా వేధిస్తుంటాయి. వాటి నుంచి బయటపడటానికి మనసును ఇతర మంచి విషయాలపై మళ్లించడం చాలా ముఖ్యం. నచ్చిన సంగీతం వినడం, ప్రకృతిలో నడవడం, ఇష్టమైన పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కుదరకపోతే ధ్యానం చేయండి. ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగే తృప్తి, సానుకూల దృక్పథాన్ని నింపి, మిమ్మల్ని మళ్లీ కొత్త ఉత్సాహంతో నింపుతుంది.
కొన్నిసార్లు నెగిటివ్ ఆలోచనలు మనల్ని తీవ్రంగా వేధిస్తుంటాయి. వాటి నుంచి బయటపడటానికి మనసును ఇతర మంచి విషయాలపై మళ్లించడం చాలా ముఖ్యం. నచ్చిన సంగీతం వినడం, ప్రకృతిలో నడవడం, ఇష్టమైన పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కుదరకపోతే ధ్యానం చేయండి. ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగే తృప్తి, సానుకూల దృక్పథాన్ని నింపి, మిమ్మల్ని మళ్లీ కొత్త ఉత్సాహంతో నింపుతుంది.