• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

సెన్సేషనల్ బుకింగ్స్‌తో ‘ధురంధర్ 2’!

రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ క్రేజీ కాంబోలో రాబోతున్న ‘ధురంధర్ 2’ మూవీ మార్చి 19న విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రీమియర్స్ బుకింగ్స్‌తోనే రికార్డులు తిరగరాస్తోంది. ఇండియాలో ఇప్పటికే రూ.20 కోట్ల మార్కును చేరుకోగా, నార్త్ అమెరికాలో 8 లక్షల డాలర్ల వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ లెక్కలు చూస్తుంటే ధురంధర్ హవా మామూలుగా లేదనిపిస్తోంది.

March 11, 2026 / 11:09 AM IST

ప్రభాస్ ‘స్పిరిట్’పై కొత్త రూమర్స్

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతుండగా.. ఆ తర్వాత ప్రభాస్, త్రుప్తి డిమ్రిపై ఒక సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. ఇందులో ప్రభాస్ డాన్స్, త్రుప్తి గ్లామర్ హైలైట్‌గా నిలవనున్నాయట. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించనున్న ఈ మూవీ 2027 మార్చి 5న విడుదల కానుంది.

March 11, 2026 / 11:00 AM IST

సెట్స్ మీదకు ‘దేవర 2’.. ఎప్పుడంటే?

జూ.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’ సీక్వెల్‌పై నిర్మాత సుధాకర్ మిక్కిలినేని కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆలస్యమైన ఈ మూవీ మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలిపాడు. ‘దేవర 2’ కోసం నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుండగా.. తాజా ప్రకటనతో వారిలో ఉత్సాహం పెరిగింది.

March 11, 2026 / 10:39 AM IST

సూర్య ‘కరుప్పు’ రూమర్లకు చెక్

సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కరుప్పు’ సినిమా విడుదలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది. 2026 ఏప్రిల్ 10న సినిమా విడుదలవుతుందన్న ప్రచారాన్ని బాలాజీ ఖండించాడు. ఆ తేదీన సినిమా రావడం లేదు.. మరికొన్ని రోజుల్లో అధికారిక తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశాడు. దీంతో సూర్య అభిమానులు అసలు రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

March 11, 2026 / 10:28 AM IST

‘రై రై రా రా’ అలా పుట్టింది: అనంత శ్రీరామ్‌

గేయ రచయిత అనంత శ్రీరామ్ ‘పెద్ది’ మూవీలోని ‘రై రై రా రా’ పాట వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ఈ పవర్‌ఫుల్ పాట రాయడానికి ఆయనకు రెండు నెలల సమయం పట్టిందట. బస్ కండక్టర్లు వాడే ‘రై రై’ పదానికి ‘రా రా’ కలిపి, శ్రీశ్రీ కవితా శైలి స్ఫూర్తితో ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు అనంత శ్రీరామ్ చెప్పాడు. ఇక ఈ పాట యూట్యూబ్‌లో 40Mలకుపైగా వ్య...

March 11, 2026 / 09:57 AM IST

బన్నీ, అట్లీ మూవీపై క్రేజీ UPDATE

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో దర్శకుడు అట్లీ క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను గ్లింప్స్ ద్వారా ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్‌కు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ అతిథిగా రానున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

March 11, 2026 / 09:41 AM IST

‘వృషకర్మ’కు రికార్డు ధరకు OTT డీల్..!

‘తండేల్‌’ తర్వాత నాగచైతన్య నటిస్తోన్న మూవీ ‘వృషకర్మ’. కార్తీక్‌ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర OTT డీల్ రికార్డు ధరకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. 2026 వేసవిలో పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

March 11, 2026 / 09:23 AM IST

పవన్ విషయంలో నాకు ఆ స్వార్థం ఉంది: హరీశ్

పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీపై హరీశ్ శంకర్ అంచనాలను పెంచేశాడు. పవన్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అవుతుందని తెలిపాడు. అలాగే, పవన్‌ను వెండితెరపై అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించాలనే స్వార్థం తనకు ఉందని చెప్పుకొచ్చాడు.

March 11, 2026 / 09:15 AM IST

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘ఫౌజీ’ సందడి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘపవూడి కాంబోలో  తెరకెక్కుతున్న సినిమా ‘ఫౌజీ’. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ప్రత్యేక సెట్‌లో ప్రభాస్‌తో కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది.

March 11, 2026 / 07:42 AM IST

మార్చి 11: టీవీలలో సినిమాలు

స్టార్ మా: సీత(9AM); జీతెలుగు: స్టూడెంట్ నెం.1(9AM); ఈటీవీ: కిల్లర్(9AM); జెమిని: మసూద(9AM), అధిపతి(3:30PM); స్టార్‌మా మూవీస్: మన్యం పులి(7AM), విశ్వాసం(9AM), MCA(12PM), శ్రీనివాస కళ్యాణం(3PM), సర్దార్ గబ్బర్ సింగ్(9PM); జీ సినిమాలు: భయ్యా(7AM), రెడీ(9AM), అతడు(12PM), సర్దార్(3PM), కాంచన-3(6PM).

March 11, 2026 / 04:25 AM IST

ఓటీటీలోకి ‘కపుల్ ఫ్రెండ్లీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన క్రేజీ ఎంటర్‌టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ కానుంది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ కథలో సంతోష్ మార్క్ కామెడీ, మానస నటన ప్రత్యేకం. ఈ వీకెండ్ వినోదం కోసం ఓటీటీ ప్రియులు సిద్ధమైపోవచ్చు.

March 10, 2026 / 09:50 PM IST

కంఫర్ట్ జోన్ వదిలేసిన మంచు మనోజ్

హీరో మంచు మనోజ్ SMలో సరికొత్త ఫొటోతో సందడి చేశాడు. బ్లాక్ అండ్ వైట్ జిమ్ పిక్‌లో ఓవైపు తీవ్రమైన అలసటతో, మరోవైపు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. హెడ్‌ఫోన్స్, క్యాప్ ధరించి, కఠోర వ్యాయామం తర్వాత నేలపై కూర్చున్నట్టు ఉన్న ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై మనోజ్ స్పందిస్తూ.. ‘కంఫర్ట్‌ జోన్‌’ వదిలి, 21 రోజుల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు తెలిపాడు.

March 10, 2026 / 08:36 PM IST

‘ఉస్తాద్‌’ రన్‌టైమ్‌ ఫిక్స్‌.. ఎంతంటే?

పవన్‌ కళ్యాణ్, హరీశ్ శంకర్‌ కాంబోలో వస్తోన్న మాస్ యాక్షన్ మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ రన్‌టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా ఖరారైంది. శ్రీలీల, రాశీ ఖన్నా నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా ఈనెల 19న విడుదల కానుంది. థియేటర్లలో పవర్ స్టార్ పూనకాలకు ఇక అంతా సిద్ధమైంది.

March 10, 2026 / 04:00 PM IST

మస్ట్ వాచ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది

మలయాళంలో మంచి ఆదరణ పొందిన సెటైరికల్ డ్రామా ‘పెన్నుమ్‌ పోరాట్టమ్‌’ ఈ నెల 13న నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తోంది. విశేషమేమిటంటే, ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉండబోతోంది. వ్యంగ్యంతో కూడిన సామాజిక అంశాలను ఆసక్తికరంగా చూపించిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. విభిన్నమైన కథాంశంతో సాగే ఈ సినిమాను మిస్ కాకుండా చూసేయండి.

March 10, 2026 / 03:33 PM IST

GET READY.. ఉస్తాద్ మూడో పాట ప్రోమో వచ్చేస్తోంది

పవన్‌ కళ్యాణ్ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ థర్డ్ సింగిల్ ప్రోమో కాసేపట్లో (సా.4:36 గంటలకు) రిలీజ్ కానుంది. ఈనెల 12న HYDలోని బిగ్గెస్ట్ సింగిల్ స్క్రీన్‌లో భారీ ఈవెంట్ ద్వారా ఫుల్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. DSP మ్యూజిక్, రామ్ మిరియాల గానంలో వస్తున్న మాస్ సాంగ్ కోసం సిద్ధంగా ఉండండి. ఈనెల 19న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

March 10, 2026 / 03:30 PM IST