మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటిస్తూ, సంగీతం అందిస్తున్న మూవీ ‘ఎల్లమ్మ’. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో చిన్ననాటి సన్నివేశాలను షూట్ చేయనున్నారట. ఈ చిత్రానికి కెమెరామెన్ G. మురళిని ఎంపిక చేశారట. ఇక ‘బలగం’ ఫేమ్ వేణు యేల్దండి తెరకెక్కిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ M.M కీరవాణి తనయుడు, సింగర్, సంగీత దర్శకుడు కాలభైరవ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ‘బలగం’ ఫేమ్ నటి కావ్య కళ్యాణ్ రామ్‌ను వివాహం చేసుకోనున్నట్లు టాక్. కొంతకాలంగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి వేడుకలపై చర్చలు జరుపుతున్నారట.
బుల్లితెర సెన్సేషన్ సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో ‘G.O.A.T’ (Greatest Of All Times) మూవీ రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున, తమిళ దర్శకుడు రా. కార్తీక్ కాంబోలో ‘కింగ్ 100’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో నాగ్ లుక్‌పై దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో నాగ్ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నాడని తెలిపాడు. ముఖ్యంగా ‘శివ’, ‘రక్షకుడు’ సినిమాలోని నాగ్ ఐకానిక్ స్టైలిష్ లుక్స్‌ను ఇందులో మరోసారి చూడొచ్చని పేర్కొన్నాడు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ కాంబోలో వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రం డిజిటల్ హక్కుల డీల్ తుది దశకు చేరింది. ‘బింబిసార’, ‘శంకర్ దాదా MBBS’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాలకి మంచి వ్యూవర్‌షిప్ రావడంతో, జీ5 భారీ రేటుతో ఈ డీల్ క్లోజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను 2026 జూన్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్...
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన థ్రిల్లర్ మూవీ ‘లాక్ డౌన్’ జనవరి 30న రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక కరోనా నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు AR జీవా దర్శకత్వం వహించాడు.
అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ల మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభానికి సిద్ధమైంది. ఉగాది కానుకగా మార్చి 19న ‘ధురంధర్ 2’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలతో ఇది గ్రాండ్‌గా ఓపెన్ కానుందట. అయితే కోకాపేటలోని ఈ థియేటర్‌లో టికెట్ ధరలు భారీగా ఉండనున్నట్లు సమాచారం. సాధారణ రోజుల్లో రూ. 500, కొత్త సినిమాల విడుదల సమయంలో ఏకంగా రూ. 1000 వరకు ఉండొచ్చని టాక్.
బాలీవుడ్ నటి మలైకా అరోరా మళ్లీ వార్తల్లో నిలిచింది. అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత 52ఏళ్ల ఈ నటి ఇప్పుడు 32ఏళ్ల మోడల్ సోరబ్ బేడీతో సన్నిహితంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ పార్టీలో వీరిద్దరూ కలిసి సందడి చేయడంతో వీరి మధ్య రిలేషన్ ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. వయసులో 20ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ.. వీరిద్దరి కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది.
కన్నడ, తమిళ పరిశ్రమల్లో సత్తా చాటిన KVN ప్రొడక్షన్స్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. చిరంజీవి, బాబీ మూవీతో ఈ సంస్థ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పాటు అనిల్ రావిపూడి వంటి క్రేజీ దర్శకులకు భారీ అడ్వాన్సులు ఇచ్చి క్రేజీ లైనప్‌ను సెట్ చేసినట్లు టాక్. మరోవైపు ‘జన నాయగన్’, ‘టాక్సిక్’ మూవీలను ఈ సంస్థ రిలీజ్ చేయనుంది.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి ఇన్‌స్టా ఐడీ, ఈ మెయిల్ వివరాలను గూగుల్ సంస్థ పోలీసులకు అందజేసింది. మరిన్ని వివరాల కోసం టెలికాం సంస్థకు పోలీసులు లేఖ రాయనున్నారు. టెలికాం సంస్థ నుంచి వచ్చే వివరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించనున్నారు.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి ఇన్‌స్టా ఐడీ, ఈ మెయిల్ వివరాలను గూగుల్ సంస్థ పోలీసులకు అందజేసింది. మరిన్ని వివరాల కోసం టెలికాం సంస్థకు పోలీసులు లేఖ రాయనున్నారు. టెలికాం సంస్థ నుంచి వచ్చే వివరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించనున్నారు.
సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘తాయి కిళవి’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 9కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 51.16కోట్లు వసూలు చేసింది. ‘పవునుత్తాయి’ అనే మాస్ పాత్రలో రాధికా నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం.
బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాణంలో జస్మిత్ కె. రీన్ ఈ మూవీని తెరకెక్కించనున్నాడట. మధుబాల పాత్రలో కియారా అద్వానీ నటించనున్నట్లు వార్తలు రాగా.. అందులో నిజం లేదని టీం క్లారిటీ ఇచ్చారట. తాజాగా ఈ మూవీలో నటి అనీత్ పడ్డా భాగం కానున్నట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.
మార్చి 19న ‘ధురంధర్ 2’ విడుదల కానున్న నేపథ్యంలో OTTలో మొదటి భాగం రికార్డులు సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఇండియాలో టాప్ 5 నుంచి 3వ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు దీనికి 2.2 కోట్లకుపైగా వ్యూస్ లభించాయి. పాకిస్తాన్, UAEలలో కూడా ఇది ట్రెండ్ అవుతోంది. ఇక ‘ధురంధర్ 2’ ట్రైలర్ యూట్యూబ్‌లో 312 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.
మహేష్ బాబు ‘వారణాసి’ మూవీకి సంబంధించి ‘తథాస్తు’ అని దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా ఈ వివాదంపై హరీష్ స్పందించాడు. తన మనసులో మహేష్ పట్ల ఎంతో గౌరవం ఉందన్నాడు. ఈ మేరకు మహేష్ అభిమానులను క్షమాపణలు కోరుతూ ప్రకటన విడుదల చేశాడు. ‘వారణాసి’ సూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షించాడు.