• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

GET READY.. ఉస్తాద్ మూడో పాట ప్రోమో వచ్చేస్తోంది

పవన్‌ కళ్యాణ్ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ థర్డ్ సింగిల్ ప్రోమో కాసేపట్లో (సా.4:36 గంటలకు) రిలీజ్ కానుంది. ఈనెల 12న HYDలోని బిగ్గెస్ట్ సింగిల్ స్క్రీన్‌లో భారీ ఈవెంట్ ద్వారా ఫుల్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. DSP మ్యూజిక్, రామ్ మిరియాల గానంలో వస్తున్న మాస్ సాంగ్ కోసం సిద్ధంగా ఉండండి. ఈనెల 19న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

March 10, 2026 / 03:30 PM IST

తండ్రిని కోల్పోయిన బిగ్‌బాస్ స్టార్

బిగ్‌బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్న పవన్ తండ్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని పవన్ SMలో పంచుకోగా, తోటి కంటెస్టెంట్లు, అభిమానులు పవన్‌కు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. కాగా, హౌస్‌లో ఉన్నప్పుడు తన తండ్రి అనారోగ్యం గురించి పవన్ ఎంతో బాధపడేవాడు.

March 10, 2026 / 03:25 PM IST

ఉస్తాద్‌ వచ్చేస్తున్నాడు.. సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సందడి మొదలైంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. ఈనెల 19న ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది. దీనిపై త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయనుంది.

March 10, 2026 / 02:53 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మిత కొణిదెలకు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘నా ప్రియమైన సుస్మితకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కన నడిచిన చిన్న అమ్మాయి నుంచి.. నేడు మీరు బలమైన, బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగావ్. నిజంగా నన్ను గర్వపడేలా చేసింది. ఎప్పటికీ ఇలా ప్రకాశిస్తూ ఉండు నా ప్రియమైన హనీ పాపా. నీకు నా ప్రేమ, ఆశీస్సులు ఉంటాయి’ అని పోస్ట్ చేశారు.

March 10, 2026 / 02:00 PM IST

విజయ్‌, త్రిష రూమర్స్‌పై దర్శకుడి కామెంట్స్

గతకొంత కాలంగా నటుడు విజయ్, నటి త్రిషపై పలు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై దర్శకుడు విక్రమ్ భట్ స్పందించారు. ‘సినీ తారలకు సంబంధించి వారు నటించిన సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలి. వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. SMలో వస్తోన్న రూమర్స్ నిజమో, కాదో నాకు తెలియదు. వారి సినిమాలు మాత్రమే మనవి. వ్యక్తిగత జీవితాలు మనవి కావు’ అని అన్నారు.

March 10, 2026 / 01:40 PM IST

సల్మాన్ మూవీలో హీరోయిన్‌గా సమంత..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. రాజ్ అండ్ DK ద్వయంలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో హ్యూమర్, యాక్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. కాగా, మరో స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఈ సినిమాలో భాగమవుతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

March 10, 2026 / 01:20 PM IST

శ్రీలీల తల్లిపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఆస్తక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా రాఘవేంద్రరావు, శ్రీలీల ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం హీరోయిన్ శ్రీలీల అమ్మగారిని చూసుంటే తన సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకునే వాడినని అన్నాడు. ఆమె కొంచెం వైజయంతి మాల లాగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

March 10, 2026 / 01:04 PM IST

గోపిచంద్ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్

హీరో గోపిచంద్ 33వ ప్రాజెక్టును దర్శకుడు సంకల్ప్‌రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ మూవీకి టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తోంది. ఇవాళ రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ప్రాజెక్టులో సత్యవతి అనే గిరిజన యువతిగా రీతూ వర్మ నటిస్తున్నట్లు తెలుస్తోంది. 7వ శతాబ్ధం నాటి సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్నారు.

March 10, 2026 / 10:44 AM IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్‌కి సమయం దగ్గరకి వస్తుండగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ మార్చి 15న HYD యూసుఫ్ గూడ గ్రౌండ్స్‌లో జరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్, థమన్ సంగీతం అందిస్తున్నారు.

March 10, 2026 / 10:11 AM IST

గద్దర్ అవార్డులపై ఆర్.నారాయణమూర్తి హర్షం

గద్దర్ అవార్డుల ఎంపికపై నటుడు ఆర్.నారాయణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది గద్దర్ అవార్డులు ఏ విమర్శలకూ తావివ్వలేదన్నారు. గొప్పచిత్రాలు, అర్హులకు అవార్డులు అందాయని కొనియాడారు. అవార్డుల్లో ఎలాంటి లాబీయింగ్ లేదనిపించిందని పేర్కొన్నారు. జ్యూరీ ఇచ్చిన లిస్టులో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా రేవత్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

March 10, 2026 / 09:42 AM IST

‘జైలర్ 2’ లో షారుఖ్ రోల్ ఇదే..!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ షారుఖ్ ఒక పోలీస్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది అలాగే నటుడు ఎస్ జే సూర్య కాంబినేషన్ సీన్స్ కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

March 10, 2026 / 08:54 AM IST

పోలీసులను ఆశ్రయించిన మెగా కోడలు

మెగా కోడలు, నటి లావణ్య త్రిపాఠి HYD సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. SM వేదికగా తన పరువుకు భంగం కలిగించేలా ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. ‘పర్పుల్ క్రెయాన్00’ ఇన్‌స్టా ఖాతా ద్వారా తనపై, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని పలు పోస్టులు, కామెంట్లలో అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని వెల్లడించింది. భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

March 10, 2026 / 08:30 AM IST

‘రౌడీ జనార్దన’ కోసం భారీ యాక్షన్ సెట్ ?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రవి కిరణ్‌ కోలా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడీ జనార్దన’. ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్‌లో కొన్ని యాక్షన్ సీన్స్‌ను కూడా తీస్తారని.. ఈ సీన్స్‌ను విజయ్‌పై షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ శోభన నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

March 10, 2026 / 07:50 AM IST

నిశ్చితార్ధంపై స్పందించిన బెల్లంకొండ

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తనకు కాబోయే భార్య కావ్యను పరిచయం చేశాడు. ‘నాపై నమ్మకం ఉంచి నా జీవితంలోకి వచ్చినందుకు, చిరునవ్వులు నింపినందుకు థాంక్స్‌. నీ మోముపై కూడా చిరునవ్వులను ఎప్పటికీ వాడిపోనీయను. మనం ఎప్పటికీ కలిసి ఉండే క్షణం కోసం వేచి చూస్తున్నా’ అని SMలో రాసుకొచ్చారు. అలాగే ఇటీవల జరిగింది చిన్న వేడుకని, నిశ్చితార్ధం తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపాడు.

March 10, 2026 / 07:30 AM IST

సల్మాన్ మూవీలో హీరోయిన్‌గా సమంత?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ సమంత బంపర్ ఆఫర్ దక్కించుకున్నారని టాక్ నడుస్తోంది. రాజ్ అండ్ DK ద్వయం ఈ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాతో పాటు రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌లో చేస్తున్న సమంతకు ఈ సినిమాలో అవకాశం వచ్చినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాలి.

March 10, 2026 / 07:28 AM IST