• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

వేసవిలో వేడి పానీయాలతోనే చల్లదనం!

వేసవిలో వేడి పానీయాలు తాగడం వల్ల శరీరం చల్లబడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వేడి పానీయాలు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి, మెదడు చెమట గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. దీంతో చెమట ఎక్కువగా పట్టి, అది ఆవిరయ్యే క్రమంలో శరీరంలోని వేడిని బయటకు పంపి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే, గాలిలో తేమ (Humidity) ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇది అంతగా పనిచేయదు.

April 2, 2026 / 12:19 PM IST

మొటిమలు రావడానికి అసలు కారణం ఇదే!

జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వల్ల శరీరంలో ఇన్సులిన్ పెరిగి మొటిమలు వస్తాయి. దీనివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి బ్యాక్టీరియా చేరుతుంది. అందుకే మైదా వస్తువులకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా చేపలు, వాల్‌నట్స్, ఆకుకూరలు, క్యారెట్లు వంటి పౌష్టికాహారం తీసుకోవాలి. ఇలా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

April 2, 2026 / 10:10 AM IST

కర్ణపీడాసనం వల్ల కలిగే ఉపయోగాలు

కర్ణపీడాసనం అనేది హలాసనం యొక్క పొడిగింపు. ఇది వెన్నెముకను సాగదీసి, ఒత్తిడిని తగ్గించి, వినికిడి శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. హలాసనం స్థితి నుంచి మోకాళ్లను వంచి, చెవుల పక్కన నేలపై ఉంచడం ద్వారా ఈ ఆసనం వేస్తారు. ఇది యోగాలో మెడ, భుజాలు, వెన్నుముక ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైనది. ఒత్తిడి, ఆందోళన తగ్గి, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

April 2, 2026 / 06:36 AM IST

కళ్లు తాజాగా ఉండాలంటే..

ప్రస్తుతం మారిన జీవన విధానంలో కళ్లు జీవం కోల్పోయినట్లు అవుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే రోజులో కనీసం నాలుగైదు సార్లైనా కళ్లను చన్నీటితో కడగాలని నిపుణులు చెబుుతన్నారు. కళ్లకు తరచూ విశ్రాంతినివ్వాలి. సరిపడా నిద్ర లేకపోయినా కంటి ఆరోగ్యం ప్రభావితమవుతుంది. నిద్రలేమి వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, గీతలు, ముడతలు ఏర్పడతాయి. నాణ్యమైన ఐ మేకప్ ఉత్పత్తులు వాడాలి.

April 1, 2026 / 09:45 PM IST

వాము నీళ్లతో బోలెడు లాభాలు

వాము నీళ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాము నీళ్లు తాగడం వల్ల శ్వాసకోశ వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడంలో ఈ నీళ్లు సహాయపడుతాయి. జీర్ణక్రియ మెరుగుపడి.. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పంటి నొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన మాయమవుతుంది.

April 1, 2026 / 09:06 PM IST

మొటిమల్ని తగ్గించే కలబంద ప్యాక్!

కలబంద చర్మానికి చలువ చేయడమే కాకుండా మొటిమల్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఒక స్పూన్ కలబంద గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే మొటిమల మచ్చలు తగ్గుతాయి. అలాగే కలబందలో చిటికెడు పసుపు కలిపి వాడితే బ్యాక్టీరియా నశించి చర్మం కాంతివంతంగా మారుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది సహజమైన ఔషధంలా పనిచేస్తుంది.

April 1, 2026 / 05:06 PM IST

వేసవిలో ఈ ఆహారం తీసుకుంటున్నారా?

వేసవిలో రోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు వంటివి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మజ్జిగ తీసుకుంటే శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. కందగడ్డ, చిలగడదుంప, చేమదుంప రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిమ్మరసం, సబ్జా నీళ్లు, గంజి, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు శరీరానికి చలవ చేస్తాయి.

April 1, 2026 / 04:42 PM IST

ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయడం తప్పనిసరి!

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం లేదా నడక తప్పనిసరి. తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. రాత్రిపూట 7-8 గంటల గాఢ నిద్ర అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు.

April 1, 2026 / 09:53 AM IST

షుగర్ ఉన్నవారు పైనాపిల్ తినకూడదా?

పైనాపిల్ పోషకాల నిధి. విటమిన్-C, యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఈ పండును తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ, గుండె ఆరోగ్యం మెరుగవుతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అయితే షుగర్ ఉన్నవారికి ఇది ప్రయోజనం కలిగించకపోగా హానీ చేస్తుందట. ఇందుకు పైనాపిల్‌లో సహజ చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటమే కారణంగా నిపుణులు చెబుతున్నారు.

April 1, 2026 / 08:48 AM IST

విదుర నీతి: ఈ 4 కారణాలు ఉన్నవారికి నిద్ర పట్టదు

యుద్ధం మీద ధ్యాసతో నిద్రలేమితో బాధపడుతున్న ధృతరాష్ట్రుడికి విదురుడు ఇలా చెప్పాడు. ‘1. బలవంతుడితో శత్రుత్వం పెట్టుకున్నవాడు, సర్వస్వం కోల్పోయి ఆపదలో ఉన్నవాడు, ఇతరుల ఆస్తిని దొంగిలించాలనే బుద్ధి ఉన్నవాడు, మనసులో తీవ్ర కోరికలతో రగిలిపోయేవాడు.. ఈ నాలుగు పరిస్థితుల్లో ఉన్నవారికి మనశ్శాంతి ఉండదు, ఎప్పటికీ ప్రశాంతమైన నిద్ర కరువవుతుంది’ అని విదుర నీతి సారాంశం.

April 1, 2026 / 08:00 AM IST

ఖాళీ  కడుపుతో ఖర్జూరం తింటే..!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని పోషకాల కారణంగా తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడతాయి. ముఖ్యంగా మహిళలకు రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి అంతా నీటిలో నానబెట్టి లేదా పాలతో కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.

April 1, 2026 / 06:25 AM IST

గంజి తాగితే బోలెడు ప్రయోజనాలు

వడదెబ్బ నుంచి రక్షణనిచ్చే అమృతం గంజి. అన్నం ఉడికిన తర్వాత వార్చిన ఈ నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులోని ఎలక్ట్రోలైట్స్ డీహైడ్రేషన్ బారినుంచి కాపాడతాయి. వేసవిలో పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అంతేకాదు ఇది అలసటను పోగొట్టి శరీరాన్ని చల్లబరుస్తుంది.

March 31, 2026 / 03:51 PM IST

మీది పొడిచర్మమా? అయితే ఇలా చేయండి

శరీరంలో తగినంత జిడ్డు ఉత్పత్తి కానప్పుడు చర్మం నిర్జీవంగా మారి ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. దీనినే ‘డ్రై స్కిన్’ అంటారు. ఈ సమస్య పోవాలంటే సున్నితమైన క్లెన్సర్, తేమను నిలిపి ఉంచే మాయిశ్చరైజర్లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల మీ చర్మం తాజాగా, తేమగా ఉంటుంది.

March 31, 2026 / 02:20 PM IST

ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్ కర్రీ తింటున్నారా?

చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వండిన తర్వాత ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచితే లేదా ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసినా, బ్యాక్టీరియా పెరుగుతుంది. సాల్మొనెల్లా, ఇ కోలై.. బ్యాక్టీరియా చికెన్‌లో త్వరగా వ్యాపిస్తాయి. శరీరంలోకి చేరినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కలిగిస్తాయి. ఫ్రిజ్‌లో బ్యాక్టీరియా పూర్తిగా చనిపోదు.. ఇవే ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి.

March 31, 2026 / 01:30 PM IST

బెల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు

బెల్లం నీటిని రోజూ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది.

March 31, 2026 / 11:25 AM IST