కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గాలంటే సరైన జీవనశైలి ముఖ్యం. రోజూ 7-8 గంటల గాఢ నిద్ర అవసరం. ఎక్కువగా నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. కీరదోస ముక్కలు లేదా చల్లని టీ బ్యాగులను కళ్లపై ఉంచితే రక్త ప్రసరణ మెరుగుపడి నలుపు తగ్గుతుంది. పోషకాహారం తీసుకుంటూ, ఫోన్ స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. బాదం నూనెతో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మరసం, మజ్జిగ, బత్తాయి పండ్లు, పుచ్చపండ్లు లాంటి నీరు ఎక్కువగా పండ్లను, పానీయాలను తీసుకుంటే శరీరం చల్లగా ఉండి, ఒంట్లో చక్కెర స్థాయిలు హెచ్చతగ్గులకు లోనుకాకుండా అదుపులో ఉంటాయి. దోసకాయ ముక్కలను సలాడ్‌గా తీసుకుంటే శరీరం చల్లబడుతుంది. ఇలా డయాబెటిక్ బాధితులు వేసవిలో ప్రతీ రోజూ తమ డైట్ ప్లాన్ చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
ఒక వ్యక్తి తాను చేయబోయే పనిని, ఆలోచనలను, ప్రణాళికలను ఆ పని పూర్తయ్యే వరకు ఎవరికీ తెలియనివ్వకూడదని విదురుడు బోధించారు. ‘ఎవరైతే తమ లక్ష్యాలను, వ్యూహాలను రహస్యంగా ఉంచి.. ఆచరణలో మాత్రమే ఫలితాలను చూపిస్తారో వారే నిజమైన పండితులు. పని మొదలుపెట్టకముందే ప్రగల్భాలు పలికేవాడు ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేడు’ అని విదురునీతి చెబుతోంది.
ఏసీ టెంపరేచర్ తగ్గించడం అంటే వేడి పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు. మీరు నంబర్‌ను పెంచితే (ఉదాహరణకు 18°C నుంచి 26°C కి) గదిలో చల్లదనం తగ్గి, వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. దీనివల్ల వేడి రాదు కానీ, చల్లదనం తగ్గుతుంది. మీ ఏసీలో ‘Heat’ మోడ్‌లో ఉంటే తప్ప, అది వేడి గాలిని బయటకు వదలదు.
ఏసీ టెంపరేచర్ నంబర్‌ను పెంచితే వేడి పెరుగుతుందని పొరబడతారు. నిజానికి, మీరు ఏసీలో నంబర్‌ను పెంచినప్పుడు (ఉదాహరణకు 18°C నుండి 26°C కి) ఏసీ కంప్రెసర్ పనితీరు తగ్గి గదిలో చల్లదనం తగ్గుతుంది. దీనివల్ల వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంటుంది తప్ప, ఏసీ నుంచి వేడి రాదు. మీ ఏసీలో ప్రత్యేకంగా ‘Heat Mode’ ఉంటే తప్ప, అది వేడిని విడుదల చేయదు.
సంతోషం, సందర్భం లేకపోయినా కంట్రోల్ చేసుకోలేనంతగా నవ్వడం ‘లాఫింగ్ ఎపిలెప్సీ’ అనే అరుదైన వ్యాధి లక్షణం. మెదడులోని హైపోథాలమస్ భాగంలో చిన్న గడ్డ ఏర్పడటం వల్ల ఇలా నియంత్రణ కోల్పోయి నవ్వుతూ ఫిట్స్ బారిన పడతారు. తాజాగా ఎయిమ్స్ వైద్యులు ‘మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ’ ద్వారా ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం కనుగొన్నారు.
కొబ్బరి, బెల్లం కలిపి తయారు చేసే ఉండలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, బెల్లంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక కొబ్బరి ఉండను తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలకు, ఎదిగే పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది.
ప్రస్తుతం ఒంటరిగా ఉండటం ఒక ట్రెండ్‌గా మారింది. వరల్డ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం స్వీడన్ (51%), డెన్మార్క్ (50%) తదితర దేశాల్లో దాదాపు సగం మంది పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఫిన్లాండ్, జర్మనీల్లో కూడా ఇదే పరిస్థితి. వ్యక్తిగత స్వేచ్ఛ కోసం మన దేశంలోనూ 25% మంది ఒంటరి జీవితానికే మొగ్గు చూపుతున్నారు. ‘బాధ్యతల కంటే సొంతంగా బతకడమే మిన్న’ అని యువత భావిస్తుండటమే ఇందుకు కారణం.
ఉదయాన్నే వేడివేడిగా టీ తాగడం చాలామందికి ఇష్టం. అయితే పరగడుపునే తాగడం వల్ల కొందరిలో ఎసిడిటీకి దారితీస్తుంది. దీంతో ప్రత్యామ్నాయంగా టీలో అల్లం, యాలకులు, సోంపు చేర్చుకోండి. ఇవి జీర్ణక్రియకు తోడ్పడతాయి. టీ పొడిని ఎక్కువగా మరిగించడంతో టానిన్లు పెరిగి ఎసిడిటీ వస్తుంది, కాబట్టి తక్కువ సేపు మరగబెట్టాలి. టీ తాగడానికి 5 నిమిషాల ముందు గ్లాసు నీళ్లు తాగితే ఎసిడిటీ ప్రభావం తగ్గుతుంది.
యుద్ధంలో బాణాలతో అయిన గాయాలనైనా వైద్యంతో నయం చేయవచ్చు. కాలిపోయిన అడవి వర్షానికి మళ్లీ చిగురిస్తుంది. కానీ, ఒకరి మనసును గాయపరుస్తూ అనే ‘కఠినమైన మాటలు'(వాక్శరాలు) చేసే గాయానికి మందు లేదు. ఆ గాయం జీవితాంతం మానదని విదురుడు బోధించాడు. అందుకే మాట్లాడేటప్పుడు ఎదుటివారి మనసు నొప్పించకుండా జాగ్రత్తగా, మృదువుగా మాట్లాడాలని, నోరు జారకూడదని విదుర నీతి సారాంశం.
గర్భ పిండాసనం అనేది పద్మాసనంలో ఉండి, చేతులను కాళ్ల మధ్య నుంచి దూర్చి సమతుల్యతను సాధించే యోగా భంగిమ. ఇది ఉదర అవయవాలను మసాజ్ చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెన్నుముకను రిలాక్స్ చేస్తుంది. నడుము కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, చేతులు, తొడలు, కోర్ కండరాలను బలోపేతం చేస్తుంది. నాడీ వ్యవస్థను నియంత్రించి, కోపాన్ని తగ్గించడంలో, మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
రాత్రిపూట పనిచేసే వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నైట్ షిఫ్టుల వల్ల శరీర జీవ గడియారం దెబ్బతిని మహిళల్లో రొమ్ము, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పోలీసులు, టెకీలు, డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటూ.. సరైన నిద్ర, పోషకాహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రాత్రిపూట పని చేసేవారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.