• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఓర్వకల్లులో ఖాద్రి ఉరుసు వేడుకలు

KRNL: ఓర్వకల్లు(మం)కాల్వ గ్రామంలో సయ్యద్ మహమ్మద్ షా ఖాద్రి ఉరుసు మహోత్సవాన్ని ఘనంగా ఇవాళ నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా గ్రామస్థులు వృషభ రాజుల పోటీలను ఏర్పాటు చేయగా పలు గ్రామాల నుంచి వచ్చిన వృషభాలు పోటీలో పాల్గొన్నాయి. కార్యక్రమానికి టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

March 5, 2026 / 03:12 PM IST

‘జనసేన బలోపేతానికి కట్టుబడి పని చేయాలి’

W.G. ఉమ్మడి ప.గో.జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన బుధవారం పాలకొల్లు లయన్స్ క్లబ్‌లో పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యాచరణపై సమావేశం నిర్వహించబడింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేయాలన్నారు.

March 5, 2026 / 03:11 PM IST

మార్చి 9న కడప కలెక్టరేట్ ధర్నా..!

KDP: రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల హామీలలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, నిరుద్యోగ యువతకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదని డీవైఎఫ్ఎ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు ఎమ్.చిన్ని, వి.శివకుమార్ అన్నారు. అనంతరం మాట్లాడుతూ.. హామీ అమలు కోసం మార్చి 9న రాష్ట్ర పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.

March 5, 2026 / 03:11 PM IST

జిల్లాలో అత్యధికంగా 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ATP: అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం జిల్లాలో 37.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

March 5, 2026 / 03:05 PM IST

‘వారసత్వ సంపదను కాపాడుకుందాం’

ATP: అనంతపురం నగరంలో గురువారం రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశాల మేరకు చారిత్రక కట్టడాల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి పీస్ మెమోరియల్ హాల్ వరకు సాగిన ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ సహాయ సంచాలకులు స్వామినాయక్ పాల్గొని ప్రసంగించారు.

March 5, 2026 / 03:03 PM IST

49వ జాతీయ గుడారాల పండుగకు ఏర్పాట్లు పూర్తి

GNTR: అమరావతిలో 49వ జాతీయ గుడారాల పండుగ వేడుకలు గురువారం సాయంకాలం నుంచి ప్రారంభమవుతాయని పాస్టర్ అనిల్ కుమార్ తెలిపారు. భక్తుల అవసరార్థం తాటాకు పందిళ్లు, టెంటులు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు ప్రత్యేక రైలు నడుపుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ ఉచితంగా రాత్రి 11 గంటల వరకు బస్సు సౌకర్యం కల్పించారన్నారు.

March 5, 2026 / 03:01 PM IST

గడ్డి తొలగింపు చర్యలు చేపట్టిన ఇంఛార్జ్

కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీలో అనవసరంగా పెరిగిన గడ్డి కారణంగా కాలనీవాసులు దోమల బారిన పడుతున్న సమస్య తలెత్తింది. ఈ సమస్యను గుర్తించిన టిడ్కో కాలనీ జనసేన ఇంఛార్జ్ వెంకటేష్ వెంటనే స్పందించారు. పారిశుద్ధ్య సిబ్బందికి తెలియజేసి కాలనీలో పెరిగిన గడ్డిని తొలగించే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. దీంతో కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది.

March 5, 2026 / 02:59 PM IST

బహిరంగ వేలం.. రూ.25,53,700 ఆదాయం

CTR: పుంగునూరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం కమిషనర్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో బహిరంగ వేలంపాట జరిగింది. వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, ప్రైవేట్ బస్సు స్టాండ్ వద్ద గల పబ్లిక్ యూరినల్స్, షాపు రూమ్‌లు, ఖాళీ స్థలాలకు బహిరంగ వేలంపాట నిర్వహించగా రూ.25,53,700 ఆదాయం వచ్చినట్లు కమిషనర్ తెలిపారు.

March 5, 2026 / 02:55 PM IST

జూన్ నాటికి నందివెలుగు బ్రిడ్జి పూర్తి: ఎంపీ పెమ్మసాని

GNTR: నందివెలుగు బ్రిడ్జి పనులను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.గురువారం గుంటూరు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, శంకర్ విలాస్ ఆర్వోబీకి సంబంధించి రైల్వే అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే మంగళగిరి, నంబూరు, బండారుపల్లి బ్రిడ్జిల నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తాపన్నారు.

March 5, 2026 / 02:47 PM IST

‘పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్ధి చేస్తాం’

అన్నమయ్య: ప్రతి గ్రామాన్ని, పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. పుల్లంపేటలో సీసీ రోడ్డుకు గురువారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు వేగంగా జరగడం ఆనందంగా ఉందని అన్నారు.

March 5, 2026 / 02:42 PM IST

దామచర్ల సత్యను గజమాలతో సత్కరించిన నేతలు

ప్రకాశం: రాష్ట్ర మారీటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య జన్మదిన శుభ సందర్భంగా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు అడ్డరోడ్డు వద్ద స్థానికులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేయించారు. మండల పార్టీ అధ్యక్షుడు పోకూరి రవి, కామేపల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోటు మురళి ఆధ్వర్యంలో సింగరాయకొండ వెళ్తున్న సత్యను గజమాలతో సత్కరించారు.

March 5, 2026 / 02:41 PM IST

పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్

KRNL: 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాలో జరగబోయే పదో తరగతి పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలలో అన్ని వసతులను ఒకరోజు ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు.

March 5, 2026 / 02:40 PM IST

‘ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి’

నెల్లూరు: ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన రైతు సాధికార సంస్థ క్యాడర్ సభ్యుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విత్తనాలు విత్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో DPM కన్నయ్య పాల్గొన్నారు.

March 5, 2026 / 02:40 PM IST

ఘనంగా శ్రీవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

W.G. పెంటపాడు మండలం మీనావల్లూరు గ్రామంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నియోజకవర్గం ఇంఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు పాల్గొన్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

March 5, 2026 / 02:40 PM IST

‘మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

PLD: మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మాచవరం సచివాలయంలో గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు పలు రకాల వ్యాధుల గురించి ఆ గ్రామాల వైద్య సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమం మహిళల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించామని ఎంపీడీవో విష్ణు చిరంజీవి అన్నారు.

March 5, 2026 / 02:38 PM IST