»Simple One Electric Scooters Production Starts Ahead Of May 23 Launch Gets 236 Km Range
Simple One Electric Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కిలో మీటర్లు..అదిరిపోయే ఫీచర్లు!
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ సింపుల్ వన్(Simple One Electric Scooter) మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 23న అధికారికంగా కస్టమర్లకు అందించనున్నారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కిలోమీటర్లు తిరుగుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక రోడ్లపైకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.
ఈరోజుల్లో అందరూ ఎలక్ట్రిక్ వాహనాలపై మోజు పెంచుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలు ఉన్నా, వాటితో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ జాబితాలో కార్లు మాత్రమే కాదు, స్కూటర్లు కూడా వచ్చి చేరుతున్నాయి. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు అందూ ఇప్పుడు ఈవీ వాహనాలను కొనాలను చూస్తున్నారు. మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారా? అయితే.. అలాంటి వారి కోసం మార్కెట్లోకి కొత్త రకం స్కూటర్ అడుగుపెట్టింది. సింపుల్ వన్(Simple One Electric Scooter) పేరిట విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ, మరియు స్టార్టప్ క్లీన్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ “సింపుల్ వన్” ను లాంచ్ చేసింది. తమిళనాడులోని శూలగిరి ఫ్యాక్టరీ నుంచి తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించింది. అయితే మే 23న పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. అయితే ఈ వాహనం ప్రస్తుతం ఉన్న వాహనాల కంటే అధిక రేంజ్ కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సింపుల్ ఎనర్జీ వెల్లడించింది. అత్యధిక రేంజ్, వేగంతోపాటు సురక్షితమైన, అత్యధిక భద్రతా ప్రమాణాలున్న బ్యాటరీ ప్యాక్‌ను అమర్చినట్లు ప్రకటించింది. దీంతోపాటు ఈ స్కూటర్కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వినియోగదారుల కోసం డిలివరీలను వేగవంతం చేస్తామని తెలిపింది.
అధికారికంగా దీనిని మే 23న లాంచ్ చేయనున్నారు. కాగా, దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే, 236 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. రెండు సంవత్సరాలుగా ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) 3 ప్రకారం బ్యాటరీ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తుంది. లాంచ్ చేసిన నెలలో స్డాండర్డ్ EV ధర రూ.1.10 లక్షలు, అధిక రేంజ్ ఈవీ ధర రూ. 1.45 లక్షలుగా ఉండనుంది. తర్వాత నెల నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.