»Heavy Fine Will Be Imposed On The Platform Even After Taking The Ticket Know This Rule Of Railway
Indian Railways Rule: తస్మాత్ జాగ్రత్త.. టికెట్ తీసుకున్నా ప్లాట్‌ఫారమ్‌పై భారీ జరిమానా!
భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. ఇది సురక్షితమైన, చౌకైన ప్రయాణ మార్గంగా పరిగణించబడుతుంది. కానీ, రైలులో ప్రయాణించే విషయంలో చాలా రకాల నియమాలు ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్‌పై రైలు కోసం వేచి ఉండే సమయంలో రైల్వే నియమాలు పాటించాలి లేకుంటే భారీ జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.
Indian Railways Rule: భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. ఇది సురక్షితమైన, చౌకైన ప్రయాణ మార్గంగా పరిగణించబడుతుంది. కానీ, రైలులో ప్రయాణించే విషయంలో చాలా రకాల నియమాలు ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్‌పై రైలు కోసం వేచి ఉండే సమయంలో రైల్వే నియమాలు పాటించాలి లేకుంటే భారీ జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. రైలులో ప్రయాణించడానికి ప్రజలు తరచుగా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. కానీ టికెట్ తీసుకున్న తర్వాత కూడా ప్లాట్‌ఫారమ్‌పై వేచి ఉండటానికి సమయం పరిమితి ఉంది. దానిని అనుసరించకపోతే భారీ జరిమానా చెల్లించాలి.
ప్లాట్‌ఫారమ్‌పై వేచి ఉండటానికి సంబంధించిన నియమాలు
రైలు టికెట్ తీసుకున్న తర్వాత రైల్వే స్టేషన్‌కు చేరుకుంటే అక్కడ ఉండేందుకు ప్రత్యేక నిబంధనలున్నాయి. రైలు పగటి పూట ఉంటే రైలు సమయానికి 2 గంటల ముందు స్టేషన్‌కు చేరుకోవచ్చు. రైలు రాత్రి అయితే, రైలు సమయానికి 6 గంటల ముందు స్టేషన్‌కు చేరుకోవచ్చు. దీని కోసం మీకు జరిమానా విధించబడదు. అదే సమయంలో, రైలు దిగిన తర్వాత కూడా ఇదే నియమం వర్తిస్తుంది. పగటి పూట 2 గంటలు, రాత్రికి 6 గంటలు ఉండవచ్చు. అయితే, ప్రయాణ టికెట్ మీ వద్దే ఉంచుకుని టీటీఈని అడిగితే చూపించాలి.
ఎక్కువసేపు ఉండాల్సి వస్తే..
నిర్ణీత సమయానికి మించి రైల్వే స్టేషన్లో బస చేస్తే ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పగటిపూట రైలు సమయం నుండి 2 గంటలకు పైగా, రాత్రి రైలు సమయం నుండి 6 గంటలకు మించి స్టేషన్లో ఉంటే.. మీరు ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోవాలి. టికెట్ కొనకుంటే TTEకి మీ నుంచి జరిమానా వసూలు చేసే అధికారం ఉంటుంది. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ చెల్లుబాటు కూడా 2 గంటలు మాత్రమే, అంతకంటే ఎక్కువ ఉంటే జరిమానా పడుతుంది.