»Fir Against Ex Bharatpe Md Ashneer Grover And His Family In Rs 81 Crore Fraud Case
Rs.81 crore fraud case:లో భారత్‌పే మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్, అతని ఫ్యామిలీపై ఎఫ్ఐఆర్
ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) భారత్‌పే మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్(Ashneer Grover)పై 81 కోట్ల రూపాయల మోసానికి సంబంధించి ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసింది. భారత్‌పే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్, ముగ్గురు బంధువులు కూడా ఉన్నారు.
భారత్‌పే మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్(Ashneer Grover), ఆయన భార్య మాధురీ జైన్ గ్రోవర్, దీపక్ గుప్తా, సురేశ్ జైన్, శ్వేతాంక్ జైన్‌లతో సహా కుటుంబ సభ్యులపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ క్రమంలో రూ.81 కోట్ల మోసం జరిగిందని ఆరోపించారు. భారత్‌పే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్(FIR) ఫైల్ చేశారు.
అయితే పోలీసు(police) వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. నకిలీ ఇన్వాయిస్లు తయారు చేసి తమ పరిచయస్తులు, బంధువుల ఖాతాలకు కంపెనీ ఖాతా నుంచి రూ.81 కోట్లను బదిలీ చేసినట్లు ఆ జంటపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇద్దరినీ పోలీసులు త్వరలో విచారించనున్నారు.
మిస్టర్ గ్రోవర్, అతని భార్య మాధురీ జైన్, ఇతర కుటుంబ సభ్యులు చేసిన క్రిమినల్ నేరాలకు సంబంధించి కంపెనీ చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత 15 నెలలుగా కంపెనీ బోర్డు, ఉద్యోగులకు వ్యతిరేకంగా గ్రోవర్ నిర్వహిస్తున్న అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని BharatPe తెలిపింది.
ఎఫ్ఐఆర్ నమోదు సరైన దిశలో ఒక అడుగు, ఇది వారి వ్యక్తిగత లాభాల కోసం చేసిన వివిధ అనుమానాస్పద లావాదేవీలను వెలికితీసిందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఎఫ్ఐఆర్ అమలు చేసే ఏజెన్సీలు నేరారోపణపై లోతుగా దర్యాప్తు చేయడానికి వీలు కల్పిస్తుందని సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతోపాటు అధికారులకు అన్ని విధాలా సహకారం అందిస్తూనే ఉంటామని భారత్‌పే(BharatPe) వెల్లడించింది.