»Another Bomb Blast Near The Amritsar Golden Temple For The Third Time In A Week
Golden Temple: దగ్గర మళ్లీ బాంబ్ బ్లాస్ట్..వారంలో మూడోసారి
పంజాబ్ అమృత్సర్(amritsar)లోని స్వర్ణ దేవాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున మళ్లీ బాంబు పేలుడు(bomb blast) శబ్దం వినిపించింది. దాదాపు అర్ధరాత్రి 12.30 గంటలకు ఈ పేలుడు జరగగా, ఈ ఘటన కారణంగా ఐదుగురిని అరెస్టు చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
గురువారం తెల్లవారుజామున పంజాబ్ అమృత్సర్(amritsar)లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో మళ్లీ బాంబు పేలుళ్లు(bomb blast)సంభవించాయి. సుమారు అర్ధరాత్రి 12.30 గంటలకు ఈ పేలుడు సంభవించింది. వారం వ్యవధిలో ఈ పరిసరాల్లో జరిగిన మూడో పేలుడు ఇది కావడం కలకలం రేపుతోంది. మరోవైపు ఈ బ్లాస్ట్ కారణంగా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. అరెస్టయిన నిందితులు బ్లాస్ట్ కోసం ప్లాన్ వేసినట్లు పంజాబ్ పోలీసు వర్గాలు అంటున్నాయి. అయితే తాజాగా జరిగిన పేలుడు కారణంగా ఎవరికీ ఏమి కాలేదని అధికారులు తెలిపారు.
#WATCH | Amritsar: Visuals from outside the building of Shri Guru Ramdas Ji Niwas from where suspects were rounded up in the aftermath of a loud sound, that was heard near the Golden Temple, which, as per the police, could be another explosion.#Punjabpic.twitter.com/CXzms3FdYw
అంతకుముందు మే 6, మే 8 తేదీలలో వరుసగా గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో పేలుళ్లు సంభవించాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రెండవ పేలుడు తరువాత అక్కడి డీజీపీ గౌరవ్ యాదవ్ పిటిఐతో మాట్లాడారు. రెండు పేలుళ్లపై దర్యాప్తు చేయడానికి అన్ని ఏజెన్సీల సహాయం తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. దీంతోపాటు తాజాగా జరిగిన పేలుళ్లపై కూడా విచారణ చేస్తున్నామని, అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు(police) పేర్కొన్నారు.
రెండో పేలుడు జరిగిన ప్రదేశాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందం కూడా సందర్శించి పరిశీలించింది. మొదటి పేలుడులో ఒక వ్యక్తి గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని కొన్ని భవనాల దెబ్బతిన్నాయి. మే 8 ఉదయం అదే వీధిలో తక్కువ తీవ్రత కలిగిన రెండవ పేలుడు కారణంగా మరొక వ్యక్తి గాయమైంది. అయితే పంజాబ్ పోలీసులు ఈ పేలుడు పట్ల ఎలాంటి పరికరం లేదా డిటోనేటర్‌ను ఆ ప్రాంతం నుంచి వెంటనే కనుగొనలేకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ప్రజలు బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నారు. మళ్లీ బ్లాస్ట్ జరుగుతుందేమోననే అనుమానంతో భయాందోళన చెందుతున్నారు.