Xi Jinping: మూడోసారి చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ బాధ్యతలు
చైనా(china) అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్(Xi Jinping) మూడోసారి అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. దీంతో 1949 నుంచి కమ్యూనిస్ట్ చైనా దేశానికి ఎక్కువ కాలం పనిచేసిన దేశాధినేతగా జిన్ పింగ్ చరిత్రను తిరగరాశారు.
చైనా అధ్యక్షుడిగా(Chinese President )జీ జిన్‌పింగ్(Xi Jinping) మూడోసారి(third time) అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. దీంతో 1949 నుంచి కమ్యూనిస్ట్ చైనా దేశానికి ఎక్కువ కాలం పనిచేసిన దేశాధినేతగా జిన్ పింగ్ చరిత్రను తిరగరాశారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో జరిగిన ఓటింగ్‌లో భాగంగా శుక్రవారం జిన్ పింగ్ మరో ఐదేళ్లపాటు అధ్యక్షుడిగా తిరిగి నియమితులయ్యారు. ఇది చైనాలో రాజకీయ ప్రముఖుల చట్టబద్ధత, ఐక్యతను ప్రదర్శించడానికి ఉద్దేశించిన నిర్ణయాల్లో కీలక అంశమని చెప్పవచ్చు. మొత్తం 3 వేల మందిలో 2,952 మంది ఓట్లు జీకి రావడం విశేషం.
అయితే అక్టోబరులో చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP) మిలిటరీకి అధిపతిగా మరో ఐదేళ్ల బాధ్యతలు అప్పగించిన తర్వాత చైనా పార్లమెంట్ ద్వారా నియామకం జరిగింది. అప్పటి నుంచి 69 ఏళ్ల Xi తన జీరో-కోవిడ్ విధానంపై సామూహిక నిరసనలతో సహా పలు సవాళ్లను ఎదుర్కొన్నాడు. దీంతోపాటు కరోనా కారణంగా లెక్కలేనన్ని మంది చనిపోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా బీజింగ్(beijing) సైన్స్ మంత్రిత్వ శాఖ, చట్ట సభ సభ్యులు సాంకేతిక సామర్థ్యాల పునురుద్ధరణపై దృష్టి పెట్టినట్లు చైనా ప్రకటించింది. మరోవైపు దాదాపు ఐదు శాతం వృద్ధి లక్ష్యంతోపాటు రక్షణ వ్యయాన్ని స్వల్పంగా పెంచుతున్నట్లు వెల్లడించింది.