Beijing: ప్రస్తుతం చలితీవ్రత అధికంగా ఉంది. ఉత్తర ప్రాంతాల్లో అయితే చెప్పనక్కర్లేదు. పర్వతాలు హిమపాతంతో నిండిపోయాయి. చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. చైనాలో హిమపాతం ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత -40 డిగ్రీలకు పడిపోయింది. చైనా రాజధాని బీజింగ్ నగరంలో ప్రస్తుతం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. 9 రోజుల నుంచి మంచు తుపాను కొనసాగుతోంది.
1951 నుంచి ఇప్పటి వరకు బీజింగ్‌లో నమోదైన పొడవైన చలిగాలి ఇదే. 300 గంటలు పాటు నిరంతరంగా మంచు కురుస్తూ.. చలిగాలులు వీస్తూనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో హిమపాతం కురవడం వల్ల పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఆసుపత్రులు, అత్యవసర సేవలు కాకుండా అన్ని పనులు మూసివేశారు. మంచు తుపాను కారణంగా రెండు మెట్రోలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. భారతదేశంలోనూ ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, సిక్కిం రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది.