Paytm: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం ఉద్యోగులను తొలగించింది. దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తుంది. ఇంకా మరికొందరిని కూడా తొలగించడానికి చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్‌లో ఉద్యోగులను తొలగించిదట. ఈ ఏడాది స్టరప్ కంపెనీలు మొదటి మూడు నెలల్లో ఏకంగా 28 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. గతేడాది ఈ సంఖ్య 20 వేలు ఉండగా.. 2021లో 4 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.
ఫిన్ టెక్ రంగంలో ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపులో పేటీఎం టాప్‌లో ఉంది. సంస్థ వర్క్ ఫోర్స్‌లో దాదాపుగా 10 శాతం ఉద్యోగులు కోల్పోయారు. ఈ ఉద్యోగుల తొలగింపు ప్రభావం స్టాక్ మార్కెట్ పైనా పడింది. పేటీఎం షేర్ల వాల్యూ దాదాపు 28 శాతం పడిపోయినట్లు సమాచారం. గడిచిన ఆరు నెలల్లో పేటీఎం షేర్ ధర 23 శాతానికి పైగా తగ్గింది. సిబ్బంది ఖర్చులను 15 శాతం మేర తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.