»Rebel Star Prabhas This Is The Reason For Saying Ok To Salaar
Rebel star Prabhas: సలార్‌కు ఓకే చెప్పడానికి కారణం ఇదే!
డైరక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ పార్ట్-1 సీజ్ఫైర్ డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈక్రమంలో తాజాగా ఓ ఇంటర్వూలో ప్రభాస్ ఆసక్తికర విషయాలు తెలిపాడు.
Rebel star Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సలార్. ప్రపంచవ్యాప్తంగా సలార్ పార్ట్-1 సీజ్ఫైర్ డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల జాబితాలో ఈ సినిమా చేరింది. తాజాగా ప్రభాస్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.
సలార్ కథ వినగానో నచ్చిందని.. తన కెరీర్లో చేసిన భిన్నమైన పాత్రల్లో ఇది ఒకటని అన్నారు. బహుబలి సినిమా నా కెరీర్‌కు ఒక బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసిందని తెలిపారు. ఆ తర్వాత ఎంచుకున్న సినిమాలన్నింటిలో కొత్తదనం ఉండేలా చూసుకున్నా. అందులో భాగంగా సలార్‌కు ఒకే చెప్పానని అన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ఎక్కువగా వైవిధ్యమైన కంటెంట్‌ను ఇష్టపడుతున్నారు. రాజమౌళి, ప్రశాంత్‌నీల్ వంటి దర్శకులతో పనిచేయడం అద్భుతమైన అనుభూతి అని తెలిపారు. సినిమా చివరల్లో సలార్ పార్ట్-2 ఉంటుందని తెలిపారు. అయితే మొదటి పార్ట్‌తో పోలిస్తే రెండో పార్ట్ చాలా బాగుంటుందని ప్రభాస్ తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ, సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్‌లో నటిస్తున్నారు.