భారతదేశ రాజధానిసెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీ(Delhi)లో G-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనున్న విషయం తెలిసిందే. భారత్, చైనా మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మీటింగ్‌కి దూరంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్(Jin Ping) నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వార్తలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. జిన్ పింగ్ హాజరు కావడంలేదన్న వార్త తనను నిరాశకు గురిచేసిందని బైడెన్ (Jo Biden)అన్నారు. అయితే, త్వరలోనే జిన్ పింగ్ ను కలుస్తానని ఆయన పెర్కోన్నారు. ఎక్కడ, ఎప్పుడు కలుస్తారనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. డెలావేర్(Delaware)లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) కూడా హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ (Kremlin) ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇటీవలే వెల్లడించారు. అయితే పుతిన్ ఈ సమ్మిట్‌లో వర్చువల్(Virtual)గా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చివరిసారిగా ఈ ఇద్దరు నేతలు బాలిలో నిర్వహించిన జీ20 సదస్సులో కలుసుకున్నారు. ఆ తర్వాత చైనా నిఘా బెలూన్ ఒకటి అమెరికా (America) గగనతలంపై ఎగరడం, యుద్ధ విమానాలను పంపించి అమెరికా దానిని కూల్చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ ఘటన తర్వాత ఇప్పటి వరకు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు కలుసుకోలేదు. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాల్లో ఈ ఇద్దరు నేతలు కలుసుకుంటారని అంతా భావించారు. అయితే, జిన్ పింగ్ హాజరుపై సందేహాలు రేకెత్తడంతో బైడెన్ స్పందిస్తూ జిన్ పింగ్ ను త్వరలోనే కలుస్తానని పేర్కొన్నారు.