ఒక్క పిడుగు (Thunder) పడితేనే దాని ధాటికి హడలిపోతాం. అటువంటిది కేవలం అరగంటలో పదుల సంఖ్యలో కాదు వందలు కూడా కాదు వేల సంఖ్యలో పిడుగులు పడ్డాయి. అది పిడుగులు పడటం కాదు పిడుగుల వర్షం (Rain) అనేలా అరగంట వ్యవధిలో ఏకంగా దాటిగా వేలల పిడుగులు పడ్డాయి. ఒడిశా(Odisha)లో అసాధారణ రీతిలో పిడుగుపాలు ఘటనలు వెలుగు చూశాయి.కేవలం రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 61 వేల పిడుగులు పడ్డాయి.ఈ ఘటనల్లో 12 మంది చెందగా 14 మంది గాయాలపాలయ్యారు.సెప్టెంబర్ 7 తరువాత వాతావరణం రాష్ట్రంలో సాధారణ స్థితికి వస్తుందని భారత వాతావరణ శాఖ (Weather Dept) ప్రకటించినప్పటికీ ఆ తరువాత కూడా పిడుగుపాట్లు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రతా సాహు తెలిపారు.
ఇక బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం (Surface area) రాబోయే రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. కాగా, పిగుడుపాటుకు మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని సాహూ తెలిపారు. వాతావరణ ఒడిదుడుకులతో ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపుల(Lightning)తో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో భద్రక్ జిల్లా బాసుదేవపూర్లో ఏకంగా వేల సంఖ్యలో పిడుగులు పడి ప్రజల్ని హడలెత్తించాయి. వాతావరణం (Weather) లో చోటుచేసుకున్న మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. అదే సమయంలో బలమైన గాలులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలున్నాయని ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని సూచించారు.