»Another It Company In Hyderabad Cheating Case Madhapur Police
Hyderabad:లో చేతులెత్తేసిన మరో ఐటీ కంపెనీ
హైదరాబాద్లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ(software company) చేతులెత్తిసింది. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పలువురి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్న సంస్థ ఉద్యోగాలు ఇవ్వకుండానే అనేక మందిని చీట్ చేసింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
another it company in hyderabad cheating case madhapur police
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో(hyderabad) మరో సాఫ్ట్ వేర్ సంస్థ(software company) అనేక మంది నిరుద్యోగులను మోసం చేసింది. ట్రైనింగ్ ఇచ్చి 100 పర్సెంట్ ఉద్యోగాలిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. కానీ కోట్ల రూపాయల క్యాష్ తీసుకుని జాబ్స్ ఇవ్వకుండానే బోర్డు తిప్పేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బిజినెపల్లి ప్రేమ్ ప్రకాష్(44) హైదరాబాద్ కు వలసవచ్చాడు.
ఆ క్రమంలో సనత్ నగర్లో ఉన్న తన స్నేహితుడితో కలిసి సంవత్సరం క్రితం కొండాపూర్ వెస్ట్రన్ పెరల్ భవనంలో సంటూ సూ ఇన్నోవేషనస్ పేరిట ఓ సంస్థను మొదలుపెట్టాడు. ఆ తర్వాత నెమ్మెదిగా పలువురికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికారు. ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి లక్షాయాబై వేల రూపాయల వరకు వసూలు చేశారు. అయితే శిక్షణ తర్వాత కూడా అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా మాయమాటలు చెప్పి రెండు మూడు నెలలు అలాగే పని చేయించుకున్నారు. అయినప్పటికీ వేతనాలు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు విషయం తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు(police) ప్రేమ ప్రకాశ్, లిఖిత్ లను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అయితే నిందితులు మూడు కోట్ల రూపాయలు బాధితుల నుంచి వసూలు చేసినట్లు తెలుస్తోంది.