NLG: దేవరకొండలోని రిటైర్డ్ ఎంప్లాయిస్ భవన్లో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తాడిశెట్టి నరసింహ, అంకం చంద్రమౌళి తెలిపారు. హైదరాబాద్ నుంచి కంటి వైద్య నిపుణులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్ దారులు, ఉద్యోగులు, ఆరోగ్యశ్రీ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.