MBNR: అంబా భవాని ఆలయ భూముల పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తామని ఎస్.ఎస్.కే సమాజ్ జాతీయ అధ్యక్షులు నాగురావు నామాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబా భవాని దేవాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి భూములను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న వారు తమ ప్రయత్నాలను మానుకోవాలన్నారు.