»No Need To Worry About H3n2 Influenza Virus Say Health Officials
Influenza H3N2: ఆందోళన అవసరం లేదు , అవన్నీ వైరల్ జ్వరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) ప్రస్తుతం అన్నీ సాధారణ వైరల్ జ్వరాలు కనిపిస్తున్నాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. తిరుపతి స్విమ్స్ (tirupati svims hospital)లోని వీఆర్డీఎల్ ల్యాబ్ లో దాదాపు 750 నమూనాలను పరిశీలించగా, జనవరి నెలలో 12, ఫిబ్రవరిలో 9 చొప్పున H3N2 కేసులు కనిపించాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) ప్రస్తుతం అన్నీ సాధారణ వైరల్ జ్వరాలు కనిపిస్తున్నాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ (Health Department) గురువారం ప్రకటించింది. తిరుపతి స్విమ్స్ (tirupati svims hospital)లోని వీఆర్డీఎల్ ల్యాబ్ లో దాదాపు 750 నమూనాలను పరిశీలించగా, జనవరి నెలలో 12, ఫిబ్రవరిలో 9 చొప్పున H3N2 కేసులు కనిపించాయన్నారు. ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ లో (Influenza H3N2) H3N2 ఉపరకం వల్ల జ్వరం వస్తుందని తెలిపింది. వాతావరణంలో మార్పుల కారణంగా ఇవి వస్తున్నట్లు వెల్లడించింది. క్లాస్ రూమ్ లు, ఆఫీస్ లు, జనాల రద్దీ ఉన్న చోట మాస్కులు (Mask) ధరిస్తే మంచిది అని సూచించారు. జ్వరం, దగ్గుతో బాధపడేవారు రెండు మూడు రోజుల పాటు విద్యాలయానికి (School) లేదా ఆఫీస్ కు (office) వెళ్లకుంటే మంచిదని చెప్పారు. అయితే అనవసరంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కొత్త రకం ఫ్లూ ఇన్‌ప్లుయెంజా H3N2 (Influenza H3N2) కారణంగా ముక్కు నుండి గొంతు వరకు ప్రభావం ఉంటుందని తెలిపింది. కరోనా మహమ్మారిలా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకు పోయే ప్రభావం లేదని వెల్లడించింది. రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్న కొందరిలో ఊపిరితిత్తుల్లోకి చేరి న్యూమోనియాకు దారి తీస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఫ్లూ చిన్న పిల్లలు, వృద్ధుల్లో కొంత మేర ప్రభావం చూపుతోందని పేర్కొన్నది. ఈ ఫ్లూను కనిపెట్టడం చాలా తేలిక అని వెల్లడించింది. దగ్గుతో పాటు వచ్చే కఫం రంగు ఆకుపచ్చగా లేదా పసుపు రంగులో ఉంటే, న్యూమోనియా వచ్చే అవకాశం ఉందని భావించాలని, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆర్టీపీసీఆర్ టెస్టుల ద్వారా కేసులను గుర్తిస్తున్నట్లు చెప్పింది. దగ్గు, జలుపు, జ్వరం లక్షణాలు ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని, ఇలాంటి వైరల్ జ్వరాలకు యాంటీ బయోటిక్స్ పని చేయవని తెలిపింది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని తెలిపింది. జ్వరం వచ్చిందని ప్రజలు అనవసరంగా టెన్షన్ పడవద్దని మరోసారి హితవు పలికింది.
ఈ ఫ్లూ ప్రభావం ఉంటే జలుపు, దగ్గు, ముక్కు కారటం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పింది. ఏ వయస్సులో ఉన్న వారు అయినప్పటికీ లక్షణాలను అనుసరించి మెడిసిన్ ఇవ్వవలసి ఉంటుందని చెప్పింది. కొద్ది రోజులు గడిస్తే ఈ వైరస్ అదృశ్యమవుతుందని తెలిపింది. చిన్నారులు మగతగా, జ్వరంతో ఉంటే డాక్టర్ ను సంప్రదించాలని సూచించింది. గర్భిణీలు, వృద్ధులు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
భారత్ లో ఇన్‌ప్లుయెంజా H3N2 కేసులు ఇటీవల హఠాత్తుగా పెరిగాయి. ఇది ఆందోళన కలిగించింది. అయితే ఇది ప్రాణాంతకం కాదు. రద్దీగా ఉన్న చోట మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. H3N2 అనేది ఓ రకమైన ఇన్ఫ్లుయెంజా వైరస్ అని, ప్రతి సంవత్సరం వాతావరణ మార్పుల సమయంలో జ్వరం వంటివి సహజమేనని, అయితే వైరస్ కాలక్రమేణా పరివర్తనం చెందుతుందని చెబుతున్నారు. కరోనా మాదిరిగానే ఇది వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. మాస్కు ధరించడం, తరుచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎయిమ్స్ మాజీ టాప్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
H3N2 ఇన్‌ఫ్లుయెంజాతో రెండు మరణాలు
H3N2 ఇన్‌ఫ్లుయెంజాతో రెండు మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో ఒకరు కర్నాటకలో, మరొకరు హర్యానాలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దేశంలో 90 కేసులు నమోదయ్యాయి. H1N1 కు చెందన ఎనిమిది కేసులు నమోదయ్యాయి.