»Icmr Advises Against Indiscriminate Antibiotic Use Amid Rising Cases Linked To H3n2
H3N2 influenza cases: కొత్త రకం వైరస్, ICMR ఏం చెప్పిందంటే
H3N2 ఇన్ఫ్లుయెంజా కారణంగా గత రెండు మూడు నెలలుగా భారత్ లో జ్వరం, నిరంతర దగ్గుతో కూడిన పేషెంట్లు హాస్పిటల్స్ లో చేరుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. హాస్పిటల్స్ శ్వాస కోశ సమస్యలతో హాస్పిటల్స్ లో చేరుతున్న చాలామందికి H3N2 రకం వైరస్ కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు తెలిపింది.
H3N2 ఇన్ఫ్లుయెంజా (H3N2 influenza cases) కారణంగా గత రెండు మూడు నెలలుగా భారత్ లో (India) జ్వరం, నిరంతర దగ్గుతో కూడిన పేషెంట్లు హాస్పిటల్స్ లో (Hospital) చేరుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. హాస్పిటల్స్ శ్వాస కోశ సమస్యలతో (respiratory issues) హాస్పిటల్స్ లో చేరుతున్న చాలామందికి H3N2 రకం వైరస్ కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు తెలిపింది. వాతావరణ మార్పుల సమయంలో ఇలాంటి కేసులు వస్తాయని, అయితే సాధారణ ఇన్ఫ్లుయెంజా వేరియంట్స్ కంటే H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ బలంగా ఉందని చెబుతోంది. ఇది సోకిన వారిలో 92 శాతం మందికి జ్వరం, ఒళ్లు నొప్పులు, 86 శాతం రోగుల్లో తీవ్రమైన దగ్గు, 27 శాతం మంది బాధితుల్లో శ్వాస కోశ సమస్య, 16 శాతం మందిలో విపరీతమైన తుమ్మలు, 6 శాతం మందిలో మూర్చరావడం ప్రధాన లక్షణాలుగా ఉన్నట్లు పేర్కొన్నది. ఈ వైరస్ కారణంగా జ్వరం వారం రోజుల్లో తగ్గిపోయినప్పటికీ, దగ్గు మాత్రం మూడు వారాల వరకు ఉంటోంది. గత రెండు మూడు నెలలుగా H3N2 ఇన్ఫ్లుయెంజా కనిపిస్తోందని తెలిపింది. H3N2 గత రెండు మూడు నెలలుగా విస్తరిస్తోందని తెలిపింది.
H1N1తో పోలిస్తే H3N2 ఇన్ఫ్లుయెంజా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని డాక్టర్ డాంగ్స్ ల్యాబ్ సీఈవో డాక్టర్ అర్జున్ డాంగ్ తెలిపారు. ఇతర వేరియంట్స్ కంటే ఈ వేరియంట్ కారణంగా ఎక్కువగా శ్వాస కోశ ఇబ్బందులు కనిపిస్తున్నట్లు తెలిపారు. జ్వరం రావడం, నిరంతరంగా దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, వాంతులు, డయేరియా వంటివి H3N2 లక్షణాలుగా చెప్పారు. రెస్పిరేటరీ వైరస్ సర్వైవలెన్స్ కు సంబంధించి ఐసీఎంఆర్ 30 వరకు వైరల్ రీసెర్చ్ అండ్ డయోగ్నస్టిక్స్ లేబోరేటరీస్ ను కలిగి ఉన్నట్లు చెప్పారు. ఇవన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లోని టాప్ మెడికల్ కాలేజీలకు అటాచ్ అయి ఉన్నాయని వెల్లడించారు. వీటి నుండి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుందని తెలిపారు.
కరోనా మహమ్మారి (Covid 19) తర్వాత H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ (H3N2 influenza cases) ఆందోళన కలిగిస్తోన్న విషయం తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, ఉత్తర ప్రదేశ్ లో హై-అలర్ట్ ప్రకటించారు. వివిధ ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెంజా వైరస్ విజృంభిస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ (Uttar Pradesh’s Kanpur)లో 200 కేసులు నమోదయ్యాయి. ఇందులో 50 మందిని హాలెట్ ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించి, పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. వీరంతా జ్వరం, నిరంతరాయంగా దగ్గు, శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నారు. హాస్పిటల్ బయట రోగులు బారులు తీరారు. ప్రయివేటు హాస్పిటల్స్ కు కూడా రోగులు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఇన్ఫ్లుయెంజా ఎ వైరస్ కు ఉప రకంగా భావిస్తున్న H3N2 వైరస్ గత నెల నెలలుగా వివిధ ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతోంది.
ఐదారు రోజులు జ్వరం, ఆ తర్వాత దగ్గు లక్షణాలు కనిపించాయని, ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిందని, దీంతో హాస్పిటల్ తరలించినట్లు కాన్పూర్ లో అడ్మిట్ అయిన పేషెంట్లు చెబుతున్నారు. వాతావరణ మార్పులు వచ్చినప్పుడు ఇలాంటి కేసులు సాధారణమేనని, కానీ ఈసారి ఎక్కువగా వచ్చాయని, ఎక్కువ మంది జ్వరం, దగ్గు, శ్వాస కోశ సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్ చెబుతున్నారు. హాస్పిటల్ లో చేరిన పలువురికి ఆక్సిజన్ అందించాల్సి అందించే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వెంటి లెటర్ పైన కూడా ఉన్నారు. కాన్పూర్ లోనే కాదు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. చాలామంది శ్వాస కోశ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.