»Increasing Cases Of H3n2 In Kanpur Up Corona Virus Is The Reason
Kanpur:లో పెరుగుతున్న H3N2 కేసులు..కరోనానే కారణం?
కోవిడ్ వ్యాధి తగ్గిందనుకున్న తరుణంలో అదే లక్షణాలతో పదుల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఉత్తరప్రదేశ్(uttar pradesh) లోని కాన్పూర్(Kanpur) హాలెట్ ఆసుపత్రిలో ఒక్కరోజులోనే దాదాపు 200 మంది చేరితో వారిలో 50 మందికి కరోనా సంబంధిత H3N2 ఇన్ఫ్లుఎంజా(Corona virus symptoms) లక్షణాలున్నట్లు తేలింది. ఈ క్రమంలో వారికి చికిత్స(treatment) అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
కరోనా మహమ్మారి తగ్గిందని అనుకుంటున్న తరుణంలోనే మళ్లీ భయాందోళన మొదలైంది. ఇటీవల ఒక్క రోజులోనే H3N2 ఇన్ఫ్లుఎంజా(Corona virus symptoms) కారణంగా 50 మంది రోగులు ఉత్తరప్రదేశ్(uttar pradesh) లోని కాన్పూర్(Kanpur )హాలెట్ ఆసుపత్రిలో చేరారు. అయితే చేరిన 200 మందిలో 50 మందికి అధిక జ్వరం, నిరంతర దగ్గు, శ్వాస ఆడకపోవటం వంటి సమస్యలు ఉన్నట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. హాలెట్లోని ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు నిండిపోవడంతో రోగులను వేరే వార్డులకు తరలించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు కాన్పూర్లోని అతిపెద్ద ప్రభుత్వ (హాలెట్) ఆసుపత్రి వెలుపల మాత్రమే కాకుండా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్న రోగులు జాయిన్ అయినట్లు తెలిసింది. H3N2, ఇన్ఫ్లుఎంజా A ఉప రకం దాదాపు నెల రోజుల నుంచి వ్యాప్తి(Corona virus symptoms) చెందుతోందని డాక్టర్లు(doctors) అంటున్నారు.
రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. మేము ఔరయా నుంచి కాన్పూర్(Kanpur)కు చికిత్స(treatment) కోసం వచ్చామని రోగి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రోగికి ఐదు నుంచి ఆరు రోజులు జ్వరం, దగ్గు కూడా ఉందన్నారు. అతను ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రారంభించినప్పుడు తాను అతన్ని కాన్పూర్కి తీసుకువచ్చామని వెల్లడించారు.
ఇంకోవైపు వాతావరణంలో మార్పు కారణంగా, ప్రతి సంవత్సరం ఇలాంటి కేసులు చాలా కనిపిస్తాయని కాన్పూర్లోని హలత్ హాస్పిటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్ రిచా గిరి చెబుతున్నారు. అయితే ఈసారి దగ్గుతో బాధపడుతున్న రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. జ్వరం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఉన్నవారిని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే 23 మంది రోగులు మాత్రమే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నారని తెలిసిందని తెలిపారు. వారికి ఆక్సిజన్ అందిస్తూ మరికొంత మందికి వెంటిలేటర్ల ద్వారా చికిత్స(treatment) అందిస్తున్నట్లు వెల్లడించారు.