H3N2 Influenza Virus : దేశంలో బాగా పెరిగిన కరోనా కేసులు…!
H3N2 : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ కరోనా విజృంభించడం మొదలుపెడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 754 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4623కి చేరింది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ కరోనా విజృంభించడం మొదలుపెడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 754 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4623కి చేరింది. గత నాలుగు నెలలుగా 700 కేసులలోపే కరోనా కేసులు నమోదౌతున్నాయి. తాజాగా ఆ సంఖ్య దాటింది. 754 కేసులు నమోదు కావడం అధికారులను కలవరానికి గురిచేస్తొంది.
తెలంగాణలో కూడా కరోనా వ్యాప్తి నెమ్మదిగా పెరుగుతోంది. ఇక్కడ పెరుగుతున్న తాజా కేసులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా 54 కేసులు వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 40 కేసులు ఒక్క హైదరాబాద్ నగరంలోనే నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా…దేశంలో H3N2 ఇన్ ఫ్లూయెంజా వైరస్ కేసులు కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఒడిషా, హర్యానా రాష్ట్రాల్లో తాజాగా ఎక్కువ కేసులు నమోదౌతున్నాయి. తెలంగాణలో కూడా H3N2 ఇన్ ఫ్లూయెంజా వైరస్ కేసులు అధికంగా నమోదౌతున్నాయి. జనవరి 2 నుంచి మార్చి 5 వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 451 H3N2 ఇన్ ఫ్లూయెంజా వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది.